Apple Watches Ban : ఈ నెల 21 నుంచి ఆపిల్ వాచ్ సిరీస్ 9, అల్ట్రా 2 అమ్మకాలను నిలిపివేస్తోంది.. ఎందుకంటే?

Apple Watches Ban : కొత్తగా లాంచ్ చేసిన ఆపిల్ వాచ్‌లు డిసెంబర్ 21 నుంచి కొనుగోలుకు అందుబాటులో ఉండవు. ఆపిల్ వాచ్ సిరీస్ 9, ఆపిల్ వాచ్ అల్ట్రా 2 స్మార్ట్‌వాచ్ విక్రయాలను నిలిపివేయనుంది. ఎందుకంటే?

Apple Watches Ban : ఈ నెల 21 నుంచి ఆపిల్ వాచ్ సిరీస్ 9, అల్ట్రా 2 అమ్మకాలను నిలిపివేస్తోంది.. ఎందుకంటే?

Here's why Apple will stop selling Watch Series 9, Ultra 2 from December 21

Updated On : December 20, 2023 / 11:44 PM IST

Apple Watches Ban : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ అమెరికాలో వాచ్ సిరీస్ 9, అల్ట్రా 2 స్మార్ట్‌వాచ్‌ల విక్రయాలను నిలిపివేస్తుంది. కొత్తగా లాంచ్ అయిన రెండు ఆపిల్ వాచీలు డిసెంబర్ 21 నుంచి ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉండవని ఓ నివేదిక వెల్లడించింది.

Read Also : Apple iPhone 14 Sale : ఆపిల్ ఐఫోన్ 14పై బిగ్ డిస్కౌంట్.. కేవలం రూ.24,999కే కొనుగోలు చేయొచ్చు.. డోంట్ మిస్!

పేటెంట్ వివాదం కారణంగా డిసెంబరు 24 తర్వాత రిటైల్ స్టోర్‌లలో ఇన్-స్టోర్ ఇన్వెంటరీ అందుబాటులో ఉండదు. వాచ్ బ్లడ్ ఆక్సిజన్ సెన్సార్ (SpO2 సెన్సార్) టెక్నాలజీ చుట్టూ ఆపిల్, మెడికల్ టెక్నాలజీ కంపెనీ (Masimo) మధ్య దీర్ఘకాలంగా కొనసాగుతున్న పేటెంట్ వివాదంలో భాగంగా ఇంటర్నేషనల్ ట్రేడ్ కమిషన్ (ITC) ఇటీవలి తీర్పు వచ్చింది.

ఈ వాచ్ మోడల్ అమ్మకాలపై నిషేధం :
పేటెంట్ వివాదం నేపథ్యంలో ఐటీసీ దిగుమతి నిషేధాన్ని ముందస్తుగా పాటించాలని కంపెనీ తెలిపింది. జనవరి నుంచి న్యాయస్థానం నిర్ణయాన్ని సమర్థిస్తూ అక్టోబర్‌లో ఐటీసీ తన తీర్పును ప్రకటించింది. ఐటీసీ నిషేధం అనేది అమెరికాలో ఆపిల్ సిరీస్ 9, అల్ట్రా 2 అమ్మకాలను మాత్రమే ప్రభావితం చేస్తుంది. ఆపిల్ వాచీలు ఇప్పటికీ విదేశాలలో అమ్మకానికి అందుబాటులో ఉంటాయి. మాసిమో పల్స్ ఆక్సిమీటర్‌కు ప్రసిద్ధి చెందింది.

Here's why Apple will stop selling Watch Series 9, Ultra 2 from December 21

 Apple stop selling Watch Series 9, Ultra 2 

ఆపిల్ తన పల్స్ ఆక్సిమెట్రీ టెక్నాలజీని ఉల్లంఘించిందని మాసిమో రెండు వేర్వేరు కేసులను దాఖలు చేసింది. అయితే, ఆరోపణలపై ఆపిల్ ప్రతినిధి గట్టిగానే విభేదిస్తున్నారు. ఆపిల్ వాచ్ కస్టమర్‌లకు అందుబాటులో ఉండేలా చూసుకోవడానికి అనేక రకాల చట్టపరమైన, సాంకేతికపరమైన అంశాలను అనుసరిస్తోందని ఒక ప్రకటనలో చెప్పారు.

ఐటీసీ దిగుమతి నిషేధ తీర్పు ప్రస్తుతం అధ్యక్ష సమీక్ష వ్యవధిలో ఉంది. ఈ నిషేధాన్ని ఆమోదించే అవకాశం అధ్యక్షుడు జో బిడెన్‌కు ఉంది. దీనికి ఆమోదం లభిస్తే.. ఆపిల్ వాచ్ సిరీస్ 9, ఆపిల్ వాచ్ అల్ట్రా 2ని వీలైనంత త్వరగా అమెరికాలోని వినియోగదారులకు తిరిగి ఇవ్వడానికి ఆపిల్ అన్ని చర్యలు తీసుకుంటుందని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఆపిల్ వాచ్ ఆక్సిజన్ శాచురేషన్ ఎలా కొలుస్తుంది? ఎలా రిపోర్టు చేస్తుంది అనేదానికి సాఫ్ట్‌వేర్ మార్పులపై కూడా కంపెనీ పనిచేస్తోంది.

Read Also : WhatsApp Channels : వాట్సాప్‌‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. ఛానెల్స్‌లో ఫొటోలు, వీడియోలతో ఆటోమాటిక్ ఆల్బమ్ గ్యాలరీ క్రియేట్ చేసుకోవచ్చు!