Apple iPhone 16 : కొంటే ఐఫోన్ కొనాల్సిందే.. ఐఫోన్ 16 ధర ఎంతో తెలిస్తే వెంటనే కొనేస్తారు.. ఇలాంటి ఆఫర్ మళ్లీ రాదు!
Apple iPhone 16 Price : ఆపిల్ ఐఫోన్ 16 ధర తగ్గింది. ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 60వేల లోపు ధరకే లభిస్తోంది. ఈ అద్భుతమైన డీల్ అసలు వదులుకోవద్దు.

Apple iPhone 16 Price : కొత్త ఆపిల్ ఐఫోన్ కొంటున్నారా? అయితే, మీకో అద్భుతమైన ఆఫర్.. మీ స్మార్ట్‌ఫోన్ అప్‌గ్రేడ్ చేసేందుకు ఇదే బెస్ట్ టైమ్.. ఆపిల్ ఐఫోన్ 16 భారీ తగ్గింపు ధరకే లభిస్తోంది. కొనుగోలుదారులు బ్యాంక్ కార్డ్‌తో ఐఫోన్ 16పై రూ.10వేల కన్నా ఎక్కువ సేవ్ చేసుకోవచ్చు. వాస్తవానికి, భారత మార్కెట్లో ఐఫోన్ 16 ధర రూ.79,999కి లాంచ్ అయింది. ఐఫోన్ 17 లాంచ్ తర్వాత రూ.70వేల కన్నా తక్కువ ధరకు అందుబాటులో ఉంది.

ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.60వేల కన్నా తక్కువ ధరకు ఐఫోన్ 16 కొనుగోలు చేయవచ్చు. ఇందులో ప్రీమియం డిజైన్, డ్యూయల్ కెమెరా సెటప్, పవర్‌ఫుల్ A-సిరీస్ ప్రాసెసర్ వంటి మరెన్నో ఫీచర్లు ఉన్నాయి. మీరు కూడా ఐఫోన్ 16 కొనాలని చూస్తుంటే ఈ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం..

ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 16 ధర : ఆపిల్ ఐఫోన్ 16 ధర రూ.62,999కి అందుబాటులో ఉంది. సాధారణ ధర కన్నా రూ.7వేలు భారీ తగ్గింపు పొందవచ్చు. కస్టమర్లు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్, ఎస్బీఐ బ్యాంక్ కార్డుతో రూ.4వేల వరకు బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చు. తద్వారా ధర రూ.60వేల కన్నా తక్కువకే లభ్యమవుతుంది. ఐఫోన్ 16eతో పోలిస్తే.. అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.

కానీ, సింగిల్ కెమెరా, స్మాల్ డిస్‌ప్లే మాత్రమే అందిస్తుంది. మీ దగ్గర పాత ఫోన్ ఉంటే.. కొత్త ఐఫోన్ 16తో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. తద్వారా రూ.61వేల వరకు వాల్యూను పొందవచ్చు. కానీ, మీ పాత ఫోన్ వాల్యూ, వర్కింగ్ కండిషన్, ఇతర అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఆసక్తిగల కొనుగోలుదారులు నెలకు రూ.2,215 నుంచి ఈఎంఐ ఆప్షన్లను కూడా ఎంచుకోవచ్చు.

ఆపిల్ ఐఫోన్ 16 స్పెసిఫికేషన్లు : ఆపిల్ ఐఫోన్ 16 మోడల్ 6.1-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ ప్యానెల్‌తో 60Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఆపిల్ A18 బయోనిక్ చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. 8GB ర్యామ్ అందిస్తుంది. iOS 26 అప్‌డేట్‌పై రన్ అవుతుంది.

ఐఫోన్ 15తో పోలిస్తే.. అద్భుతమైన బ్యాటరీ బ్యాకప్ అందిస్తుంది. కెమెరా విషయానికి వస్తే.. ఐఫోన్ 16 మోడల్ 48MP మెయిన్, 12MP అల్ట్రావైడ్ సెన్సార్ అందిస్తుంది. ఫ్రంట్ సైడ్ 12MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంది.
