×
Ad

Reliance Jio : జియో పండగ ఆఫర్.. జస్ట్ రూ. 349కే సరికొత్త ప్లాన్.. ఈ 4 బెనిఫిట్స్ మాత్రం కేక.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి!

Reliance Jio : జియో అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్.. సరసమైన ధరలో ఎక్కువ బెనిఫిట్స్ పొందవచ్చు. ఈ రీఛార్జ్ ప్లాన్‌తో మరెన్నో బెనిఫిట్స్ పొందవచ్చు.

Reliance Jio

Reliance Jio : రిలయన్స్ జియో యూజర్లకు పండగ ఆఫర్.. అత్యంత సరసమైన ధరకే జియో అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్లను ఆఫర్ చేస్తోంది. కేవలం రూ.349 ధరకు కొత్త ప్లాన్‌ను అందిస్తోంది. గోల్డ్‌పై స్పెషల్ బెనిఫిట్స్ పొందవచ్చు. ధంతేరాస్, దీపావళికి ముందు రిలయన్స్ జియో ఈ పండుగ రీఛార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ కొనుగోలుపై రోజువారీ డేటా, కాలింగ్‌తో సహా అనేక ఓటీటీ బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. ఇంతకీ ఈ ప్లాన్ ద్వారా అందించే ఫెస్టివల్ ఆఫర్‌లు, ఇతర వివరాలను ఓసారి పరిశీలిద్దాం..

జియో రూ.349 ప్లాన్ వినియోగదారులకు 28 రోజుల వ్యాలిడిటీని (Reliance Jio) అందిస్తుంది. వినియోగదారులు అన్ని నెట్‌వర్క్‌లలో రోజుకు 2GB డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ పొందవచ్చు. ఈ ప్లాన్‌లో ప్రతిరోజూ 100 SMS పంపుకోవచ్చు. అనేక ఇతర బెనిఫిట్స్ కూడా పొందవచ్చు.

జియో ఫైనాన్స్‌పై గోల్డ్ బోనస్ :
జియోఫైనాన్స్ యాప్‌లో గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ బోనస్. జియో గోల్డ్‌లో పెట్టుబడి పెట్టే వినియోగదారులకు అదనంగా 2శాతం బోనస్ లభిస్తుంది. ఈ బెనిఫిట్ కోసం వినియోగదారులు +91-8010000524కు మిస్డ్ కాల్ ఇవ్వాలి. డిజిటల్ గోల్డ్‌లో పెట్టుబడి పెట్టాలనుకునే వారు తమ పెట్టుబడిపై కొంచెం అదనపు రాబడిని పొందాలనుకునేవారికి అద్భుతమైన ఆప్షన్ అని చెప్పొచ్చు.

Read Also : Apple iPhone 16 Price : ఐఫోన్ ప్రియులకు పండగే.. ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 16పై మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్.. కొంటే ఇప్పుడే కొనేసుకోండి!

జియోహోమ్ 2 నెలల ఫ్రీ ట్రయల్స్ :
జియో స్మార్ట్ హోమ్ సెటప్‌ కోసం కంపెనీ జియోహోమ్ 2 నెలల ఫ్రీ ట్రయల్‌ను అందిస్తోంది. కొత్త కనెక్షన్‌ను కొనుగోలు చేసే వినియోగదారులకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఈ ట్రయల్ సమయంలో వినియోగదారులు జియో హోమ్ ఇంటర్నెట్, స్మార్ట్ డివైజ్, ఓటీటీ కంటెంట్ వంటి సర్వీసులను యాక్సస్ చేయొచ్చు.

3 నెలల పాటు జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ :
ఎంటర్‌టైన్మెంట్ కోసం జియో 3 నెలల జియో హాట్‌స్టార్ మొబైల్, టీవీ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తోంది. వినియోగదారులు ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా స్పోర్ట్స్, సినిమాలు, వెబ్ సిరీస్‌ల వంటి ప్రీమియం కంటెంట్‌ను యాక్సస్ చేయొచ్చు.

జియోక్లౌడ్‌లో 50GB ఫ్రీ స్టోరేజీ :
డిజిటల్ డేటా సేఫ్‌ కోసం జియో యూజర్ల కోసం (JioAICloud)లో 50GB ఫ్రీ క్లౌడ్ స్టోరేజీని అందిస్తోంది. వినియోగదారులు తమ ఫైల్‌లు, ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్లను క్లౌడ్‌లో సేవ్ చేసుకోవచ్చు. అంతేకాదు.. ఏ డివైజ్ నుంచి అయినా సులభంగా యాక్సెస్ చేసుకోవచ్చు.