Red Magic 10 Pro Launch
Red Magic 10 Pro Launch : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? చైనాలో లాంచ్ చేసిన నెల తర్వాత ప్రపంచ మార్కెట్లలో రెడ్ మ్యాజిక్ 10 ప్రో ఫోన్ లాంచ్ అయింది. ఈ రెడ్ మ్యాజిక్ ప్రో మోడల్ గ్లోబల్ వేరియంట్ చైనీస్ మోడల్‌కు సమానమైన స్పెసిఫికేషన్‌లను కలిగి ఉంది.
కొంచెం నెమ్మదిగా 100డబ్ల్యూ ఛార్జింగ్‌కు అనుకూలంగా 120డబ్లూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు అందిస్తుంది. క్వాల్‌కామ్ లేటెస్ట్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్ ద్వారా ఆధారితమైనది. థర్మల్‌ను కంట్రోలింగ్ చేసే లిక్విడ్ మెటల్ కూలింగ్‌తో కూడిన డ్యూయల్-పంప్ స్టీమ్ రూమ్ కలిగి ఉంది.
రెడ్ మ్యాజిక్ 10 ప్రో ధర :
రెడ్ మ్యాజిక్ 10ప్రో బేస్ 12జీబీ+ 256జీబీ వేరియంట్ ధర 649 డాలర్లు (సుమారు రూ. 55వేలు) నుంచి ప్రారంభమవుతుంది. రెండు ఇతర స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లలో అందుబాటులో ఉంది. 16జీబీ+ 512జీబీ మోడల్ ధర 799 డాలర్లు (దాదాపు రూ. 68వేలు), 24జీబీ+ 1టీబీ వేరియంట్ ధర 999 డాలర్లు (సుమారు రూ. 85వేలు).
ఆసియా-పసిఫిక్, యూరప్, లాటిన్ అమెరికా, ఉత్తర అమెరికా, మిడిల్ ఈస్ట్, యూకే, అమెరికాలో కొనుగోలుకు అందుబాటులో ఉంది. డిసెంబర్ 12 నుంచి ప్రారంభ ధరకు కొనుగోలు చేయొచ్చు. అయితే, ఓపెన్ సేల్స్ డిసెంబర్ 18న ప్రారంభమవుతాయి. ఈ హ్యాండ్‌సెట్ మొత్తం సన్‌సెట్, మూన్ లైట్, షాడో అనే మూడు కలర్ ఆప్షన్లలో వస్తుంది.
రెడ్ మ్యాజిక్ 10 ప్రో స్పెసిఫికేషన్స్ :
రెడ్ మ్యాజిక్ 10 ప్రో డ్యూయల్ సిమ్ (నానో+నానో) ఆండ్రాయిడ్ 15 అవుట్-ఆఫ్-ది-బాక్స్ ఆధారంగా రెడ్ మ్యాజిక్ ఓఎస్ 10.0పై రన్ అవుతుంది. 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.8-అంగుళాల ఫుల్-హెచ్‌డీ+ (1,216×2,688 పిక్సెల్‌లు) బీఓఈ క్యూ9+ డిస్‌ప్లే, 2,000 నిట్స్ గరిష్ట ప్రకాశం, 10-బిట్ కలర్ డెప్త్, 100 శాతం డీసీఐ-పీ3 కలర్ గామట్ కవరేజీని కలిగి ఉంది. హుడ్ కింద క్వాల్‌కామ్ ఫ్లాగ్‌షిప్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. గరిష్టంగా 24జీబీ వరకు ఎల్‌పీడీడీఆర్5ఎక్స్ అల్ట్రా ర్యామ్, 1టీబీ వరకు యూఎఫ్ఎస్ 4.1 ప్రో స్టోరేజ్‌తో వస్తుంది.
ప్రత్యేకమైన రెడ్ కోర్ ఆర్3 గ్రాఫిక్స్ చిప్‌ను కూడా కలిగి ఉంది. డబుల్ ఫ్రేమ్ 2కె అప్‌స్కేలింగ్, కృత్రిమ మేధస్సు (AI) ద్వారా నడిచే విజువల్స్‌ను మెరుగుపరుస్తుందని పేర్కొన్నారు. థర్మల్‌లను అదుపులో ఉంచడానికి కంపెనీ తన లేటెస్ట్ ఫోన్‌లో 12వేల చదరపు మిల్లీమీటర్ల డ్యూయల్-పంప్ స్టీమ్ చాంబర్, గ్రాఫేన్ షీట్, లిక్విడ్ మెటల్ కూలింగ్‌తో కూడిన ఐసీఈ-ఎక్స్ మ్యాజిక్ కూలింగ్ సిస్టమ్‌ను అమర్చారు.
ఆప్టిక్స్ విషయానికి వస్తే.. రెడ్ మ్యాజిక్ 10 ప్రో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో ఓమ్నివిజన్ OV50E40 సెన్సార్‌తో 50ఎంపీ ప్రైమరీ కెమెరా, ఓమ్నివిజన్ OV50D, 120-డిగ్రీ సెన్సర్‌తో కూడిన 50ఎంపీ అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపీ ఓమ్నివిజన్ OV02F10 మాక్రో కెమెరాలు ఉన్నాయి.
సెల్ఫీల కోసం 16ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌లలో కనెక్టివిటీ ఆప్షన్లలో 5G, 4G LTE, Wi-Fi 7, GPS, NFC, 3.5ఎమ్ఎమ్ హెడ్‌ఫోన్ జాక్, యూఎస్‌బీ 3.2 టైప్-సి పోర్ట్ ఉన్నాయి. రెడ్ మ్యాజిక్ 10ప్రో 100డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 7,050mAh డ్యూయల్-సెల్ బ్యాటరీని అందిస్తుంది.