Reliance Jio Offers : జియో యూజర్లకు పండగే.. 5 అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్లు ఇవే..

Reliance Jio : జియో మీ సెకండరీ సిమ్‌ను యాక్టివ్‌గా ఉంచుకునేందుకు సరసమైన రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తోంది. పూర్తి వివరాలను ఓసారి చెక్ చేయండి.

Reliance Jio offers

Reliance Jio Offers : జియో యూజర్లకు గుడ్ న్యూస్.. మీ ఫోన్‌లో జియో సెకండరీ సిమ్ కార్డుగా వాడుతున్నారా? అయితే, ఇది మీకోసమే.. ప్రస్తుత రోజుల్లో వ్యక్తిగతంగా మాత్రమే కాదు.. బిజినెస్, ఉద్యోగ పరంగా ఒకటి లేదా రెండు సిమ్ కార్డులను వాడటం తప్పనిసరిగా మారింది. వినియోగదారుల కోసం మొబైల్ తయారీ కంపెనీలు కూడా డ్యూయల్ సిమ్‌లతో కూడిన స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నాయి.

Read Also : Summer AC Sales : కొత్త AC కావాలా? 5 స్టార్ స్ప్లిట్ ఏసీలపై భారీ డిస్కౌంట్లు.. ఇప్పుడే కొని ఇంటికి తెచ్చుకోండి!

ప్రైమరీ సిమ్‌తో పాటు ఏదైనా పరిస్థితుల్లో మీకు సెకండరీ సిమ్ అవసరం కూడా పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈజీగా ఇతరులతో కనెక్ట్ అవ్వొచ్చు. కొంతమంది వినియోగదారులు వివిధ ప్లాట్‌ఫామ్‌లలో లాగిన్ అయ్యేందుకు సెకండర్ నంబర్‌ను మార్కెటింగ్ లేదా షాపింగ్ చేసేటప్పుడు మాత్రమే వాడుతుంటారు. అదనపు సిమ్‌ను వాడటం వల్ల మీ నెలవారీ బిల్లులు కూడా భారీగా పెరుగుతాయి. అందుకే రిలయన్స్ జియో తమ యూజర్ల కోసం అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్లను ఆఫర్ చేస్తోంది.

ప్రధానంగా, జియో సిమ్‌ సెకండరీ సిమ్‌ యూజర్లకు అన్‌లిమిటెడ్ కాల్స్, డెయిలీ SMS, డేటాతో కూడిన సరసమైన ప్లాన్‌లను అందిస్తుంది. మీ సెకండరీ సిమ్‌ను తక్కువ ఖర్చుతో యాక్టివ్‌గా ఉంచుకోవచ్చు.

సెకండరీ సిమ్ యూజర్లకు మాత్రమే కాదు.. Wi-Fi ద్వారా ఇంటర్నెట్‌ను వాడుతుంటే.. అత్యవసర పరిస్థితుల్లో కనీస ఇంటర్నెట్ యాక్సెస్‌ను పొందవచ్చు. మీ సెకండరీ సిమ్‌ను యాక్టివ్‌గా ఉంచేందుకు అవసరమైన 5 బడ్జెట్-ఫ్రెండ్లీ జియో ప్లాన్‌లను ఓసారి వివరంగా పరిశీలిద్దాం.

జియో రూ. 198 ప్లాన్.. 14 రోజుల వ్యాలిడిటీ :
జియో రూ. 198 ప్లాన్ 14 రోజుల వ్యాలిడిటీతో అందిస్తోంది. ఈ చౌకైన ప్లాన్‌లో మొత్తం 28GB డేటా, రోజుకు 2GB హై-స్పీడ్ డేటా ఉన్నాయి. అదనంగా, యూజర్లు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100SMS పొందవచ్చు. బ్రౌజింగ్, స్ట్రీమింగ్ కోసం డేటాను కూడా పొందవచ్చు. సెకండరీ సిమ్‌ వాడే వారికి ఈ ప్లాన్ సరిగ్గా సరిపోతుంది.

జియో రూ. 199 ప్లాన్.. 18 రోజుల వ్యాలిడిటీ :
జియో యూజర్లు కేవలం ఒక రూపాయికే రూ.199 ప్లాన్ వ్యాలిడిటీని 18 రోజులకు పొడిగించుకోవచ్చు. ఈ ప్లాన్ మొత్తం 27GB డేటాను అందిస్తుంది. రోజుకు 1.5GB హై-స్పీడ్ డేటాను అందిస్తుంది. గత ప్లాన్ మాదిరిగానే ఈ ప్లాన్ అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100SMS కూడా ఉన్నాయి. డేటా లేదా కాల్ బెనిఫిట్స్ విషయంలో అసలు తగ్గేదేలేదు. కొంచెం ఎక్కువ వ్యాలిడిటీ అవసరమయ్యే యూజర్లు ఈ ప్లాన్ బెస్ట్ అని చెప్పవచ్చు.

జియో రూ. 209 ప్లాన్.. 22 రోజుల వ్యాలిడిటీ :
రూ.209 ప్లాన్ జియో యూజర్లకు బడ్జెట్-ఫ్రెండ్లీ ప్లాన్. 22 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్ మొత్తం 22GB డేటాతో వస్తుంది. రోజుకు 1GB హై-స్పీడ్ డేటాను పొందవచ్చు. ఇందులో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100SMS కూడా పొందవచ్చు.

జియో రూ. 239 ప్లాన్.. 22 రోజుల వ్యాలిడిటీ :
మీరు కొత్త జియో ప్లాన్ కోసం చూస్తుంటే.. రూ.239 ప్లాన్ కూడా బెస్ట్ ఆప్షన్. 22 రోజుల వ్యాలిడిటీతో ఈ ప్లాన్ రోజుకు 1.5GB హై-స్పీడ్ డేటాతో వస్తుంది. మొత్తం 33GB డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100SMS పొందవచ్చు.

Read Also : Vivo T3 5G Sale : వావ్.. ఆఫర్ అదిరింది.. అతి తక్కువ ధరకే వివో T3 5G ఫోన్.. ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలంటే?

జియో రూ. 249 ప్లాన్.. 28 రోజుల వ్యాలిడిటీ :
జియో యూజర్లకు రూ.249 బెస్ట్ ప్లాన్. 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. నెలవారీ ప్లాన్‌గా అందుబాటులో ఉంది. రోజుకు 1GB హై-స్పీడ్ డేటాతో సహా మొత్తం 28GB డేటాను పొందవచ్చు. అంతేకాదు.. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100SMS కూడా పొందవచ్చు. సెకండరీ సిమ్ యూజర్లకు అద్భుతమైన ప్యాకేజీగా చెప్పవచ్చు.