హైస్పీడ్ డేటా నెట్ వర్క్ ఏదంటే.. టక్కున గుర్తుచ్చే మొబైల్ డేటా నెట్ వర్క్ రిలయన్స్ జియో. మొబైల్ మార్కెట్లోకి వచ్చిన కొద్ది కాలంలోనే టెలికం ఇండస్ట్రీని షేక్ చేసింది.
హైస్పీడ్ డేటా నెట్ వర్క్ ఏదంటే.. టక్కున గుర్తుచ్చే మొబైల్ డేటా నెట్ వర్క్ రిలయన్స్ జియో. మొబైల్ మార్కెట్లోకి వచ్చిన కొద్ది కాలంలోనే టెలికం ఇండస్ట్రీని షేక్ చేసింది. ఇతర టెలికం ఆపరేటర్ల కంటే తక్కువ ఖరీదుకే హైస్పీడ్ డేటా ప్లాన్లు అందిస్తూ టాప్ రేంజ్ లోకి దూసుకెళ్లింది. చౌకగా జియో ఫోన్, హైస్పీడ్ డేటా అందిస్తుండటంతో మొబైల్ యూజర్లంతా జియో నెట్ వర్క్ కే పట్టం కట్టేశారు.
Read Also : భ్రష్టు పట్టిస్తోంది : ఏంటీ ‘Bigo Live’.. మాయలో కుర్రోళ్లు
జియో అందించే టాప్ రీఛార్జ్ ప్లాన్స్ ఇప్పుడు మొబైల్ మార్కెట్ లో ట్రెండ్ సృష్టిస్తున్నాయి. జియో నెట్ వర్క్ రీఛార్జ్ ప్లాన్లలో యూజర్లను ఆకట్టుకునే ఎన్నో బెనిఫెట్స్ ఉన్నాయి. డేటా బెనిఫెట్స్, వాయిస్ కాల్స్, హైస్పీడ్ ఇంటర్నెట్, ఎస్ఎంఎస్.. ఇలా మరెన్నో ఆఫర్లను అందిస్తోంది. జియో అందిస్తున్న రోజుకు 1.5జీబీ డేటాతో హైస్పీడ్ డేటాను అందించే పలు ఆఫర్లలో టాప్ 5 రీఛార్జ్ డేటా ప్లాన్లు, బెనిఫెట్స్ ఏంటో ఓసారి చూద్దాం..
1. రూ.149 రీఛార్జ్ ప్యాక్ :
జియో అందించే టాప్ రీచార్జ్ డేటా ప్లాన్లలో ప్రారంభ డేటా ప్లాన్లలో రూ. 149 ఒకటి. ఈ ప్లాన్ యాక్టివేట్ చేసుకుంటే చాలు.. జియో యూజర్లు రోజుకు 1.5GB హైస్పీడ్ డేటా పొందవచ్చు. అంతేకాదు.. ఫ్రీ లోకల్ కాల్స్, STD వాయిస్ కాల్స్, అన్ లిమిటెడ్ SMS (రోజుకు 100) 28 రోజుల కాలపరిమితి పొందవచ్చు. ఈ ప్లాన్ కు సంబంధించి వివరాల కోసం జియో టెలికం కంపెనీ వెబ్ సైట్ jio.com ను విజిట్ చేయండి.
2. రూ. 349 రీఛార్జ్ ప్యాక్ :
ఈ ప్లాన్ యాక్టివేట్ చేసుకునే యూజర్లకు రోజుకు 1.5GB హైస్పీడ్ డేటా పొందవచ్చు. 70రోజుల పాటు ఈ వేగవంతమైన ఇంటర్నెట్ ను ఎంజాయ్ చేయవచ్చు. ఫ్రీ STD, లోకల్ వాయిస్ కాల్స్, Unlimited SMS (రోజుకు 100) పొందవచ్చు. ప్లాన్ వ్యాలిడెటీ 70 రోజుల వరకు వర్తిస్తుంది.
Read Also : అకౌంట్ unlock కోసం వాట్సాప్ లో కొత్త ఫీచర్
3. రూ.399 రీఛార్జ్ ప్యాక్ :
యూజర్లు ఈ ప్లాన్ యాక్టివేట్ చేసుకుంటే రోజుకు 1.5జీబీ హైస్పీడ్ ఇంటర్నెట్ తో పాటు Unlimited ఫ్రీ లోకల్ వాయిస్ కాల్స్, అన్ లిమిటెడ్ ఎస్ఎంఎస్ లు పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడెటీ 84రోజుల వరకు ఉంటుంది.
4. రూ.449 రీఛార్జ్ ప్యాక్ :
ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. రోజుకు 1.5జీబీ హైస్పీడ్ ఇంటర్నెట్, అన్ లిమిటెడ్ ఫ్రీ లోకల్, ఎస్టీడీ వాయిస్ కాల్స్, 100 ఎస్ఎంఎస్ లు పొందవచ్చు. ఈ ప్యాక్ వ్యాలిడెటీ 91 రోజుల వరకు వర్తిస్తుంది.
5. రూ.1.699 రీఛార్జ్ ప్యాక్ :
ఈ భారీ ప్యాక్ కింద రిలయన్స్ జియో హైస్పీడ్ డేటాను అందిస్తోంది. రూ.1699తో రీఛార్జ్ చేసుకున్న యూజర్లకు హైస్పీడ్ డేటాతో పాటు అన్ లిమిటెడ్ ఫ్రీ లోకల్, STD వాయిస్ కాల్స్, అన్ లిమిటెడ్ SMS అందిస్తోంది. ఈ ప్లాన్ వ్యాలిడెటీ ఏడాది వరకు (365 రోజులు) ఉంటుంది.
Read Also : ప్రయాణికులకు గుడ్ న్యూస్ : వెయ్యి రైల్వే స్టేషన్లలో ఫ్రీ Wi-Fi