జియో యూజర్లకు గుడ్ న్యూస్. మొబైల్ డేటా నెట్ వర్క్ సంచలనం.. రిలయన్స్ జియో సెలబ్రేషన్ ప్యాక్ ను మళ్లీ మార్కెట్లో ప్రవేశపెట్టింది. జియో యూజర్ల కోసం ప్రత్యేకించి ఈ ప్యాక్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
జియో యూజర్లకు గుడ్ న్యూస్. మొబైల్ డేటా నెట్ వర్క్ సంచలనం.. రిలయన్స్ జియో సెలబ్రేషన్ ప్యాక్ ను మళ్లీ మార్కెట్లో ప్రవేశపెట్టింది. జియో యూజర్ల కోసం ప్రత్యేకించి ఈ ప్యాక్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్యాక్ యాక్టివేట్ చేసుకునే యూజర్లు అదనంగా 10జీబీ డేటా పొందొచ్చు. రోజుకు 2జీబీ డేటాను 5 రోజుల వ్యాలెడెటీతో పొందొచ్చు. ఎగ్జిటింగ్ యూజర్లు 4జీ డేటా నెట్ వర్క్ పై రోజుకు 2జీబీ డేటా పొందవచ్చు. జియో సెలబ్రేషన్ ప్యాక్ లో అదనంగా డేటా పొందాలంటే జియో యూజర్లు ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి చాలు..
Read Also : మెసేజ్ ఫార్వాడ్ చేస్తున్నారా? : వాట్సాప్‌లో 3 కొత్త ఫీచర్లు వచ్చేస్తున్నాయ్
1. మైజియో యాప్ ఓపెన్ చేయండి.
2. మీ జియో ఫోన్ నెంబర్ తో లాగిన్ కావాలి.
3 వన్ టైమ్ పాస్ వర్డ్ (ఓటీపీ) రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కు వస్తుంది.
4. టాప్ లెఫ్ట్ కార్నర్ లో 3 లైన్లు ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
5. మై ప్లాన్స్ అనే అప్షన్ ప్రెస్ చేయండి.
6. జియో సెలబ్రేషన్ ప్యాక్ సెలెక్ట్ చేసుకోండి.
అంతే.. ప్రస్తుత మీ జియో డేటా ప్లాన్ మారిపోయి.. సెలబ్రేషన్ డేటా ప్యాక్ యాక్టివేట్ అవుతుంది.
సెలబ్రేషన్ ప్యాక్ యాక్టివేట్ చేసుకోవాలంటే.. మరో సదుపాయం కూడా జియో అందిస్తోంది. జియో టోల్ ఫ్రీ నెంబర్ 1299 కి కాల్ చేసి SMS ద్వారా మీ నెంబర్ ను వెరిఫై చేసుకోండి. మీ రిజిస్టర్డ్ ఫోన్ నెంబర్ కు జియో సెలబ్రేషన్ డేటా యాడ్ ఆన్ ప్యాక్ కు సంబంధించి మెసేజ్ వస్తుంది. అంతే.. సెలబ్రేషన్ డేటా ప్లాన్ యాక్టివేట్ అయినట్టే.. అదనపు డేటాతో 5 రోజుల వరకు ఎంజాయ్ చేయండి.. 2018 సెప్టెంబర్ నెలలో రిలయన్స్ జియో రెండో యానివర్శరీ సందర్భంగా సంస్థ అధినేత ముఖేశ్ అంబానీ జియో సెలబ్రేషన్ ప్యాక్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే.
Read Also : ఎడిట్ బటన్‌పై ట్వీట్ వార్: ట్విట్టర్‌కు వికీపీడియా బర్త్‌డే విషెస్
రిలయన్స్ జియో.. అత్యధిక వేగవంతమైన టెలికం నెట్ వర్క్ గా టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓ నివేదికలో వెల్లడించింది. జియో డేటా నెట్ వర్క్ పై సగటున డేటా డౌన్ లోడ్ స్పీడ్ సెకన్ కు 20.9 మెగాబైట్స్ గా తెలిపింది. డేటా నెట్ వర్క్ అందించే ఇతర టెలికం నెట్ వర్క్ దిగ్గజాలైన భారతీ ఎయిర్ టెల్, వోడాఫోన్ డేటా నెట్ వర్క్ స్పీడ్ 9.4 Mbps, 6.7Mbps ప్లాట్ గా నమోదైనట్టు నివేదిక తెలిపింది.
జనవరిలో జియో డేటా స్పీడ్ తో పోలిస్తే.. ఎయిర్ టెల్, వోడాఫోన్ డేటా నెట్ వర్క్ ప్లాట్ గా నమోదైనట్టు ట్రాయ్ తమ నివేదకలో పేర్కొంది. మై స్పీడ్ అప్లికేషన్ రియల్ టైమ్ ఆధారంగా ట్రాయ్ డేటా నెట్ వర్క్ సగటు స్పీడ్ ను సేకరించారు. ఇందులో ఐడియా డేటా నెట్ వర్క్ డౌన్ లోడ్ స్పీడ్ .. జనవరిలో 5.5 Mbps ఉండగా.. ఫిబ్రవరిలో సగటున 5.7Mbps స్పీడ్ వరకు పెరిగినట్టు ట్రాయ్ వెల్లడించింది.