Redmi Turbo 4 Pro : కొత్త రెడ్‌‌మి టర్బో 4 ప్రో వచ్చేస్తోందోచ్.. వచ్చేవారమే లాంచ్.. ఫీచర్లు కోసమైన కొనాల్సిందే.. ఫుల్ డిటెయిల్స్!

Redmi Turbo 4 Pro : క్వాల్‌కామ్ కొత్త స్నాప్‌డ్రాగన్ 8s Gen 4 చిప్‌సెట్‌తో రాబోయే ఫస్ట్ ఫోన్‌గా రెడ్‌మి టర్బో 4 ప్రో వచ్చే వారం లాంచ్ కానుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Redmi Turbo 4 Pro

Redmi Turbo 4 Pro : రెడ్‌మి ప్రియులకు గుడ్ న్యూస్.. వచ్చేవారం రెడ్‌మి టర్బో 4 ప్రో లాంచ్ అవుతోంది. కచ్చితమైన లాంచ్ తేదీ ఇంకా రివీల్ చేయలేదు. రెడ్‌మి బ్రాండ్ వాంగ్ టెంగ్ థామస్ రాబోయే రోజుల్లో ఈ కొత్త ఫోన్ లాంచ్ కానుందని వీబోలో పోస్ట్‌లో ధృవీకరించారు. రెడ్‌మి టర్బో 4 ప్రో 2.5K రిజల్యూషన్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని వాంగ్ ధృవీకరించారు.

క్వాల్‌కామ్ కొత్త 4nm ప్రాసెసర్‌ను కలిగిన మొదటి స్మార్ట్‌ఫోన్ ఇది. స్పీ్డ్ పర్ఫార్మెన్స్ కోసం ఆక్టా-కోర్ డిజైన్‌తో చిప్‌సెట్ వస్తుంది. అడ్రినో 825 GPUతో ఇంటిగ్రేట్ అయింది. ఈ కొత్త చిప్ గత జనరేషన్ కన్నా CPU పర్ఫార్మెన్స్‌లో 31 శాతం అప్‌గ్రేడ్ అందిస్తుందని అంచనా.

Read Also : Motorola Edge 60 Series : ఈ ఫోన్ రేంజే వేరబ్బా.. కొత్త మోటోరోలా ఎడ్జ్ 60 కీలక ఫీచర్లు, డిజైన్ లీక్.. లాంచ్‌కు ముందే భారీ అంచనాలు..!

రాబోయే టర్బో 4 ప్రో ఫ్లాగ్‌షిప్ లెవల్ పర్ఫార్మెన్స్ అందించనుంది. ఈ ఫోన్ హై-స్పెసిఫికేషన్‌లతో వస్తుంది. బహుశా 24GB వరకు (LPDDR5x) ర్యామ్, UFS 4.0 స్టోరేజ్‌తో సహా ఫైనల్ కాన్ఫిగరేషన్‌లు ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు.

డిజైన్ పరంగా చూస్తే.. :
రెడ్‌మి టర్బో 4 ప్రో ప్రీమియం లుక్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. మెటల్ మిడిల్ ఫ్రేమ్ ద్వారా సపోర్టు అందించే గ్లాస్ బ్యాక్ ప్యానెల్ ఉంటుంది. లీక్‌ల ప్రకారం.. టర్బో 4 ప్రో 2.5K రిజల్యూషన్, ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్‌తో 6.83-అంగుళాల ఫ్లాట్ LTPS డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ ఏడాది ప్రారంభంలో 1.5K OLED ప్యానెల్‌తో స్టాండర్డ్ రెడ్‌మి టర్బో 4 నుంచి డిస్‌ప్లే అప్‌గ్రేడ్‌ను సూచిస్తుంది.

ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. :
రెడ్‌మి టర్బో 4 ప్రో మోడల్‌లో 8MP సెకండరీ కెమెరాతో పాటు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో కూడిన 50MP ప్రైమరీ సెన్సార్ ఉంటుందని పుకారు ఉంది. బ్యాటరీ లైఫ్ కూడా టర్బో 4 ప్రోలో అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే.. ఈ ఫోన్ 7,550mAh+ బ్యాటరీని కలిగి ఉంటుందని అంచనా.

7,300mAh సెల్‌ను అందించే ఐక్యూ Z10 వంటి ప్రస్తుత బ్యాటరీల కన్నా బెటర్ అని చెప్పవచ్చు. రెడ్‌మి టర్బో 4 ప్రో 90W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. IP68 లేదా IP69 రేటింగ్ కూడా ఉండొచ్చు.

లభ్యత విషయానికొస్తే.. :
ప్రస్తుతానికి రెడ్‌మి టర్బో 4 ప్రో చైనాలోనే అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు. నివేదికల ప్రకారం.. ఈ ఫోన్‌ను అంతర్జాతీయ మార్కెట్లలో పోకో F7గా రీబ్రాండ్ చేయవచ్చు. షావోమీ రెడ్‌మి, పోకో లైన్లను ప్రాంతీయంగా రిలీజ్ చేయనుంది.

Read Also : Summer AC Problems : ఏంటి.. మీ AC కూలింగ్ సరిగా లేదా? టెక్నీషియన్ పిలిచే ముందు ఈ సింపుల్ టిప్స్ ఓసారి ట్రై చేయండి..!

స్టాండర్డ్ రెడ్‌మి టర్బో 4 ఫోన్ గత జనవరిలో డైమెన్సిటీ 8400-అల్ట్రా చిప్, 1.5K OLED డిస్‌ప్లే, డ్యూయల్-కెమెరా సెటప్, 6,550mAh బ్యాటరీతో వస్తుంది. ఈ రెడ్‌మి టర్బో 4 ప్రో ధర CNY 1,999 (సుమారు రూ. 23,500) ఉంటుందని అంచనా.