Jio Recharge Plans
Jio Recharge Plan : జియో యూజర్లకు గుడ్ న్యూస్.. రిలయన్స్ జియో సరసమైన లాంగ్-వ్యాలిడిటీ రీఛార్జ్ (Jio Recharge Plan) ప్లాన్‌లను అందిస్తోంది.
ప్రీపెయిడ్ యూజర్ల కోసం ఆకర్షణీయమైన రీఛార్జ్ ప్లాన్ ధర రూ. 1029 ప్రవేశపెట్టింది. 84 రోజుల వ్యాలిడిటీతో పాటు రోజువారీ డేటా, OTT యాక్సెస్, క్లౌడ్ స్టోరేజ్‌తో సహా అదనపు బెనిఫిట్స్ అందిస్తుంది.
84 రోజుల వ్యాలిడిటీ :
జియో రూ.1029 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా యూజర్లు 84 రోజుల వ్యాలిడిటీతో అన్ని నెట్‌వర్క్‌లలో అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ పొందవచ్చు. ఈ ప్లాన్‌లో రోజుకు 100 ఫ్రీ SMS బెనిఫిట్స్ పొందవచ్చు. రోజువారీ లిమిట్స్ లేకుండా కాలింగ్, టెక్స్టింగ్ రెండింటికి బెస్ట్ అని చెప్పొచ్చు.
రోజుకు 2GB, అన్‌లిమిటెడ్ 5G డేటా :
జియో రోజుకు 2GB చొప్పున 168GB హై-స్పీడ్ డేటాను అందిస్తోంది. జియో ట్రూ 5G అన్‌లిమిటెడ్ డేటాను కూడా పొందవచ్చు. అదనపు ఖర్చు లేకుండా స్పీడ్ ఇంటర్నెట్ యాక్సెస్‌ను పొందవచ్చు.
డిస్నీ+ హాట్‌స్టార్, ప్రైమ్ లైట్ ఫ్రీ :
రూ. 1029 ప్లాన్ ద్వారా OTT బెనిఫిట్స్ పొందవచ్చు. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ లైట్ ఫ్రీగా యాక్సస్ చేయొచ్చు. 90 రోజుల పాటు ఫ్రీ సర్వీసు పొందవచ్చు.
అమెజాన్ ప్రైమ్ లైట్ 84 రోజుల పాటు ఉచితంగా యాక్సెస్ చేయొచ్చు. ఈ ప్లాన్ కోసం ప్రత్యేకించి సబ్‌స్క్రైబ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సినిమాలు, షోలు, క్రికెట్ మ్యాచ్‌లను వీక్షించవచ్చు.
ఫ్రీ 50GB ఏఐ క్లౌడ్ స్టోరేజీ :
కాలింగ్, డేటా, OTTతో పాటు 50GB ఫ్రీ ఏఐ క్లౌడ్ స్టోరేజ్, డాక్యుమెంట్లు, మీడియా, బ్యాకప్ కోసం సేఫ్ స్టోరేజ్ అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ లాంగ్ వ్యాలిడిటీ, డేటా, 5G సపోర్టుతో 84 రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది.