Tecno Spark 20 Pro Series : 2024 జనవరిలో టెక్నో స్పార్క్ 20 ప్రో సిరీస్ వచ్చేస్తోంది.. కీలక ఫీచర్లు ఇవే..!
Tecno Spark 20 Pro Series : టెక్నో స్పార్క్ 20 ప్రో ప్లస్ సిరీస్ ఫోన్ వచ్చేస్తోంది. 2024 జనవరిలో లాంచ్ కానుంది. ఈ ఫోన్ కీలక స్పెషిఫికేషన్లను కంపెనీ రివీల్ చేసింది. పూర్తి వివరాలివే..

Tecno Spark 20 Pro Plus Set to Launch in January 2024
Tecno Spark 20 Pro Plus : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? 2024 జనవరిలో టెక్నో కంపెనీ నుంచి స్పార్క్ 20 ప్రో ప్లస్ మోడల్ వచ్చేస్తోంది. టెక్నో స్పార్క్ 20, టెక్నో స్పార్క్ 20 ప్రోలో చేరనుంది. డిసెంబర్‌లో ఎంపిక చేసిన మార్కెట్‌లలో ముందుగా ఆవిష్కరించింది. టాప్-ఆఫ్-ది-లైన్ ప్రో ప్లస్ మోడల్ కొన్ని కీలక స్పెసిఫికేషన్‌లను కూడా కంపెనీ ప్రకటించింది.
ప్రో వేరియంట్‌తో కొన్ని తేడాలను కూడా షేర్ చేసింది. కొన్ని అప్‌గ్రేడ్ చేసిన ఫీచర్లను తీసుకురానుంది. తొలి టైమ్‌లైన్‌ను ప్రకటించడంతోపాటు రాబోయే స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన కొన్ని వివరాలను టెక్నో స్పార్క్ 20 ప్రో ప్లస్ డిజైన్‌ను కూడా వెల్లడించింది. టెక్నో స్పార్క్ 20 ప్రో ప్లస్ జనవరి 2024లో లాంచ్ కానుందని కంపెనీ ప్రకటించింది.
కెమెరా ఫీచర్లు, స్పెషిఫికేషన్లు :
టెక్నో స్పార్క్ 20 ప్రోలో అదే చిప్‌సెట్ మీడియాటెక్ హెలియో జీ99 ఎస్ఓసీ ద్వారా ఫోన్ అందించనుందని కంపెనీ ధృవీకరించింది. రాబోయే హ్యాండ్‌సెట్ పైన ఆండ్రాయిడ్ 14-ఆధారిత (HiOS) స్కిన్‌తో రానుందని కంపెనీ తెలిపింది. టెక్నో స్పార్క్ 20 ప్రో ప్లస్ 1,000నిట్స్ గరిష్ట ప్రకాశం స్థాయితో 120హెచ్‌జెడ్ కర్వ్డ్ అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ బ్యాక్ సైడ్ 108ఎంపీ ప్రైమరీ సెన్సార్, ఫ్రంట్ కెమెరా 32ఎంపీ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. టెక్నో స్పార్క్ 20 ప్రోలోని కెమెరాల మాదిరిగానే ఉంటాయి.

Tecno Spark 20 Pro Plus
ఈ హ్యాండ్‌సెట్ గ్రీన్ కలర్ లెదర్ ఫినిషింగ్ ఆప్షన్‌లో కనిపిస్తుంది. వృత్తాకార కెమెరా మాడ్యూల్ కెమెరా సెన్సార్‌లతో బ్యాక్ ప్యానెల్‌లోని టాప్ లెఫ్ట్ కార్నర్‌లో ఉండనుంది. క్వాడ్రంట్ స్టార్ అర్రే డిజైన్ కలిగిన కెమెరా మాడ్యూల్ పక్కన నిలువుగా ఉండే ఎల్ఈడీ ఫ్లాష్ యూనిట్ కలిగి ఉంటుంది. ఫ్రంట్ సైడ్ టెక్నో స్పార్క్ 20ప్రో ప్లస్ డబుల్ కర్వ్డ్ డిజైన్‌ను కలిగి ఉంది. వినియోగదారులు ఫోన్ పట్టుకునేందుకు చాలా సౌకర్యవంతంగా ఉంటుందని కంపెనీ తెలిపింది. డిస్‌ప్లే సన్నని బెజెల్స్‌తో ఫ్రంట్ కెమెరాకు స్క్రీన్ పైభాగంలో సెంట్రల్ హోల్-పంచ్ స్లాట్‌తో కనిపిస్తుంది.
Read Also : X Services Outage : గంటకు పైగా స్తంభించిన ‘ఎక్స్’ ‘సేవలు.. మాయమైన పోస్టులు.. ఎట్టకేలకు అందుబాటులోకి..!