Jio Mobile Plans : ఈ జియో ప్లాన్లతో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఫ్రీగా వరల్డ్ కప్ 2023 ఫైనల్ మ్యాచ్ చూడొచ్చు.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి!

Reliance Jio Mobile Plans : రిలయన్స్ జియో ప్రీపెయిడ్ ప్లాన్‌లతో స్ట్రీమింగ్ సర్వీసుకు కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్‌లను అందిస్తోంది. జియో ప్రీపెయిడ్ మొబైల్ యూజర్లు ఇప్పుడు భారత్ vs ఆస్ట్రేలియా క్రికెట్ వరల్డ్ కప్ 2023 ఫైనల్‌ను డిస్నీ+ హాట్‌స్టార్‌లో ఉచితంగా ఆస్వాదించవచ్చు.

Jio Mobile Plans : ఈ జియో ప్లాన్లతో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఫ్రీగా వరల్డ్ కప్ 2023 ఫైనల్ మ్యాచ్ చూడొచ్చు.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి!

Reliance Jio mobile plans with free Disney+ Hotstar to watch cricket World Cup 2023 final

Reliance Jio Mobile Plans : క్రికెట్ అభిమానులంతా ప్రపంచ కప్ 2023లో భారత్ vs ఆస్ట్రేలియా క్రికెట్ ఫైనల్ మ్యాచ్ చూసేందుకు ఆసక్తిగా ఉన్నారు. షెడ్యూల్ ప్రకారం.. ఆదివారం (నవంబర్ 19) రోజున ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. ఫైనల్ మ్యాచ్‌ను ఉచితంగా వీక్షించడానికి మీరు డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా పొందవచ్చు. అది ఎలా అంటారా? మీరు చేయాల్సిందిల్లా.. హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ ఉండాలి కదా? అంటారా? మీరు జియో ప్రీపెయిడ్ మొబైల్ ప్లాన్ ద్వారా ఉచితంగా సబ్‌స్ర్కిప్షన్ పొందవచ్చు.

రిలయన్స్ జియో ఎంపిక చేసిన ప్రీపెయిడ్ ప్లాన్‌లపై డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, ఇతర స్ట్రీమింగ్ యాప్‌ల ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తోంది. స్ట్రీమింగ్ సర్వీసుల సబ్‌స్క్రిప్షన్‌కు అదనంగా చెల్లించకుండానే యూజర్లు 5G స్పీడ్, అన్‌లిమిటెడ్ కాలింగ్, మరిన్ని బెనిఫిట్స్ పొందవచ్చు. ఫ్రీ డిస్నీ+ హాట్‌స్టార్‌తో జియో ప్రీపెయిడ్ మొబైల్ ప్లాన్‌లను వివరంగా పరిశీలిద్దాం.

Reliance Jio mobile plans with free Disney+ Hotstar to watch cricket World Cup 2023 final

Reliance Jio mobile plans

జియో ఫ్రీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ప్లాన్లు ఇవే :
జియో రూ. 328 ప్రీపెయిడ్ ప్లాన్ : రూ. 328 ధరతో ఈ ప్లాన్ యూజర్లకు 28 రోజుల పాటు రోజువారీ 1.5జీబీ డేటాను అందిస్తుంది. అదనంగా, ఈ ప్లాన్‌కు సబ్‌స్క్రైబర్‌లు డిస్నీ+ హాట్‌స్టార్‌కు కాంప్లిమెంటరీ 3-నెలల సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. తద్వారా ప్రపంచ‌కప్ ఫైనల్ ఎంజాయ్ చేయొచ్చు.

Read Also : Reliance Jio Prepaid Plans : జియో యూజర్లకు పండుగే.. ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లతో ఉచితంగా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సబ్‌స్ర్కిప్షన్..!

జియో రూ. 388 ప్రీపెయిడ్ ప్లాన్ : కొంచెం ఎక్కువ డేటాను కోరుకునే వారికి, జియో రూ. 388 ప్రీపెయిడ్ ప్లాన్ 28 రోజుల వ్యవధిలో 2జీబీ రోజువారీ డేటా లిమిట్ అందిస్తుంది. అదనపు బోనస్‌గా, సబ్‌స్క్రైబర్‌లు డిస్నీ+ హాట్‌స్టార్‌కి 3-నెలల కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు.

జియో రూ. 758 ప్రీపెయిడ్ ప్లాన్ : జియో రూ. 758 ప్రీపెయిడ్ ప్లాన్, రోజువారీ డేటా అలవెన్స్ 1.5జీబీని కొనసాగిస్తూనే వ్యాలిడిటీ వ్యవధిని 84 రోజులకు పొడిగిస్తుంది. అంతేకాకుండా, సబ్‌స్క్రైబర్‌లు 3-నెలల కాంప్లిమెంటరీ డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ బెనిఫిట్స్ పొందవచ్చు.

జియో రూ. 808 ప్రీపెయిడ్ ప్లాన్ : రూ. 808 ధరతో ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 84 రోజుల వ్యవధికి 2జీబీ రోజువారీ డేటా లిమిట్ అందిస్తుంది. సబ్‌స్క్రయిబర్‌లు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌కి 3-నెలల కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా పొందవచ్చు. ఇంటర్నెట్ కనెక్టివిటీ, ఎంటర్‌టైన్మెంట్ పొందవచ్చు.

Reliance Jio mobile plans with free Disney+ Hotstar to watch cricket World Cup 2023 final

Reliance Jio mobile plans free Disney+ Hotstar

జియో రూ. 598 ప్రీపెయిడ్ ప్లాన్ : జియో రూ. 598 ప్రీపెయిడ్ ప్లాన్ యూజర్లకు 28 రోజుల పాటు 2జీబీ రోజువారీ డేటా లిమిట్ అందిస్తుంది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌కు కాంప్లిమెంటరీ ఏడాది సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. విభిన్న రేంజ్ కంటెంట్‌కు ఎక్కువరోజులు యాక్సెస్‌ను అందిస్తుంది.

జియో రూ. 3,178 ప్రీపెయిడ్ ప్లాన్ : దీర్ఘకాల ప్లాన్లను కోరుకునే యూజర్ల కోసం రూ. 3,178 ప్రీపెయిడ్ ప్లాన్ పూర్తి ఏడాదికి 2జీబీ రోజువారీ డేటా లిమిట్ అందిస్తుంది. దాంతో పాటుగా, సబ్‌స్క్రైబర్‌లు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌కి కాంప్లిమెంటరీ ఏడాది సబ్‌స్క్రిప్షన్ నుంచి బెనిఫిట్స్ పొందవచ్చు. డేటా, ఎంటర్‌టైన్‌మెంట్ రెండింటికీ ఈజీగా యాక్సెస్‌ను అందిస్తుంది. ఈ ప్లాన్‌లతో పాటు, జియో రూ. 331 డేటా యాడ్-ఆన్ ద్వారా అదనపు డేటా ఆప్షన్లను కూడా అందిస్తోంది. ఈ యాడ్-ఆన్ 3-నెలల డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను 30 రోజుల పాటు అదనపు 40జీబీ డేటాను అందిస్తుంది.

Read Also : Reliance Jio Annual Plans : రిలయన్స్ జియో కొత్త వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్లు ఇవే.. అమెజాన్ ప్రైమ్ వీడియో ఫ్రీగా చూసేయొచ్చు!