Redmi Note 14 5G Sale : కొత్త ఫోన్ కొంటున్నారా? రెడ్‌మి నోట్ 14 5జీ ఫస్ట్ సేల్ మొదలైందోచ్.. ధర, ఆఫర్లు!

Redmi Note 14 5G Sale : భారత మార్కెట్లో ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు రెడ్‌‌మి నోట్ 14 5జీ ఫోన్ అమెజాన్, ఎఐ.కామ్, షావోమీ రిటైల్ ద్వారా విక్రయానికి అందుబాటులో ఉంటుంది.

Redmi Note 14 5G Series

Redmi Note 14 5G Sale : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? భారత మార్కెట్లో రెడ్‌మి నోట్ 14 5జీ ఫస్ట్ సేల్ మొదలైంది. రెడ్‌మి నోట్ 14 5జీ, రెడ్‌మి నోట్ 14ప్రో, రెడ్‌‌మి నోట్ 14ప్రో ప్లస్ ఫోన్లను ఆవిష్కరించింది. డిసెంబర్ 13న భారత మార్కెట్లో కూడా అమ్మకానికి వస్తున్నాయి. రెడ్‌మి నోట్ 14 5జీ అనేది మీడియాటెక్ చిప్‌సెట్, 120Hz అమోల్డ్ డిస్‌ప్లే, ట్రిపుల్ కెమెరా సెటప్, స్టీరియో స్పీకర్ సిస్టమ్, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పెద్ద బ్యాటరీతో సరసమైన సబ్-20కె 5జీ స్మార్ట్‌ఫోన్‌గా లాంచ్ అయింది.

భారత్‌లో రెడ్‌మి నోట్ 14 5జీ సేల్ :
భారత మార్కెట్లో ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు రెడ్‌‌మి నోట్ 14 5జీ ఫోన్ అమెజాన్, ఎఐ.కామ్, షావోమీ రిటైల్ ద్వారా విక్రయానికి అందుబాటులో ఉంటుంది. రెడ్‌మి నోట్ 14 5జీ ఫోన్ టైటాన్ బ్లాక్, ఫాంటమ్ పర్పుల్, మిస్టిక్ వైట్ షేడ్స్‌లో అందుబాటులో ఉంటుంది.

భారత మార్కెట్లో రెడ్‌మి నోట్ 14 5జీ ధర బేస్ 6జీబీ/128జీబీ మోడల్ ధర రూ.18,999 నుంచి ప్రారంభమవుతుంది. అంతేకాకుండా, ఈ హ్యాండ్‌సెట్ 8జీబీ/128జీబీ, 8జీబీ/256జీబీ కాన్ఫిగరేషన్‌లో కూడా అందిస్తుంది. ఈ రెడ్‌మి ఫోన్ వరుసగా రూ. 19,999, రూ. 21,999కు అందుబాటులో ఉంటుంది.

రెడ్‌మి నోట్ 14 5జీ స్పెసిఫికేషన్స్ :
రెడ్‌మి నోట్ 14లో మీడియాటెక్ డైమన్షిటీ 7050 ఎస్ఓసీ, 8జీబీ వరకు ఎల్‌పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256జీబీ వరకు యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్ ఉన్నాయి. ఆండ్రాయిడ్ 14-ఆధారిత హైపర్‌ఓఎస్‌ను నడుపుతుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్‌లు, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది.

కెమెరాల విషయానికి వస్తే.. ఓఐఎస్, ఎఫ్/1.7 ఎపర్చర్‌తో కూడిన 50ఎంపీ సోనీ ఎల్‌వైటీ-600 ప్రైమరీ సెన్సార్, 8ఎంపీ అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపీ మాక్రో లెన్స్‌ను కలిగి ఉంటుంది. ఫ్రంట్ సైడ్ 16ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది.

రెడ్‌మి నోట్ 14 5జీ ఫోన్ 6.67-అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ+ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లేను 2,100నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, 1920Hz హై-ఫ్రీక్వెన్సీ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్, హెచ్‌డీఆర్10+కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ 45డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5,110mAh బ్యాటరీని కలిగి ఉంది. అదనంగా, దుమ్ము, నీటి నిరోధకతకు ఐపీ64 రేటింగ్‌ను కలిగి ఉంది.

Read Also : iPhone Data Transfer : ఐఫోన్ నుంచి పీసీ లేదా మ్యాక్‌కు డేటాను ట్రాన్స్‌ఫర్ చేయాలనుకుంటున్నారా? ఇదిగో సింపుల్ ప్రాసెస్..!