Realme GT 7 Pro Price
Realme GT 7 Pro : రియల్‌మి నుంచి మరో సరికొత్త ఫోన్ రాబోతుంది. వచ్చే నెలలో భారత మార్కెట్లోకి రియల్‌మి జీటీ 8 ప్రో లాంచ్ కానుంది. అంతకన్న ముందుగానే రియల్‌మి జీటీ 7 ప్రో ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. రూ. 59,999 ధరకు లాంచ్ అయిన ఈ హై-పెర్ఫార్మెన్స్ స్మార్ట్‌ఫోన్ డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఇంతకీ రియల్‌మి జీటీ 7 ప్రో డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
రియల్‌మి జీటీ 7 ప్రో డీల్ :
ఫ్లిప్‌కార్ట్‌లో రియల్‌మి జీటీ 7 ప్రో మార్స్ (Realme GT 7 Pro) ఆరెంజ్ వేరియంట్ రూ. 44,999కు లిస్ట్ అయింది. లాంచ్ ధర నుంచి ఫ్లాట్ రూ. 15వేలు తగ్గింపు లభిస్తుంది. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా ఈ ఆఫర్ మరింత తగ్గింపు ధరకే పొందవచ్చు. అంటే.. రూ.2,225 అదనపు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు.
తద్వారా రియల్‌మి జీటీ 7 ప్రో ధర రూ.42,774కి తగ్గుతుంది. మొత్తంగా డిస్కౌంట్‌తో రూ.17,225 సేవ్ చేసుకోవచ్చు. అదనంగా, ఫ్లిప్‌కార్ట్ రూ.48,690 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా అందిస్తోంది. ఈ బోనస్ వాల్యూ అనేది పాత స్మార్ట్‌ఫోన్ మోడల్, వర్కింగ్ కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది.
రియల్‌మి జీటీ 7 ప్రో స్పెసిఫికేషన్లు :
రియల్‌మి GT 7 ప్రో ఫోన్ 6.78-అంగుళాల FHD+ అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు HDR10+, డాల్బీ విజన్‌కు సపోర్టు ఇస్తుంది. టాప్ బ్రైట్‌నెస్‌తో 6500 నిట్స్ నేరుగా సూర్యకాంతిలో కూడా స్క్రీన్ క్లారిటీని అందిస్తుంది. హుడ్ కింద, స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్ కలిగి ఉంది. ఇందులో 50MP మెయిన్ సెన్సార్, 3x ఆప్టికల్ జూమ్‌తో 50MP టెలిఫోటో లెన్స్, 8MP అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి.
సెల్ఫీల విషయానికి వస్తే.. ఈ రియల్‌మి ఫోన్ 16MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌కు 5,800mAh భారీ బ్యాటరీ పవర్ అందిస్తుంది. 120W ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా సపోర్టు ఇస్తుంది. ఈ ఫోన్ మార్స్ ఆరెంజ్, గెలాక్సీ, గ్రే వైట్ కలర్ వేరియంట్‌లలో లభిస్తుంది.