Zomato CEO : పార్టీ చేసుకోకుండా పండుగ రోజు పనేంటి భయ్యా.. పైగా ‘వార్ రూమ్’ కలరింగ్.. జొమాటో సీఈఓను ఏకిపారేసిన నెటిజన్లు..!

Zomato Deepinder Goyal : న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో డిసెంబర్ 31న ఒకే రోజులో ఆల్ టైమ్ రికార్డు ఆర్డర్లను అందుకుంది. కంపెనీ సీఈఓ దీపిందర్ గోయల్ కొన్ని ఫొటోలను షేర్ చేశారు. దీనిపై స్పందించిన నెటిజన్లు భారీగా ట్రోల్ చేస్తున్నారు.

Zomato CEO : పార్టీ చేసుకోకుండా పండుగ రోజు పనేంటి భయ్యా.. పైగా ‘వార్ రూమ్’ కలరింగ్.. జొమాటో సీఈఓను ఏకిపారేసిన నెటిజన్లు..!

Zomato CEO Deepinder Goyal shares ‘war room’ pics on New Year’s Eve

Troll on Zomato CEO : న్యూ ఇయర్ జోష్.. అందులోనూ డిసెంబర్ 31 అంటే.. మాములుగా ఉండదు మరి.. కొత్త ఏడాది వేడుకల్లో ఫుల్ దావత్ ఉండాల్సిందే.. అందులో బిర్యానీ మస్ట్.. ఇంకేముంది.. ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీలకు ఫుల్ గిరాకీ.. 2024 కొత్త ఏడాది వేడుకల సమయంలో ఫుడ్ డెలివరీ దిగ్గజం జొమాటో ఒక రోజులో ఆల్-టైమ్ అత్యధిక ఫుడ్ ఆర్డర్‌లను అందుకుంది. 2023 చివరి రోజు జొమాటోకి విశేషమైన రోజుగా నిలిచింది. డిసెంబర్ 31న కేవలం టిప్స్ ద్వారా రూ.97 లక్షలు వచ్చాయని స్వయంగా కంపెనీ సీఈఓ, వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ వెల్లడించారు.

Read Also : Zomato Funny Video : అక్షయ్ కుమార్ చెప్పిన హెల్దీ జ్యూస్ అట.. జొమాటో ప్రిపేర్ చేసింది.. రుచి సంగతి..

2022 కన్నా 2023లోనే ఆల్ టైం రికార్డు :
గత ఆరు సంవత్సరాల్లో 2022 ఏడాది కన్నా ఎక్కువ మొత్తంలో ఫుడ్ ఆర్డర్‌లు న్యూఇయర్ ఇయర్ (Zomato NYE 2023)లోనే ఆల్ టైం రికార్డు సాధించాయని ఆయన తెలిపారు. ఫుడ్ ఆర్డర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకువస్తుండటంతో వాటిని సకాలంలో పూర్తి చేసి డెలివరీలు అందించేందుకు జొమాటో ఆఫీసులోని ఉద్యోగులంతా విరామం లేకుండా పనిచేశారు. ఈ సందర్భంగా గోయల్ డిసెంబర్ 31న కంపెనీ సాధించిన విజయాలను హైలైట్ చేస్తూ ట్విట్టర్ వేదికగా కొన్ని ఫొటోలను కూడా షేర్ చేశారు. ఈ ఫొటోలలో ఆఫీసులోని జొమాటో టీమ్ పనిచేస్తున్న ఫొటోలకు వార్ రూమ్ అని కూడా క్యాప్షన్ పెట్టారు. దీనిపై స్పందించిన నెటిజన్లు జొమాటో సీఈఓను గట్టిగానే ఏకిపారేశారు.

చాలా సిగ్గుచేటు.. ఇది ఘనత కానే కాదు :
కొత్త ఏడాది వేడుకులు జరుపుకోకుండా వీకెండ్‌‌లో పనేంటి? అంటూ ట్రోల్ చేశారు. ‘ఇది జొమాటో సాధించిన ఘనత కాదు. ఇది మీ ఉత్పత్తి సమానంగా లేదని, వీకెండ్‌లో కూడా ఉద్యోగులను పని చేసేలా చేస్తున్నారని సూచిస్తుంది. అందులోనూ ప్రాజెక్ట్ ప్రణాళిక అమలు చాలా పేలవంగా కనిపిస్తోంది’ అని ఒక నెటిజన్ ట్వీట్ చేశాడు. పైగా దీన్ని వార్ రూమ్ అని పిలుస్తూ నాటకీయంగా మార్చే ప్రయత్నం చేశారంటూ మరో నెటిజిన్ తిట్టిపోశాడు. ఇప్పటికే చాలా మంది టెక్ ఉద్యోగులు తీవ్ర పనిభారం, ఒత్తిడి వల్ల అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని మరో నెటిజన్ రాసుకొచ్చారు.

కొత్త సంవత్సరానికి అసలు విరామం లేకుండా పని చేస్తున్న వారు ఎవరైనా ఉన్నారంటే వారు ‘డెలివరీ పార్టనర్స్’ అనే వాస్తవాన్ని దాచడానికి నిర్వాహకులు చిట్-చాట్ చేస్తున్న ఫోటోను బయట పెట్టడం చాలా సిగ్గుచేటు అంటూ గోయల్ పోస్టుకు నెటిజన్లు ఘాటు రిప్లయ్ ఇచ్చారు. ప్రపంచంలో మరెక్కడా యుద్ధం జరగడం లేదన్నట్టు.. ‘వార్ రూమ్’ అని చెప్పుకోవడం చాలా విడ్డూరంగా ఉందని ట్రోల్స్ చేస్తున్నారు.

పండుగ రోజున పనిచేస్తున్న వారితో కొత్త సంవత్సరాన్ని జరుపుకోవడానికి ఇంట్లో కుటుంబం ఎదురుచూడటం లేదా? అని ప్రశ్నించారు. మేం కూడా పనిచేశాం.. అలా అనీ అర్ధరాత్రి 12 గంటల వరకు కాదు.. ఉద్యోగులంతా ఇలా పనిభారంతో ఉండిపోతే.. కుటుంబం కూడా కొత్త ఏడాది పార్టీని ఎలా ఎంజాయ్ చేయగలరు.. మనం ఎంజాయ్ చేయలేనప్పుడు ఇతరుల పార్టీ కోసం పనిచేయడం చాలా బాధాకరమని మరో నెటిజన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే, యూరప్‌లో వర్క్ కల్చర్ గురించి ఓ పోస్ట్ కూడా వైరల్‌గా మారింది. భారత్‌లో స్టార్టప్ కల్చర్ గురించి చర్చను రేకెత్తించింది.

బెంగళూరు టాప్ :
జొమాటో, బ్లింకిట్ అంతటా 3.2 లక్షల మంది డెలివరీ పార్టనర్లు న్యూ ఇయర్ ఈవెంట్లో సేవలందించారు. బెంగళూరులో అత్యధిక ఈవెంట్‌లను బుక్ చేసింది. అత్యధిక టేబుల్‌లను రిజర్వ్ చేసింది. కోల్‌కతాకు చెందిన ఒక యూజర్ ఒకే ఆర్డర్‌లో దాదాపు 125 వస్తువులను ఆర్డర్ చేశారు. 31 డిసెంబర్ 2023న రాత్రి 8:06 గంటలకు 8422 ఆర్డర్‌లు అయ్యాయి. దాంతో ప్రతి సెకనుకు 140 ఆర్డర్‌లు వచ్చాయి. గత వారం ప్రారంభంలో పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ 2023లో జొమాటో ద్వారా ఫుడ్ ఆర్డర్ చేయడానికి రూ. 2 లక్షలు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. శర్మ 2023లో పేటీఎం ద్వారా జొమాటోకి 95 వరకు పేమెంట్లు చేశారు. ఆ తర్వాత నోయిడాలోని స్కైమార్క్ వన్‌లోని హల్దీరామ్ అవుట్‌లెట్‌కు 14 పేమెంట్లు జరిగాయి.

Read Also : Apple Devices Sale 2024 : ఈ ఆపిల్ డివైజ్‌లపై రూ. 12వేలు డిస్కౌంట్.. కొత్త ఏడాదిలో సరికొత్త డీల్స్.. డోంట్ మిస్!