Realme Narzo N55 India
Realme Narzo N55 : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ తయారీదారు రియల్‌మి (Realme) నుంచి త్వరలో భారత మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌ఫోన్ రాబోతోంది. ఇటీవలే కొత్త నార్జో N-సిరీస్ లైనప్‌ను కంపెనీ రివీల్ చేసింది. రియల్‌మి నార్జో N55 సిరీస్‌లో ఇదే ఫస్ట్ మోడల్ కావచ్చు. రియల్‌మి నుంచి ఇంకా అధికారికంగా వివరాలను వెల్లడించలేదు.
కొత్త నివేదిక ప్రకారం.. ఇప్పుడు భారత మార్కెట్లో ఈ ఫోన్ లాంచ్ టైమ్‌లైన్‌ను సూచించింది. కొన్ని కీలక స్పెసిఫికేషన్‌లను కూడా లీక్ చేసింది. రియల్‌మి ఇటీవలే (Realme C55)ని మినీ క్యాప్సూల్ ఫీచర్‌తో లాంచ్ చేసింది. ఆపిల్ ఐఫోన్ (Apple iPhone)లలో డైనమిక్ ఐలాండ్ ఫీచర్ లాగా కనిపిస్తుంది.
రియల్‌మి (Realme GT Neo 5 SE) కూడా ఏప్రిల్ 3న లాంచ్ కానుంది. 91Mobiles నివేదిక ప్రకారం.. రియల్‌మి Narzo N55 ఏప్రిల్ చివరిలో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. ఈ ఫోన్ ప్రైమ్ బ్లాక్, ప్రైమ్ బ్లూ అనే రెండు కలర్ ఆప్షన్లలో రానుంది. రాబోయే Realme హ్యాండ్‌సెట్ 4 స్టోరేజ్ కాన్ఫిగరేషన్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుందని నివేదిక సూచిస్తోంది.
Realme Narzo N55 India
4GB + 64GB, 4GB + 128GB, 6GB + 64GB టాప్-ఆఫ్-ది-లైన్ 6GB + 128GB వేరియంట్. ఈ ఫోన్ ధర ఎంత అనేది ఇంకా రివీల్ చేయలేదు. మిడ్-రేంజ్ ధరకే అందించనున్నట్టు సూచించింది. ఈ రిపోర్టు కొత్త Realme Narzo N-సిరీస్ అధికారిక Realme టీజర్‌ను అందించనుంది. భారత మార్కెట్లో N-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లలో Realme Narzo N55 మొదటిది కావచ్చని అంచనా.
రియల్‌మి (Realme) ఇటీవలే 240W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో (Realme GT Neo 5) స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. కొత్త ఛార్జింగ్ టెక్నాలజీ ఫోన్‌ను 80 సెకన్లలో సున్నా నుంచి 20 శాతానికి, 4 నిమిషాల్లో 50 శాతానికి, 10 నిమిషాల కన్నా తక్కువ వ్యవధిలో 100 శాతానికి ఛార్జ్ చేస్తుందని పేర్కొంది. Realme GT Neo 5 కొత్త వేరియంట్, (Realme GT Neo 5 SE) ఫోన్ 5,500mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో ఏప్రిల్ 3న లాంచ్ కానుంది.
రియల్‌మి GT Neo 5 మాదిరిగానే ఉంటుంది. కానీ, కొంచెం తక్కువ స్పెసిఫికేషన్‌లతో రానుంది. Realme GT Neo 5లో కనిపించే స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 చిప్‌సెట్‌కు బదులుగా Qualcomm కొత్త స్నాప్‌డ్రాగన్ 7+ Gen 2 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుందని సూచించింది.