Redmi Note 13 Pro Price : భారత్‌కు రెడ్‌మి నోట్ 13 ప్రో వచ్చేస్తోంది.. వచ్చే జనవరి 4న లాంచ్.. ధర ఎంత ఉండొచ్చుంటే?

Redmi Note 13 Pro Price : రెడ్‌మి అభిమానులకు అదిరే న్యూస్... వచ్చే జనవరి 4న భారత మార్కెట్లోకి రెడ్‌మి నోట్ 13 ప్రో లాంచ్ కానుంది. ఈ ఫోన్ ధర ఎంత అనేది కంపెనీ ముందుగానే రివీల్ చేసింది.

Redmi Note 13 Pro Price : భారత్‌కు రెడ్‌మి నోట్ 13 ప్రో వచ్చేస్తోంది.. వచ్చే జనవరి 4న లాంచ్.. ధర ఎంత ఉండొచ్చుంటే?

Redmi Note 13 Pro Price in India Tipped Ahead of Scheduled January 4 Launch

Updated On : December 21, 2023 / 6:18 PM IST

Redmi Note 13 Pro Price : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? 2024 జనవరి వరకు ఆగండి.. ప్రత్యేకించి రెడ్‌మి అభిమానుల కోసం ఈ సరికొత్త ఫోన్ భారత మార్కెట్లోకి రానుంది. షెడ్యూల్ ప్రకారం.. 2024 జనవరి 4న రెడ్‌మి నోట్ 13 ప్రో మోడల్ లాంచ్ కానుంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో చైనాలో రెడ్‌మి నోట్ 13 మోడల్, రెడ్‌మి నోట్ 13 ప్రో ప్లస్‌తో పాటుగా వచ్చింది.

రెడ్‌మి నోట్ 13 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు జనవరి 4న భారత మార్కెట్లో లాంచ్ కానున్నాయి. భారతీయ ఫోన్‌లు చైనీస్ కౌంటర్‌పార్ట్‌ల మాదిరిగానే స్పెసిఫికేషన్‌లను అందించగలవని భావిస్తున్నారు. ఈ నెల ప్రారంభంలో యూరోపియన్ మార్కెట్‌లలో హ్యాండ్‌సెట్‌ల అంచనా ధర ఆన్‌లైన్‌లో కనిపించింది. ఇప్పుడు భారత్‌లో రెడ్‌మి నోట్ 13 ప్రో ధరను టిప్‌స్టర్ సూచించింది.

Read Also : Apple Watches Ban : ఈ నెల 21 నుంచి ఆపిల్ వాచ్ సిరీస్ 9, అల్ట్రా 2 అమ్మకాలను నిలిపివేస్తోంది.. ఎందుకంటే?

టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ పోస్ట్‌ ప్రకారం.. భారత మార్కెట్లో రెడ్‌మి నోట్ 13 ప్రో (12జీబీ + 256జీబీ) వేరియంట్ రూ. 32,999కు రానుంది. దేశంలోని ఇతర కాన్ఫిగరేషన్‌లలో ఫోన్ అందుబాటులో ఉంటుందో లేదో వెల్లడించలేదు. రెడ్‌మి ప్రో మోడల్‌తో పాటు లాంచ్ కానున్న ఈ సిరీస్‌లోని ఇతర రెండు మోడల్స్ బేస్ రెడ్‌మి నోట్ 13, రెడ్‌మి నోట్ 13 ప్రో ప్లస్ ధరలు కూడా రివీల్ చేయలేదు. చైనాలో రెడ్‌మి 13 ప్రో మోడల్ 8జీబీ + 128జీబీ ఆప్షన్ సీఎన్‌వై 1,499 (సుమారు రూ. 17,400) నుంచి ప్రారంభమవుతుంది.

ఏ వేరియంట్ ధర ఎంతంటే? :
నాలుగు ఇతర ర్యామ్, స్టోరేజ్ వేరియంట్‌లలో కొనుగోలుకు కూడా అందుబాటులో ఉంది. 8జీబీ + 256జీబీ, 12జీబీ+256జీబీ, 12జీబీ + 512జీబీ 16జీబీ + 512జీబీ వేరియంట్ల ధర వరుసగా సీఎన్‌వై 1,699 (దాదాపు రూ. 19,700), సీఎన్‌వై 1800 (రూ. 22వేలు), సీఎన్‌వై 1,999 (దాదాపు రూ. 23,100), సీఎన్‌‌వై 2,099 (దాదాపు రూ. 24,300) ఉండనున్నాయి. ఈ ఫోన్ బ్లాక్, బ్లూ, సిల్వర్, వైట్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉండనుంది.

Redmi Note 13 Pro Price in India Tipped Ahead of Scheduled January 4 Launch

Redmi Note 13 Pro Price in India

రెడ్‌మి నోట్ 13 ప్రోలో 6.67-అంగుళాల 1.5కె ఫుల్-హెచ్‌డీ+ అమోల్డ్ ప్యానెల్ 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్‌ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 13-ఆధారిత ఎంఐయూఐ 14తో రానుంది. క్వాల్‌కామ్ స్పాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 ఎస్ఓసీ ద్వారా పవర్ అందిస్తుంది. ఆప్టిక్స్ విషయానికి వస్తే.. రెడ్‌మి నోట్ 13 ప్రో ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంది.

ఇందులో 200ఎంపీ శాంసంగ్ ఐఎస్ఓ‌సెల్ హెచ్‌పీ3 ప్రైమరీ సెన్సార్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్), అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్‌తో కూడిన 8ఎంపీ సెన్సార్, 2ఎంపీ మాక్రో సెన్సార్ ఉన్నాయి. ఫ్రంట్ కెమెరా డిస్‌ప్లే పైభాగంలో సెంట్రలైజడ్ హోల్-పంచ్‌తో రానుంది. 16ఎంపీ సెన్సార్‌ను ఉపయోగిస్తుంది. 67డబ్ల్యూ వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,100ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంది.

Read Also : Tecno Spark 20 Pro Series : 2024 జనవరిలో టెక్నో స్పార్క్ 20 ప్రో సిరీస్ వచ్చేస్తోంది.. కీలక ఫీచర్లు ఇవే..!