Redmi Note 13 Series specifications leaked online
Redmi Note 13 Series Specifications : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమీ మిడ్-రేంజ్ రెడ్‌మి నోట్ 13 5జీ సిరీస్ జనవరి 4న భారత మార్కెట్లో లాంచ్ కానున్నట్టు కంపెనీ ధృవీకరించింది. అయితే, ఈ ఫోన్ భారతీయ లాంచ్‌కు ముందు స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. టిప్‌స్టర్ సుధాన్షు అంబోర్ రెడ్‌మి నోట్ 13 5జీ సిరీస్ భారతీయ, గ్లోబల్ వేరియంట్‌లకు పూర్తి స్పెషిఫికేషన్లను రివీల్ చేశారు.
రెడ్‌మి నోట్ 13 5జీ స్పెసిఫికేషన్లు :
రెడ్‌మి నోట్ 13 5జీ ఫోన్ వనిల్లా వేరియంట్ 2400*1080 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.67-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని లీక్ స్పెసిఫికేషన్‌లు చూపిస్తున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ గరిష్టంగా 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 240హెచ్‌జెడ్ వరకు టచ్ శాంప్లింగ్ రేట్‌తో వస్తుందని భావిస్తున్నారు. ప్రాసెసర్ పరంగా.. మిడ్-రేంజ్ ఫోన్ 6ఎన్ఎమ్ ప్రాసెస్ ఆధారంగా మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్‌సెట్ ద్వారా పవర్ అందిస్తుంది.
అన్ని గ్రాఫిక్స్-ఇంటెన్సివ్ టాస్క్‌ల కోసం మాలి-జీ57 ఎంసీ2 జీపీయూతో వస్తుందని భావిస్తున్నారు. రెడ్‌మి నోట్ 13 5జీ ఫోన్ 8జీబీ వరకు ఎల్‌పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256జీబీ వరకు యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్‌తో వస్తుందని భావిస్తున్నారు. అంతేకాకుండా, స్మార్ట్‌ఫోన్ 108ఎంపీ ప్రధాన కెమెరా, 8ఎంపీ అల్ట్రా-వైడ్ లెన్స్, 2ఎంపీ మాక్రో సెన్సార్‌ను కలిగి ఉంటుంది. సెల్ఫీలు, వీడియో కాల్‌లకు 16ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుందని భావిస్తున్నారు.
Redmi Note 13 Series specifications
రెడ్‌మి నోట్ 13 ప్రో 5జీ స్పెసిఫికేషన్స్ :
రెడ్‌మి నోట్ 13 ప్రో 5జీ 4ఎన్ఎమ్ ప్రాసెస్ ఆధారంగా స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 ప్రాసెసర్ ద్వారా అందిస్తుంది. గ్రాఫిక్స్-ఇంటెన్సివ్ టాస్క్‌ల కోసం అడ్రినో 710 జీపీయూ ఆధారంగా వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 8జీబీ ఎల్‌పీడీడీఆర్5 ర్యామ్ 256జీబీ వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్‌తో కూడా వస్తుందని భావిస్తున్నారు.
రెడ్‌మి నోట్ 13 ప్రో ప్లస్ 5జీ స్పెసిఫికేషన్లు :
హై-ఎండ్ ఫోన్ రెడ్‌మి నోట్ 13 ప్రో ప్లస్ 5జీ ఫోన్ మాలి-జీ610 ఎంసీ4 జీపీయూతో వచ్చిన మీడియాటెక్ డైమెన్సిటీ 7200 అల్ట్రా ప్రాసెసర్‌తో అందిస్తుందని భావిస్తున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్ 12జీబీ వరకు ఎల్‌పీడీడీఆర్5 ర్యామ్ వేరియంట్‌లలో 512జీబీ వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ వేరియంట్‌లో రావచ్చు.