Realme P3 5G Leak : రియల్‌మి P3 5జీ ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ఫీచర్లు లీక్..

Realme P3 5G Leak : టాప్-ఆఫ్-ది-లైన్ 8జీబీ + 256జీబీ వెర్షన్ కామెట్ గ్రే, స్పేస్ సిల్వర్ షేడ్స్‌లో అందిస్తుందని భావిస్తున్నారు.

Realme P3 5G Features Leaked

Realme P3 5G Leak : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లో కంపెనీ థర్డ్ జనరేషన్ పి సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లలో భాగంగా రియల్‌మి పి3 5జీ త్వరలో భారత మార్కెట్లో లాంచ్ కానుంది. ఈ లైనప్‌లో ప్రామాణిక మోడల్‌తో పాటు ప్రో, అల్ట్రా వేరియంట్‌లు ఉంటాయి.

Read Also : Realme Republic Day Sale : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? రియల్‌మి రిపబ్లిక్ డే సేల్.. ఈ రియల్‌మి ఫోన్లపై భారీ డిస్కౌంట్..!

రియల్‌మి పి3 ప్రో, రియల్‌మి పి3 అల్ట్రా వివరాలు, ప్రాబబుల్ లాంచ్ టైమ్‌లైన్ ర్యామ్, స్టోరేజ్ ఆప్షన్‌లతో సహా గత కొన్ని రోజులుగా ఆన్‌లైన్‌లో కనిపించాయి. ఇప్పుడు, రియల్‌మి పి3 5జీ కలర్లు, ర్యామ్, స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లు లీక్ అయ్యాయి.

భారత్‌‌లో రియల్‌మి పి3 5జీ ఫీచర్లు :
రియల్‌‌‌మి పి3 5జీ మోడల్ నంబర్ ఆర్ఎమ్ఎక్స్5070 కలిగి ఉందని 91మొబైల్స్ నివేదిక పేర్కొంది. లాంచ్ టైమ్‌లైన్ రిపోర్ట్‌లో సూచించలేదు. అయితే, లీక్ వివరాలు ఫోన్ లాంచ్ తేదీని సూచిస్తున్నాయి. ఈ ఫోన్ బేస్ 6జీబీ+ 128జీబీ ఆప్షన్ కామెట్ గ్రే, నెబ్యులా పింక్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది. రియల్‌మి పి3 5జీ ఫోన్ 8జీబీ ర్యామ్ వేరియంట్‌లు 128జీబీ, 256జీబీ స్టోరేజ్ ఆప్షన్‌లలో వస్తాయి.

టాప్-ఆఫ్-ది-లైన్ 8జీబీ + 256జీబీ వెర్షన్ కామెట్ గ్రే, స్పేస్ సిల్వర్ షేడ్స్‌లో అందిస్తుందని భావిస్తున్నారు. 8జీబీ + 128జీబీ ఆప్షన్ మూడు కలర్ ఆప్షన్లలో వస్తుందని అంచనా. వెనిలా రియల్‌మి పి3 5జీ ఫోన్ గురించి మరిన్ని వివరాలు అందుబాటులో లేవు. రాబోయే వారాల్లో ఈ హ్యాండ్‌సెట్ గురించి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ముఖ్యంగా, రియల్‌మి పి2 సిరీస్ బేస్ పి2 మోడల్‌ను కలిగి లేదు.

రియల్‌మి పి1 5జీ పి సిరీస్‌లో మొదటి మోడల్. ఆర్ఎమ్ఎక్స్5032 మోడల్ నంబర్‌తో ఉన్న రియల్‌మి పీ3 ప్రో 12జీబీ ర్యామ్, 256జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఫోన్ ఫిబ్రవరి మూడో వారంలో భారత మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ కొత్త మోడల్ నంబర్‌తో ఉన్న టాప్-ఆఫ్-ది-లైన్ రియల్‌మి పి3 అల్ట్రా మోడల్ ఇలాంటి ర్యామ్, స్టోరేజ్ ఆప్షన్‌లకు సపోర్టు ఇస్తుందని భావిస్తున్నారు. జనవరి చివరి నాటికి భారత మార్కెట్లో లాంచ్ కావచ్చు.

Read Also : Realme 14 Pro 5G : టైటాన్ బ్యాటరీతో రియల్‌మి 14ప్రో 5జీ సిరీస్ వచ్చేసింది.. ధర, ఫీచర్లు వివరాలివే!