Reliance Jio Plans : రిలయన్స్ జియో చౌకైన ప్లాన్లు ఇదిగో.. అన్‌లిమిటెడ్ కాల్స్, మరెన్నో డేటా బెనిఫిట్స్ మీకోసం..!

Reliance Jio Plans : రిలయన్స్ జియోలో అత్యంత సరసమైన ధరకే రీఛార్జ్ ప్లాన్లు ఉన్నాయి. రూ.100 కన్నా తక్కువ ధరకే జియో ప్లాన్లను రీఛార్జ్ చేసుకోండి. అన్‌లిమిటెడ్ కాలింగ్ బెనిఫిట్స్, మరెన్నో డేటా బెనిఫిట్స్ పొందవచ్చు.

Reliance Jio Plans : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో అత్యంత చౌకైన ధరకే రీఛార్జ్ ప్లాన్లను ఆఫర్ చేస్తోంది. తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు మరెన్నో రీఛార్జ్ ప్లాన్లను అందిస్తోంది. అందులో ప్రధానంగా జియో రూ. 100 కన్నా తక్కువ ధర కలిగిన ప్లాన్‌లను అందిస్తోంది. జియో అతి చౌకైన ప్లాన్ రూ. 75 ఒకటి కాగా.. మరొక ప్లాన్ రూ. 91 మాత్రమే. జియోఫోన్ యూజర్ల కోసం తక్కువ ధరలో ఈ ప్లాన్‌లను అన్‌లిమిటెడ్ కాలింగ్ బెనిఫిట్స్ కూడా అందిస్తుంది.

Read Also : Reliance Jio Plan : రిలయన్స్ జియో చౌకైన ప్లాన్ ఇదిగో.. 84 రోజుల వ్యాలిడిటీ, మరెన్నో డేటా బెనిఫిట్స్.. డోంట్ మిస్..!

జియో రూ. 75 రీఛార్జ్ ప్లాన్ :
జియో యూజర్లు రూ. 75 ప్లాన్‌పై 23 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. ఇందులో రోజూ 0.1ఎంపీ డేటా అందుబాటులో ఉంటుంది. ఇది కాకుండా, 200ఎంపీ అదనపు డేటా కూడా పొందవచ్చు. మొత్తంగా, జియో ఈ ప్లాన్‌లో 2.5జీబీ డేటా అందుబాటులో ఉంది. అలాగే, ఏ నెట్‌వర్క్‌లోనైనా అన్‌లిమిటెడ్ కాలింగ్, 50 ఉచిత ఎస్ఎంఎస్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్లాన్ జియోఫోన్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుందని గమనించాలి.

జియో రూ. 91 రీఛార్జ్ ప్లాన్ :
జియో రూ.91 ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. ఇందులో రోజూ 0.1ఎంపీ డేటా అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా, 200ఎంపీ అదనపు డేటా అందిస్తుంది. జియో అందించే ప్లాన్‌లో 3జీబీ డేటా అందుబాటులో ఉంది. అలాగే, ఏ నెట్‌వర్క్‌లోనైనా అన్‌లిమిటెడ్ కాలింగ్, 50 ఉచిత ఎస్ఎంఎస్‌లు అందుబాటులో ఉన్నాయి.

Reliance Jio cheapest plans

ఈ జియో కస్టమర్లకు మాత్రమే :
రిలయన్స్ జియో యూజర్లలో చాలా మంది వినియోగదారులకు వ్యాలిడిటీ కన్నా ఇంటర్నెట్ డేటా అవసరం. తక్కువ ధరలకు డేటాను మాత్రమే కోరుకునే వారికి చాలా ఉపయోగపడుతుంది. కాలేజీ, వృత్తిపరమైన విద్యార్థులకు ఇలాంటి అవసరాలు ఎక్కువగా ఉంటాయి. ఈ జియో ప్లాన్‌లతో డేటా ప్లాన్‌ను విడిగా రీఛార్జ్ చేసుకోవాలి. బడ్జెట్ తక్కువగా ఉన్న వినియోగదారులకు ఈ ప్లాన్లు బెస్ట్ అని చెప్పవచ్చు. తక్కువ బడ్జెట్‌లో ఉచితంగా అన్‌లిమిటెడ్ కాల్స్‌ను వినియోగించుకోవచ్చు.

ప్రత్యేకంగా జియోఫోన్ యూజర్ల కోసం 28 రోజుల వ్యాలిడిటీతో కొత్త రూ. 75 రీఛార్జ్ ప్లాన్ వస్తుంది. ఈ రీఛార్జ్ ప్లాన్ అన్‌లిమిటెడ్ కాలింగ్‌ను అందిస్తుంది. ఏదైనా నెట్‌వర్క్‌కు లోకల్, ఎస్‌టీడీ కాల్‌లకు వర్తిస్తుంది. అంతే కాకుండా, ప్లాన్ రోజుకు 50 ఎస్ఎంఎస్, 100ఎంబీ/రోజు 4జీ డేటాను కూడా అందిస్తుంది.

ఈ ప్లాన్‌తో వినియోగదారులు 200ఎంపీ బూస్టర్ డేటాను కూడా పొందుతారు. ఇతర బెనిఫిట్స్ కోసం జియో యాప్‌లు, సర్వీసులకు యాక్సెస్ కూడా ఉంటుంది. ఈ కొత్త రూ.75 రీఛార్జ్ ప్రీపెయిడ్ ప్లాన్‌తో పాటు, జియో జియోఫోన్ వినియోగదారుల కోసం రూ.125, రూ.155, రూ.185, రూ.749 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లను కూడా అందిస్తోంది.

Read Also : JioPhone Prima Plans : జియోఫోన్ ప్రైమా 4జీ ప్రీపెయిడ్ ప్లాన్లు ఇవే.. ఏ ప్లాన్ ధర ఎంతంటే? పూర్తి లిస్టు మీకోసం..!

ట్రెండింగ్ వార్తలు