Zomato Funny Video : అక్షయ్ కుమార్ చెప్పిన హెల్దీ జ్యూస్ అట.. జొమాటో ప్రిపేర్ చేసింది.. రుచి సంగతి..
జొమాట్ రీసెంట్‌గా కొన్ని ఫన్నీ వీడియోలను చేస్తోంది. తాజాగా అక్షయ్ కుమార్ నటించిన 'దీవానే హుయే పాగల్' సినిమాలోని వీడియో క్లిప్ యాడ్ చేసి ఓ ఫన్నీ వీడియో చేసింది. ఆ వీడియోలో ఏముంది?

Zomato Funny Video
Zomato Funny Video : అక్షయ్ కుమార్ చెప్పడం ఏంటి? జొమాటో జ్యూస్ తయారు చేయడం ఏంటి? అని ఆశ్చర్యపోతున్నారా? జొమాట్ షేర్ చేసిన వీడియో చూస్తే మీరు సరదాగా నవ్వుకుంటారు.
జొమాటో రీసెంట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో (zomato) ‘ప్రపంచంలోనే అత్యంత ఆరోగ్యకరమైన జ్యూస్’ అనే శీర్షికతో ఓ జ్యూస్ తయారీ వీడియోను షేర్ చేసింది. ‘దీవానే హుయే పాగల్’ సినిమాలో అక్షయ్ కుమార్ నటించిన క్లిప్‌ను వీడియోకి లింక్ చేసింది. ఈ క్లిప్‌లో అక్షయ్ కుమార్ ఆరోగ్యకరమైన జ్యూస్ రెసిపీ అంటూ కొన్ని ఇంగ్రీడియంట్స్ చెబుతాడు. దానిని ఫాలో అవుతూ బ్లెండర్‌లో ఆరెంజ్ జ్యూస్, అందులో అల్లం, పాలకూర, ఎండుమిర్చి కలిపి మిక్స్ చేయడం కనిపిస్తుంది. ఫైనల్‌గా తయారైన జ్యూస్ రుచి చూసిన జొమాటో ఉద్యోగుల హావభావాలు నవ్వుని తెప్పిస్తాయి. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది. నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
Zomato : డ్రోన్లతో జొమాటో ఆర్డర్ల డెలివరీ .. బోయ్ చేసిన వినూత్న ఆలోచన
‘ఈ వీడియోపై డిస్క్లైమర్ ఉండాలి.. దీనిని ప్రయత్నించవద్దు’ అని ఒకరు.. ‘నేను దీనిని ఎక్కడ ఆర్డర్ చేయగలను?.. నా బాస్‌కి ఇవ్వాలి’ అంటూ ఫన్నీగా ఒకరు కామెంట్లు పెట్టారు. చాలామంది జొమాటో షేర్ చేసిన వీడియోకి ఫన్నీ ఎమోజీలు పెట్టారు.
View this post on Instagram