Reliance Jio Down : స్తంభించిన జియో నెట్‌వర్క్.. వేలాది యూజర్లపై ఎఫెక్ట్.. ఎట్టకేలకు ఫిక్స్ చేసిందిగా..!

Reliance Jio Down : జియో నెట్‌వర్క్ సమస్య కారణంగా 10వేల మందికి పైగా యూజర్లు ప్రభావితమయ్యారని ప్రముఖ డౌన్ డిటెక్టర్ వెబ్‌సైట్ సూచిస్తుంది.

Reliance Jio is down for thousands of users, you are not alone

Reliance Jio Down : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో నెట్‌వర్క్ ఒక్కసారిగా స్తంభించింది. దేశంలోని వేలాది మంది జియో వినియోగదారులు నెట్‌వర్క్ సమస్యలను ఎదుర్కొన్నారు. వాస్తవానికి, ఈ జియో సర్వీసులు దేశ రాజధాని ఢిల్లీలో చాలా మంది యూజర్లకు అందుబాటులో ఉన్నాయి.

Read Also : iPhone 17 Leaks : ఐఫోన్ 17 సిరీస్ వచ్చేస్తోంది.. కెమెరా, డిస్‌ప్లే, చిప్‌సెట్ వివరాలు లీక్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

యూజర్ల ఫిర్యాదుల ప్రకారం.. ఈ నెట్‌వర్క్ సమస్య ముంబైలోని జియో యూజర్లకు మాత్రమే పరిమితమైంది. మిగతా ప్రాంతాల్లోని జియో యూజర్లకు నెట్‌వర్క్ పరంగా ఎలాంటి సమస్యలు లేవని నివేదిక తెలిపింది. ట్విట్టర్ వేదికగా ప్రభావిత జియో యూజర్ల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో జియో ప్రకటన విడుదల చేసింది.

యూజర్ల ఫిర్యాదులపై రిలయన్స్ జియో ప్రకటన :
“ఈ ఉదయం, ముంబైలోని కొంతమంది జియో కస్టమర్లు చిన్నపాటి సాంకేతిక సమస్యల కారణంగా సేవలు పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం ఆ సమస్య పరిష్కరించడం జరిగింది. జియో నెట్‌వర్క్ సంబంధిత సమస్యలు పూర్తిగా పరిష్కరించాం. మా కస్టమర్లకు కలిగిన అసౌకర్యానికి మేం చింతిస్తున్నాం” అని రిలయన్స్ జియో ప్రతినిధి పేర్కొన్నారు.

అసలేమైందంటే? :
రిలయన్స్ జియో సర్వీసులు భారత్‌లోని చాలా మంది వినియోగదారులకు అకారణంగా నిలిచిపోయాయి. ప్రధానంగా ఈ జియో నెట్‌వర్క్ ఢిల్లీలో చాలా మంది యూజర్లకు బాగానే పని చేస్తున్నప్పటికీ, ఇతర యూజర్ల ఫిర్యాదుల ప్రకారం.. ఈ సమస్య ముంబై వినియోగదారులకు మాత్రమే పరిమితమైంది.

జియో నెట్‌వర్క్ సమస్య కారణంగా 10వేల మందికి పైగా యూజర్లు ప్రభావితమయ్యారని ప్రముఖ డౌన్ డిటెక్టర్ వెబ్‌సైట్ సూచిస్తుంది. మొదట మధ్యాహ్నం 12:15 గంటలకు నివేదించింది. 65 శాతం మంది వినియోగదారులు సిగ్నల్ సమస్యలను ఎదుర్కోగా.. 19 శాతం మంది మొబైల్ ఇంటర్నెట్‌తో సమస్యలను నివేదించారని సూచిస్తుంది. దాదాపు 16 శాతం మంది జియో వినియోగదారులకు జియోఫైబర్ నెట్‌వర్క్‌తో సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఆసక్తికరంగా, ఎక్స్ వేదికగా కొంతమంది యూజర్లు మైజియో యాప్‌తో సమస్యలను నివేదించారు. జియో యాప్ లోడ్ కావడం లేదని వాపోయారు. ప్రస్తుతానికి, రిలయన్స్ ఈ సమస్యను గుర్తించలేదు. అయితే, మిలియన్ల మంది జియో వినియోగదారులపై ప్రభావం చూపలేదు. కొన్ని గంటల వ్యవధిలోనే నెట్‌వర్క్ సమస్యను పరిష్కరించినట్టు కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది.

Read Also : iPhone 16 Launch Offers : ఆపిల్ ఐఫోన్ 16 లాంచ్ ఆఫర్లు.. ఈ కొత్త ఐఫోన్ మోడల్స్‌ తక్కువ ధరకే ఎలా కొనుగోలు చేయాలంటే?