Reliance Jio : మీకు డేటా అవసరం లేదా? జియో కొత్త రీఛార్జ్ ప్లాన్లు ఇవే.. 365 రోజులు ఎంజాయ్ చేయొచ్చు..!

Reliance Jio : రిలయన్స్ జియో కాలింగ్, SMS ఓన్లీ రీఛార్జ్ ప్లాన్లను తీసుకొచ్చింది. డేటాను అవసరం లేని వినియోగదారులకు చాలా బెస్ట్..

Jio offer

Reliance Jio : రిలయన్స్ జియో యూజర్లకు గుడ్ న్యూస్.. డేటా లేకుండా జియో రెండు కొత్త రీఛార్జ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. 365 రోజులు ఎంజాయ్ చేయొచ్చు. ఇటీవలే ట్రాయ్ టెలికాం (Reliance Jio) కంపెనీలను కాలింగ్, SMS ఓన్లీ రీఛార్జ్ ప్లాన్‌లను అందించాలని ఆదేశించింది.

జియో కాలింగ్, SMSలతో మాత్రమే 2 చౌక రీఛార్జ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. జియో వెబ్‌సైట్‌లో లిస్ట్ చేసింది. ఈ ప్లాన్లపై 365 రోజుల వరకు లాంగ్ వ్యాలిడిటీని పొందవచ్చు. డేటా అవసరం లేని యూజర్లకు బెస్ట్.. కాలింగ్, SMS బెనిఫిట్స్ పొందవచ్చు. జియో రూ.458కి 84 రోజుల వ్యాలిడిటీ, రూ.1958కి 365 రోజుల వ్యాలిడిటీతో అందుబాటులో ఉన్నాయి.

84 రోజుల జియో ప్లాన్ :
జియో కొత్త రూ.458 ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్ అన్‌లిమిటెడ్ కాలింగ్, 1000 ఫ్రీ SMS బెనిఫిట్స్ పొందవచ్చు. జియో సినిమా, జియో టీవీ వంటి యాప్ కూడా ఫ్రీ యాక్సెస్ పొందవచ్చు. ఈ ప్లాన్ ప్రత్యేకంగా కాలింగ్, SMS అవసరమయ్యే యూజర్లకు అందిస్తోంది. ఏ నెట్‌వర్క్‌లోనైనా అన్‌లిమిటెడ్ కాల్స్, ఫ్రీ నేషనల్ రోమింగ్ సౌకర్యం కూడా అందిస్తోంది.

Read Also : Best Phones : కొత్త ఫోన్ కావాలా? ఈ జూలైలో రూ.50వేల లోపు ధరలో బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. నచ్చిన ఫోన్ కొనేసుకోండి..!

జియో 365 రోజుల ప్లాన్ :
జియో కొత్త రూ.1958 ప్రీపెయిడ్ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ రీఛార్జ్ ప్లాన్‌లో వినియోగదారులు ఏ నెట్‌వర్క్‌లోనైనా అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. 3600 ఫ్రీ SMS, ఫ్రీగా నేషనల్ రోమింగ్ కూడా చేసుకోవచ్చు.

జియో సినిమా, జియో టీవీ వంటి యాప్‌లకు ఫ్రీ యాక్సెస్‌ కూడా పొందవచ్చు. జియో పాత రీఛార్జ్ ప్లాన్‌లను తొలగించింది. రూ.479, రూ.1899. రూ.1899 ప్లాన్ 336 రోజుల వ్యాలిడిటీతో 24GB డేటాను అందించగా, రూ.479 ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీతో 6GB డేటాను అందించింది.