Redmi Smartphones : 10,000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్‌తో రెడ్మి నుంచి 3 కొత్త స్మార్ట్ఫోన్లు.. కీలక ఫీచర్లు లీక్..!
Redmi Smartphones : రెడ్ మి కంపెనీ నుంచి భారీ 10,000mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో మూడు సరికొత్త స్మార్ట్ ఫోన్లు లాంచ్ కానున్నాయి.. ఈ ఫోన్లకు సంబంధించి పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి..
Redmi Smartphones
- రెడ్మి నోట్ 17 సిరీస్ మొత్తం 3 ఫోన్లు అతి త్వరలో లాంచ్
- ఈ ఫోన్లో 200MP మెయిన్ కెమెరా ఉన్నట్లు అంచనా
- స్మార్ట్‌ఫోన్ లోపల ఒక మెటల్ ఫ్రేమ్ కూడా కనిపిస్తుంది
Redmi Smartphones : రెడ్మి లవర్స్‌కు గుడ్ న్యూస్.. షావోమీ సబ్ బ్రాండ్ రెడ్మి నుంచి అతిపెద్ద బ్యాటరీతో కొత్త ఫోన్లు రాబోతున్నాయి. 10,000mAh భారీ బ్యాటరీతో స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసేందుకు కంపెనీ రెడీ అవుతోంది.
ఈ ఫోన్లకు సంబంధించి కొత్త లీక్ బయటకు వచ్చింది. 10,000mAh సామర్థ్యంతో ఈ 3 కొత్త స్మార్ట్ఫోన్లను లాంచ్ చేయనుంది. ఈ లీక్ డేటాను చైనాకు చెందిన ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ లీక్ చేసింది.
ప్రస్తుతం కంపెనీ ఈ 3 స్మార్ట్ఫోన్లను టెస్టింగ్ చేస్తోంది. ఆ తర్వాత రెడ్మి నోట్ 17 సిరీస్ పేరుతో గ్లోబల్ మార్కెట్లోకి రిలీజ్ చేయనుంది. అంతేకాదు.. రెడ్మి నోట్ 17 ప్రో మ్యాక్స్ భారీ బ్యాటరీతో వచ్చే అవకాశం ఉంది. అయితే, గ్లోబల్ మోడల్లో బ్యాటరీ సామర్థ్యం కొద్దిగా తక్కువగా ఉండవచ్చు.
100W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ :
రెడ్మి నోట్ 17 ప్రో మ్యాక్స్ గ్లోబల్ మోడల్ 9,210mAh బ్యాటరీతో వస్తుందని అంచనా. అయితే, ఈ ఫోన్ 100W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుందని అంచనా. ఈ ఫోన్లో 200MP మెయిన్ కెమెరా ఉండే అవకాశం ఉంది. అలాగే, శాంసంగ్ HP5 సెన్సార్‌ను కూడా ఉపయోగించవచ్చునని భావిస్తున్నారు.
అల్ట్రావైడ్ కెమెరాలో 8MP ఓమ్నివిజన్ OV8F10 సెన్సార్ ఉండవచ్చు. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఈ ఫోన్లో 32MP ఫ్రంట్ కెమెరా ఉండవచ్చు. ఇందులో శాంసంగ్ S5KKDS సెన్సార్ కూడా అమర్చవచ్చు.
రెడ్మి రాబోయే స్మార్ట్‌ఫోన్ మెటల్ ఫ్రేమ్‌తో వస్తుందని అంచనా. సేఫ్టీ కోసం కంపెనీ డిస్‌ప్లేలోనే ఆప్టికల్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ కూడా ఉండొచ్చు. ఈ డిస్ప్లే 1.5K రిజల్యూషన్ ఉంటుందని సమాచారం. ఈ ఫోన్ LTPS డిస్ప్లేతో కూడా రావచ్చు.
120Hz లేదా 144Hz వరకు హై రిఫ్రెష్ రేట్ అందిస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుతం, కంపెనీ ఈ స్మార్ట్ఫోన్లను టెస్టింగ్ చేస్తోందనే వార్తలు వస్తున్నాయి. ఈ బ్రాండ్ అధికారికంగా ఎలాంటి వివరాలను రివీల్ చేయలేదు.
