Realme P4x Launch : సూపర్ ఫోన్ భయ్యా.. కొత్త రియల్‌మి P4x 5G ఫోన్ వచ్చేసింది.. ధర తక్కువ.. ఫీచర్లు ఎక్కువ..!

Realme P4x Launch : రియల్‌మి నుంచి సరికొత్త ఫోన్ లాంచ్ అయింది. 7400 అల్ట్రా మీడియాటెక్ డైమన్షిటీతో భారత మార్కెట్లో రిలీజ్ అయింది. ధర, ఫీచర్ల వివరాలు ఇవే..

1/6Realme P4x Launch
Realme P4x Launch : కొత్త రియల్‌మి ఫోన్ వచ్చేసిందోచ్.. భారత మార్కెట్లో రియల్‌మి కొత్త రియల్‌మి P4x 5G ఫోన్ లాంచ్ చేసింది. ఈ సిరీస్ లైనప్‌ను అధికారికంగా విస్తరించింది. హై రిఫ్రెష్ రేట్, కొత్త మీడియాటెక్ డైమెన్సిటీ చిప్‌సెట్‌తో పాటు గత ఫోన్‌తో పోలిస్తే భారీ బ్యాటరీతో వస్తుంది. ఎక్కువ సమయం ఫోన్ వాడినప్పటికీ హీట్ లేకుండా ఉండేందుకు స్టీమ్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ వంటి అప్‌గ్రేడ్‌లు కూడా ఉన్నాయి. ప్రత్యేకించి గేమర్లకు ఈ ఫోన్ అద్భుతంగా ఉంటుంది. రియల్‌మి P4x ఫోన్ ధర, స్పెసిఫికేషన్లపై ఓసారి లుక్కేయండి..
2/6Realme P4x Launch
రియల్‌మి P4x 5G స్పెసిఫికేషన్లు : ఈ స్మార్ట్‌ఫోన్ 6.72-అంగుళాల ఫుల్ HD+ LCD ప్యానెల్‌ కలిగి ఉంది. వేరియబుల్ రిఫ్రెష్ రేట్‌తో 60Hz, 144Hz మధ్య మారగలదు. 1000 నిట్స్ వరకు టాప్ బ్రైట్‌నెస్ అందిస్తుంది. ఈ రియల్‌మి ఫోన్ మీడియాటెక్ డైమన్షిటీ 7400 అల్ట్రా చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. మాలి-G615 MC2 జీపీయూతో వస్తుంది.
3/6Realme P4x Launch
ఈ రియల్‌మి ఫోన్ 6GB లేదా 8GB LPDDR4X ర్యామ్, 128GB లేదా 256GB UFS 3.1 స్టోరేజీతో వస్తుంది.మైక్రో SD కార్డ్ ద్వారా 2TB వరకు స్టోరేజీ విస్తరించుకోవచ్చు. రియల్‌మి P4x ఫోన్ 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 7,000mAh బ్యాటరీని కలిగి ఉంది. రియల్‌మి యూఐ 6.0తో ఆండ్రాయిడ్ 15పై రన్ అవుతుంది. ఈ రెండు OS అప్‌గ్రేడ్‌లు 3 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ పొందవచ్చు.
4/6Realme P4x Launch
ఆప్టిక్స్ విషయానికి వస్తే.. బ్యాక్ కెమెరా సెటప్‌లో 50MP OV50D40 ప్రైమరీ సెన్సార్, 2MP సెకండరీ లెన్స్ ఉన్నాయి. 30fps వద్ద 4K వీడియోకు సపోర్టు ఇస్తాయి. ఫ్రంట్ సైడ్ 1080p రికార్డింగ్ 8MP కెమెరా ఉంది. ఈ పరికరంలో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, స్టీరియో స్పీకర్లు, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, IP64 డస్ట్ స్ప్లాష్ రెసిస్టెన్స్, Wi-Fi 6, బ్లూటూత్ 5.2 డ్యూయల్ 5G సపోర్ట్ కూడా ఉన్నాయి.
5/6Realme P4x Launch
రియల్‌మి P4x భారత్ ధర ఎంతంటే? : రియల్‌మి P4x 5G ఫోన్ మాట్టే సిల్వర్, ఎలిగెంట్ పింక్ లేక్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో పొందవచ్చు. 6GB+128GB వేరియంట్ ధర రూ.15,999, 8GB+128GB మోడల్ ధర రూ.17,499, 8GB+256GB ఆప్షన్ ధర రూ.19,499కు లభ్యం కానుంది.
6/6Realme P4x Launch
బ్యాంక్ ఆఫర్లతో రియల్‌మి P4x ఫోన్ ప్రారంభ ధర రూ.13,499కి తగ్గింపు పొందవచ్చు. ఫస్ట్ సేల్ డిసెంబర్ 10న మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానుంది. (realme.com, Flipkart) ఆఫ్‌లైన్ రిటైల్ ఛానెల్‌లలో కొనుగోలు చేయొచ్చు.