Redmi 17 5G Launch : వారెవ్వా.. కొత్త రెడ్మి 17 5G ఫోన్ అతి చౌకైన ధరలో.. ఫస్ట్ సేల్ ఎప్పుడంటే?
Redmi 17 5G Launch : కొత్త రెడ్మి17 5జీ ఫోన్ అదుర్స్.. భారత మార్కెట్లో 7,900mAh బ్యాటరీ ఫోన్ అతి చౌకైన ధరకే లభిస్తోంది. ధర, స్పెషిఫికేషన్ల వివరాలివే..
Redmi 17 5G Launch
- 6.9-అంగుళాల డిస్ప్లేతో వస్తుంది
- 50MP ప్రైమరీ కెమెరా సెటప్
- 7900mAh బ్యాటరీ అద్భుతం
Redmi 17 5G Launch : షావోమీ లవర్స్ కోసం అద్భుతమైన ఫోన్.. ఈ చైనా కంపెనీ సబ్ బ్రాండ్ రెడ్మి నుంచి సరికొత్త రెడ్మి17 5జీ ఫోన్ భారత మార్కెట్లో లాంచ్ అయింది. ఈ రెడ్మి ఫోన్లో 7,900mAh బ్యాటరీ ఉంది.
సింగిల్ ఛార్జ్‌పై ఎక్కువ సేపు రన్ అవుతుంది. ఆక్టా-కోర్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 4 సిరీస్ చిప్సెట్తో రన్ అవుతుంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా ఉంది. రెడ్మి 17 5జీ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ధరకు సంబంధించి పూర్తి వివరాలివే..
ధర, లభ్యత :
రెడ్మి 17 5జీ ఫోన్ రెండు స్టోరేజీ వేరియంట్లలో లభిస్తోంది. 6GB+128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.23,999కే లభిస్తోంది. అలాగే, 8GB+128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.26,999కే లభిస్తోంది.
సెప్టెంబర్ 10 నుంచి ఈ-కామర్స్ సైట్ అమెజాన్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉంటుంది. అలాగే కంపెనీ అధికారిక వెబ్సైట్లో కూడా కొనేసుకోవచ్చు. వినియోగదారులు రెడ్మి 17 5జీ ఫోన్ అబ్సొల్యూట్ బ్లాక్, ఎండ్లెస్ బ్లూ, ఎటర్నల్ ఆరెంజ్ కలర్ ఆప్షన్లలో సొంతం చేసుకోవచ్చు.
Read Also : iQOO 15 Price Drop : ఆఫర్ అదిరింది.. ఈ iQOO గేమింగ్ ఫోన్ మీ బడ్జెట్ ధరకే.. అమెజాన్‌లో జస్ట్ ఎంతంటే?
ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :
రెడ్మి 17 5జీ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్ 825 నిట్స్ HBM బ్రైట్‌నెస్‌తో 6.9-అంగుళాల డిస్ప్లేతో వస్తుంది. కొలతల పరంగా, ఈ ఫోన్ 170.12 మిమీ పొడవు, 78.42 మిమీ వెడల్పు, 8.8 మిమీ మందం, 232 గ్రాముల బరువు ఉంటుంది. సేఫ్టీ కోసం సైడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఏఐ ఫేస్ అన్‌లాక్ సిస్టమ్‌తో వస్తుంది.
ఈ ఫోన్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP64 రేటింగ్ అందిస్తుంది. వర్చువల్ ప్రాక్సిమిటీ సెన్సార్, యాంబియంట్ లైట్ సెన్సార్, యాక్సిలరోమీటర్ ఎలక్ట్రానిక్ కంపాస్ సెన్సార్ కూడా ఉంది. 6GB/8GB LPDDR4X ర్యామ్, 128GB UFS2.2 స్టోరేజ్‌తో వస్తుంది. ర్యామ్ 16GB వరకు, ఇంటర్నల్ స్టోరేజ్‌ను 2TB వరకు పెంచుకోవచ్చు.
కెమెరా సెటప్ విషయానికి వస్తే..
రెడ్మి 17 5జీ బ్యాక్ సైడ్ f/1.8 అపర్చర్‌తో 50MP ప్రైమరీ కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం f/2.05 అపర్చర్‌తో 8MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ ఫోన్లో క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 5 మొబైల్ ప్లాట్‌ఫామ్ అమర్చారు.
7900mAh బ్యాటరీ కూడా ఉంది. 45W టర్బో ఛార్జ్ 22.5W రివర్స్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్లలో 5G, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, Wi-Fi, FM రేడియో, GPS, బ్లూటూత్ 5.1, ఒక USB టైప్-C పోర్ట్ ఉన్నాయి. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత షావోమీ హైపర్ఓఎస్3పై రన్ అవుతుంది.
