Jio IPL Plan : వావ్ వండర్‌ఫుల్.. ఈ జియో ప్లాన్‌తో IPL మ్యాచ్‌లు 3 నెలలు ఫ్రీగా చూడొచ్చు.. మరెన్నో OTT బెనిఫిట్స్ కూడా!

Jio IPL Plan : ఈ బడ్జెట్-ఫ్రెండ్లీ ప్లాన్‌తో జియోహాట్‌‌స్టార్ ఉచితంగా సబ్‌స్ర్కిప్షన్ మాత్రమే కాదు.. 90 రోజుల పాటు ఐపీఎల్ ఎంజాయ్ చేయొచ్చు. ఎంటర్‌టైన్మెంట్, హై-స్పీడ్ ఇంటర్నెట్‌, మరెన్నో డేటా బెనిఫిట్స్ పొందవచ్చు.

Jio IPL Plan

Jio IPL Plan : ఐపీఎల్ అభిమానుల కోసం రిలయన్స్ జియో అద్భుతమైన ప్లాన్ తీసుకొచ్చింది. 90 రోజుల పాటు వ్యాలిడిటీతో బడ్జెట్-ఫ్రెండ్లీ లాంగ్ టైమ్ రీఛార్జ్ ప్లాన్‌ అందిస్తోంది. ఈ రీఛార్జ్ ప్లాన్ ద్వారా అన్‌లిమిటెడ్ కాల్స్, హై-స్పీడ్ డేటా, OTT బెనిఫిట్స్ పొందవచ్చు. అంతేకాదు.. జియో యూజర్లు ఇకపై పదేపదే రీఛార్జులు చేయాల్సిన పనిలేదు. ఒకసారి రూ. 899 రీఛార్జ్ ప్లాన్ తీసుకుంటే.. ఏకంగా 3 నెలల పాటు రీఛార్జ్ కోసం ఆందోళన చెందనక్కర్లేదు.

Read Also : DGGI Block Websites : ఐపీఎల్‌కు ముందే బెట్టింగ్ రాయుళ్లకు బిగ్ షాక్.. 357 ఆన్‌‌లైన్ గేమింగ్స్ వెబ్‌సైట్లు, 2400 బ్యాంకు అకౌంట్లు బ్లాక్.. కోట్ల నగదు స్వాధీనం!

జియో 90 రోజుల ప్లాన్ ధర రూ. 899 :
జియో పోర్ట్‌ఫోలియోను కొత్త రూ.899 ప్రీపెయిడ్ ప్లాన్‌తో విస్తరించింది. నెలవారీ రీఛార్జ్‌ల అవసరం లేకుండా వినియోగదారులకు సరసమైన లాంగ్‌టైమ్ ప్లాన్ అందిస్తుంది. సరసమైన ధరలో ఎక్కువ వ్యాలిడిటీ కోసం చూస్తున్న యూజర్లకు ఈ ప్లాన్ బెస్ట్ అని చెప్పవచ్చు.

ప్లాన్ బెనిఫిట్స్ :
* అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 2GB డేటా
* జియో రూ.899 ప్లాన్ 90 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది

జియో ప్లాన్ ఆఫర్లు :
* అన్ని లోకల్, STD నెట్‌వర్క్‌లలో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్
* రోజుకు ఉచితంగా 100 SMS
* 2GB రోజువారీ హై-స్పీడ్ డేటా, మొత్తం 180GB డేటా
* అదనంగా 20GB బోనస్ డేటా, మొత్తం 200GB వరకు డేటా
* IPL 2025 కోసం ఉచితంగా జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్

ఐపీఎల్ 2025 సీజన్ సందర్భంగా జియో 90 రోజుల పాటు ఫ్రీ జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా అందిస్తోంది. తద్వారా వినియోగదారులు అదనపు ఖర్చు లేకుండా లైవ్ క్రికెట్ మ్యాచ్‌లు, మూవీలు, వెబ్ సిరీస్‌లను చూడవచ్చు.

ఫ్రీ క్లౌడ్ స్టోరేజీ, అదనపు బెనిఫిట్స్ :
డేటా, ఎంటర్‌టైన్మెంట్ బెనిఫిట్స్‌తో పాటు జియో యూజర్లకు 50GB ఫ్రీ క్లౌడ్ స్టోరేజీని కూడా అందిస్తోంది. ముఖ్యమైన ఫైల్స్, మీడియాను ఆన్‌లైన్‌లో స్టోర్ చేసుకోవచ్చు.

ఈ ప్లాన్ ఎందుకు బెటర్? :
* సరసమైన ధరలో లాంగ్ టైమ్ వ్యాలిడిటీతో వస్తుంది. IPL ప్రియులకు బెస్ట్ ప్లాన్
* ఎక్కువ డేటా వాడే యూజర్లకు భారీ డేటాను అందిస్తుంది.
* దాదాపు 3 నెలల వరకు రీఛార్జ్ చేయాల్సిన పనిలేదు.
* జియో హాట్‌స్టార్ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్‌ కూడా పొందవచ్చు.

Read Also : Realme P3 5G : కొంటే ఇలాంటి ఫోన్ కొనాలి.. భారీ బ్యాటరీ, అతి తక్కువ ధరకే రియల్‌మి P3 5G ఫోన్.. డోంట్ మిస్..!

ఎయిర్‌టెల్ కొత్త ప్లాన్ అందుబాటులో ఉంది. ఎంటర్‌టైన్మెంట్ బెనిఫిట్స్‌తో సరసమైన రీఛార్జ్ ప్లాన్ కోసం చూస్తుంటే.. రూ. 301 ప్రీపెయిడ్ ప్లాన్‌ను ఎంచుకోవచ్చు. మరోవైపు.. జియో కూడా కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ ధర కేవలం రూ. 299 మాత్రమే. అదనపు సబ్‌స్క్రిప్షన్ ఛార్జీలు లేకుండా IPL 2025 వీక్షించే క్రికెట్ ఔత్సాహికుల కోసం ఈ ప్లాన్ తీసుకొచ్చింది.