iQOO 15 Price Drop : ఆఫర్ అదిరింది.. ఈ iQOO గేమింగ్ ఫోన్ మీ బడ్జెట్ ధరకే.. అమెజాన్‌లో జస్ట్ ఎంతంటే?
iQOO 15 Price Drop : ఐక్యూ గేమింగ్ ఫోన్ భారీగా తగ్గిందోచ్.. బ్యాంకు ఆఫర్లతో ఈ ఫోన్ రూ. 75వేల లోపు ధరలో లభిస్తోంది. ఇంతకీ ఈ ఆఫర్ ఎలా పొందాలంటే?
iQOO 15 Price Drop
- ఐక్యూ 15 ధర ఇప్పుడు రూ. 76,999 మాత్రమే
- ఇలా కొన్నారంటే ఏకంగా రూ. 9వేలు తక్కువకే
- అమెజాన్ పే, బ్యాంక్ కార్డులతో రూ. 2,309 తగ్గింపు
iQOO 15 Price Drop : ఐక్యూ ఫ్యాన్స్ మీకోసమే.. సుమారు రూ. 70వేల లోపు గేమింగ్ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? అమెజాన్‌లో ఐక్యూ 15 ఫోన్ భారీ ధర తగ్గింపుతో లభిస్తోంది. ఇలా కొన్నారంటే సుమారు రూ. 75వేలకే పొందవచ్చు. అసలు ధర కన్నా దాదాపు రూ. 10వేలు తక్కువకే లభిస్తుంది.
ఈ ధరలో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్, శాంసంగ్ 2K M14 లీడ్ OLED, ఇతర ఫ్లాగ్షిప్ గ్రేడ్ స్పెసిఫికేషన్లను పొందవచ్చు. అమెజాన్‌లో ఐక్యూ 15 ధర ఎంత ఉందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
అమెజాన్‌లో ఐక్యూ 15 ధర ఎంతంటే? :
ప్రస్తుతం రూ. 9వేలు ధర తగ్గింపుతో ఐక్యూ 15 రూ. 76,999 ధరకు లభిస్తోంది. అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో రూ. 2,309 డిస్కౌంట్ పొందవచ్చు. దాంతో ఈ ఫోన్ ధర రూ. 75వేల కన్నా తక్కువకే లభిస్తుంది. ఈ ఐక్యూ ఫోన్ నెలకు రూ. 2,707 నుంచి ఈఎంఐలో పొందవచ్చు. అయితే, కొన్ని అదనపు ఛార్జీలు చెల్లించక తప్పదు.
పాత ఫోన్‌తో ఎక్స్చేంజ్ చేసుకుంటే రూ. 31,800 వరకు ఆదా చేయొచ్చు. మీ పాత ఫోన్ వర్కింగ్ కండిషన్, బిల్లింగ్ తేదీ, ఇతర అంశాలు బట్టి రేటు ఉంటుంది. అదనపు రుసుము చెల్లించి, ఎక్స్టెండెడ్ వారంటీ, స్క్రీన్ ప్రొటెక్షన్ వంటి యాడ్-ఆన్ కూడా పొందవచ్చు.
ఐక్యూ 15 స్పెసిఫికేషన్లు :
ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్సెట్తో రన్ అవుతుంది. గేమింగ్ ఫ్రేమ్ ఇంటర్పొలేషన్ కోసం కంపెనీ సొంత క్యూ3 సూపర్కంప్యూటింగ్ చిప్‌తో వస్తుంది. LPDDR5X అల్ట్రా ర్యామ్, యూఎఫ్ఎస్ 4.1 స్టోరేజ్ కూడా అందిస్తుంది.
Read Also : Samsung Galaxy A36 Price : ఏంది మావా ఆఫర్.. ఈ శాంసంగ్ ఫోన్ ఇంత తక్కువా? అమెజాన్‌లో డీల్ మిస్ కావొద్దు..!
ఇందులో 144Hz రిఫ్రెష్ రేట్, 6,000 నిట్స్ వరకు లోకల్ పీక్ బ్రైట్నెస్, యాంటీ-రిఫ్లెక్టివ్ ఫిల్మ్‌తో 6.85-అంగుళాల శాంసంగ్ 2K M14 ఎల్ఈడీ ఓఎల్ఈడీ డిస్ప్లే ఉంది. ఈ ఐక్యూ ఫోన్ 7,000mAh 4వ జనరేషన్ సిలికాన్ ఆనోడ్ బ్యాటరీ ఉంది. 100W ఫాస్ట్ ఛార్జింగ్ వైర్డ్ ఛార్జింగ్, 40W వైర్లెస్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.
ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. ఈ ఫోన్లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50MP సోనీ ప్రైమరీ కెమెరా, 100x వరకు డిజిటల్ జూమ్, 50MP సోనీ 3x పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా, 50MP అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ 4K వీడియోల కోసం 32MP సెల్ఫీ కెమెరా ఉంది.
ఈ ఐక్యూ ఫోన్ 8,000mm² సింగిల్-లేయర్ వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ అందిస్తుంది. ఈ ప్యాకేజీలో IP68, IP69 రేటింగ్‌లు, అల్ట్రాసోనిక్ ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, సింగిల్ ఐఆర్ బ్లాస్టర్ కూడా ఉంది.
