Best Phones : కొత్త ఫోన్ కావాలా? ఈ జూలైలో రూ.50వేల లోపు ధరలో బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. నచ్చిన ఫోన్ కొనేసుకోండి..!
Best Phones : ఆకర్షణీయమైన ఫీచర్లతో కొత్త హైఎండ్ స్మార్ట్‌ఫోన్లు కొనాలని అనుకుంటున్నారా? మీకోసం రూ. 50వేల లోపు ధరలో అదే రేంజ్ ఫోన్లు ఉన్నాయి..

Best Phones
Best Phones : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? హై-ఎండ్ ఫీచర్లతో అద్భుతమైన గేమింగ్, ఫొటోగ్రఫీ అందించే ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్‌లలో చాలా వరకు స్పీ్డ్ ప్రాసెసర్‌లు, టాప్ రేంజ్ స్క్రీన్‌లు, లాంగ్ బ్యాటరీ లైఫ్ అందించే కెమెరాలు ఉన్నాయి.
ఈ జూలైలో భారత మార్కెట్లో ప్రీమియం ఫోన్లలో రూ. 50వేల లోపు ధరలో బెస్ట్ 5G స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ జాబితాలో ఒప్పో రెనో 14 ప్రో సహా మరో మూడు ఫోన్లు ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన ఫోన్ ఎంచుకుని కొనేసుకోవచ్చు..
ఒప్పో రెనో 14 ప్రో :
పాపులర్ రెనో సిరీస్‌లో ఒప్పో రెనో 14 ప్రో మోడల్ ఒకటి. ప్రీమియం లుక్, బ్యాటరీ లైఫ్ అద్భుతంగా ఉంటాయి. ఈ ఫోన్ మెటల్-గ్లాస్ ఫినిషింగ్, 80W ఫాస్ట్ ఛార్జింగ్‌తో భారీ 6,200mAh బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 8450 చిప్ ద్వారా పవర్ పొందుతుంది.
ఆండ్రాయిడ్ లేటెస్ట్ కలర్‌ఓఎస్ 15 సాఫ్ట్‌వేర్‌ను కూడా కలిగి ఉంది. కెమెరాల విషయానికొస్తే, ఒప్పో ఫోన్ మొత్తం నాలుగు 50MP సెన్సార్లను కలిగి ఉంది. ప్రైమరీ, అల్ట్రా-వైడ్, టెలిఫోటో, ఫ్రంట్ కోసం మొబైల్ ఫోటోగ్రఫీకి బెస్ట్ ఫోన్. రెనో 13 ప్రో మొత్తం ప్యాకేజీని అందిస్తోంది. రూ. 50వేల లోపు ధరలో ప్రీమియం ఫోన్ కోసం చూస్తుంటే ఇదే బెస్ట్ ఫోన్.
వన్‌ప్లస్ 13R :
ఫ్లాగ్‌షిప్ ఆండ్రాయిడ్ ఫోన్లలో వన్‌ప్లస్ 13R బెస్ట్ ఫోన్. ఈ మోడల్ ధర రూ. 42,999కు పొందవచ్చు. వన్‌ప్లస్ సిగ్నేచర్ సాఫ్ట్‌వేర్ పాలిష్‌తో అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది. డిస్‌ప్లే 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 4,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో ఫ్లాట్ 6.78-అంగుళాల అమోల్డ్ ప్యానెల్ కలిగి ఉంది.
ఇండోర్, అవుట్‌డోర్ వినియోగానికి బెస్ట్ ఫోన్. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. 6,000mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తుంది. వన్‌ప్లస్ 4 ఏళ్ల ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 6 ఏళ్ల సెక్యూరిటీ ప్యాచ్‌లను అందిస్తుంది. ఏఐ నోట్స్, ఏఐ అన్‌బ్లర్, గ్లోవ్ మోడ్ వంటి ఫీచర్లు కలిగి ఉంది.
రియల్‌మి GT 7 :
రియల్‌మి GT 7 రూ. 39,999 ధరతో అందుబాటులో ఉంది. 1.5K రిజల్యూషన్‌తో 6.78-అంగుళాల అమోల్డ్ స్క్రీన్, టాప్ రేంజ్ 6,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. హుడ్ కింద, కొత్త డైమెన్సిటీ 9400e ప్రాసెసర్ ఫ్లాగ్‌షిప్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. గేమర్‌లకు అద్భుతంగా ఉంటుంది.
భారీ 7,000mAh బ్యాటరీని కలిగి ఉంది. బాక్స్‌లో 120W ఫాస్ట్ ఛార్జర్‌తో వస్తుంది. ఫాస్ట్ రీఛార్జ్ ద్వారా రోజంతా ఛార్జ్ వస్తుంది. 50MP ప్రైమరీ రియర్ కెమెరా ఉంది. హై ఎండ్ పర్ఫార్మెన్స్ ఫోన్ కోసం చూస్తున్నవారికి రియల్‌మి GT 7 బెస్ట్ ఫోన్.
శాంసంగ్ గెలాక్సీ A56 :
శాంసంగ్ గెలాక్సీ A56 అద్భుతమైన డిజైన్ కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల సూపర్ అమోల్డ్ స్క్రీన్‌తో హై-బ్రైట్‌నెస్ మోడ్‌లో 1,200 నిట్స్ సపోర్టుతో వస్తుంది. గెలాక్సీ A56 ఎక్సినోస్ 1580 చిప్‌తో వస్తుంది. 50MP మెయిన్ కెమెరాను కలిగి ఉంది.
డే టైమ్ అద్భుతమైన ఫొటోలను క్యాప్చర్ చేయొచ్చు. శాంసంగ్ 6 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్, 4 ఆండ్రాయిడ్ OS అప్‌గ్రేడ్స్ అందిస్తుంది. బేస్ మోడల్ ధరలు రూ. 41,999 నుంచి ప్రారంభమవుతాయి. హై ఎండ్ ర్యామ్, స్టోరేజీ వేరియంట్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి.