Redmi Note 13 5G Series : ఈ నెల 4న రెడ్మి నోట్ 13 5జీ సిరీస్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ధర, స్పెషిఫికేషన్లు లీక్..!
Redmi Note 13 5G Series : షావోమీ సబ్ బ్రాండ్ రెడ్మి నుంచి నోట్ 13 సిరీస్ జనవరి 4న భారత మార్కెట్లో లాంచ్ కానుంది. ఇందులో మూడు వేరియంట్లు ఉండనున్నాయి. పూర్తి వివరాల కోసం ఓసారి లుక్కేయండి.

Redmi Note 13 5G series price and specs leaked online ahead of January 4 India launch
Redmi Note 13 5G Series : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమీ రెడ్మి నోట్ 13 5జీ సిరీస్ జనవరి 4న భారత మార్కెట్లో లాంచ్ కానుందని గతంలో ధృవీకరించింది. కొత్త సంవత్సరంలో భారత్‌లో కంపెనీ నుంచి రాబోయే మొదటి స్మార్ట్‌ఫోన్ ఇదే కానుంది. ఇంతకుముందు చైనాలో లాంచ్ అయిన మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ సిరీస్ రెడ్మి నోట్ 13 5జీ, రెడ్మి నోట్ 13 ప్రో 5జీ, రెడ్మి నోట్ 13ప్రో + 5జీ అనే మూడు వేరియంట్లలో అందుబాటులోకి రానుంది.
రెడ్మి నోట్ 13 సిరీస్ ధర ఎంతంటే? :
టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ పోస్ట్ ప్రకారం.. రెడ్మి నోట్ 13 5జీ ఫోన్ 6జీబీ ర్యామ్/128జీబీ స్టోరేజ్ వేరియంట్‌కు రూ. 20,999, 8జీబీ ర్యామ్/256జీబీ స్టోరేజ్ వేరియంట్‌కి రూ. 22,999, రూ. 24,9299 ర్యామ్/256జీబీ స్టోరేజ్ వేరియంట్ అందిస్తుంది. అంతేకాకుండా, స్మార్ట్‌ఫోన్ ప్రిజం గోల్డ్, ఆర్కిటిక్ వైట్, స్టెల్త్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. రెడ్మి నోట్ 13ప్రో 5జీ ఫోన్ ధర 8జీబీ ర్యామ్/256జీబీ స్టోరేజ్ వేరియంట్‌కు ధర 28,999, 12జీబీ ర్యామ్/256జీబీ స్టోరేజ్ వేరియంట్‌కి రూ. 32,999, ప్రో సిరీస్ ఆర్కిటిక్ వైట్, కోరల్ పర్పుల్, మిడ్నైట్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉండవచ్చు.
అంతేకాకుండా, ప్రీమియం రెడ్మి నోట్ 13 ప్రో ప్లస్ 5జీ వేరియంట్ ధర 8జీబీ ర్యామ్/256జీబీ స్టోరేజ్ వేరియంట్‌కు రూ. 33,999, 12జీబీ ర్యామ్/512జీబీ స్టోరేజ్ వేరియంట్‌కు రూ. 37,999కు పొందవచ్చు. రెడ్మి నోట్ 13 ప్రో ప్లస్ 5జీ సిరీస్ ఫ్యూజన్ వైట్, ఫ్యూజన్ పర్పుల్, ఫ్యూజన్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుందని టిప్‌స్టర్ పేర్కొన్నాడు.
రెడ్మి నోట్ 13 5జీ సిరీస్ స్పెషిఫికేషన్లు :
టిప్‌స్టర్ సుధాన్షు ఆంబోర్ గతంలో X (గతంలో ట్విట్టర్)లో రెడ్మి నోట్ 13 5జీ సిరీస్ భారతీయ, గ్లోబల్ వేరియంట్ల కోసం పూర్తి స్పెషిఫికేషన్లను షేర్ చేశారు. రెడ్మి నోట్ 13 5జీ ఫోన్ వనిల్లా వేరియంట్ 2400*1080 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.67-అంగుళాల అమోల్డ్ డిస్ప్లేను కలిగి ఉంటుందని లీక్ అయిన స్పెసిఫికేషన్లు సూచిస్తున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ గరిష్టంగా 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 240హెచ్‌జెడ్ వరకు టచ్ శాంప్లింగ్ రేట్‌తో వస్తుందని భావిస్తున్నారు.

Redmi Note 13 5G series price
ప్రాసెసర్ పరంగా, మిడ్-రేంజ్ ఫోన్ 6ఎన్ఎమ్ ప్రాసెస్ ఆధారంగా మీడియాటెక్ డైమెన్షిటీ 6080 చిప్సెట్ ద్వారా పవర్ పొందుతుంది. అన్ని గ్రాఫిక్స్-ఇంటెన్సివ్ టాస్క్‌లకు మాలి-జీ57 ఎంసీ2 జీపీయూతో రానుందని భావిస్తున్నారు. రెడ్మి నోట్ 13 5జీ 8జీబీ వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్ 256జీబీ వరకు యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్‌తో వస్తుందని భావిస్తున్నారు. అంతేకాకుండా, స్మార్ట్‌ఫోన్ 108ఎంపీ ప్రధాన కెమెరా, 8ఎంపీ అల్ట్రా-వైడ్ లెన్స్, 2ఎంపీ మాక్రో సెన్సార్‌ను కలిగి ఉంటుంది. సెల్ఫీలు, వీడియో కాల్లకు 16ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుందని భావిస్తున్నారు.
రెడ్మి నోట్ 13ప్రో 5జీ స్పెసిఫికేషన్స్ :
రెడ్మి నోట్ 13ప్రో 5జీ 4ఎన్ఎమ్ ప్రాసెస్ ఆధారంగా గ్రాఫిక్స్-ఇంటెన్సివ్ టాస్క్‌ల కోసం అడ్రినో 710 జీపీయూ ఆధారంగా స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 ప్రాసెసర్ ద్వారా పవర్ అందిస్తుందని భావిస్తున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్ 8జీబీ ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256జీబీ వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్‌తో కూడా వస్తుందని భావిస్తున్నారు.
రెడ్మి నోట్ 13ప్రో ప్లస్ 5జీ స్పెసిఫికేషన్లు :
హై-ఎండ్ రెడ్మి నోట్ 13 ప్రో ప్లస్ 5జీ మాలి-జీ610 ఎంసీ4 జీపీయూతో జత చేసిన మీడియాటెక్ డైమెన్సిటీ 7200 అల్ట్రా ప్రాసెసర్‌తో అందిస్తుందని భావిస్తున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్ 12జీబీ వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్ వేరియంట్లలో 512జీబీ వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ వేరియంట్లో రావచ్చు.