Royal Enfield : భారీగా పెరిగిన రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ ధరలు

రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ బైక్స్ రేట్లను పెంచింది. ఒక్కో బండిపై రూ.5 నుంచి రూ.7 వేల వరకు పెరిగింది.

Royal Enfield : రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ బైక్స్ రేట్లను పెంచింది. ఒక్కో బండిపై రూ.5 నుంచి రూ.7 వేల వరకు పెరిగింది. దీంతో ఇప్పుడు కొత్తగా రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ కొనాలనుకునే వారిపై ప్రతికూల ప్రభావం పడనుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ తన హిమాలయన్ బైక్ పై రూ.5 వేల వరకు పెంచింది. 2021 రాయల్ ఎన్‌ఫీల్డ్ ధరలు పెంచడం ఇది రెండవసారి.. జులై నెలలో ఓ సారి పెంచగా.. తాజాగా మరోసారి పెంచింది.

Read More : Love Story Trailer : ‘చస్తే చద్దాం.. కానీ తేల్చుకుని చద్దాం’.. చైతు బెస్ట్ పెర్ఫార్మెన్స్..

రేట్ల పెంపు తర్వాత హిమాలయన్ బైక్ ధర రూ.2.10 (షోరూం ప్రైస్) లక్షల నుంచి ప్రారంభమౌతోంది. అంతేకాకుండా రాయల్ ఎన్‌ఫీల్డ్ మెటిరో 350 బైక్ ధరలు కూడా పెరిగాయి. ఈ బైక్ ధర రూ.7 వేల వరకు పెరిగింది. ఇప్పుడు ఈ బైక్ ప్రారంభ ధర రూ.2 లక్షలు. జూలైలో కూడా ఈ బైక్ ధర రూ.9 వేలు పైకి చేరింది. రెండు నెలల వ్యవధిలోనే ఈ బైక్ పై రూ.16 వేలు పెంచింది కంపెనీ.

Read More : Rooster Death : నాకోడిని చంపేసారు..పోస్ట్ మార్టం చేయండీ..మాజీ ఎమ్మెల్యే కొడుకు డిమాండ్

హోండా కంపెనీ కూడా ఈ ఏడాది మొదట్లో ధరలు పెంచింది. గతేడాది 95 వేలకు లభించిన హోండా యూనికాన్ బైక్.. 2021లో రూ.1లక్ష 20 వేలకు చేరింది. బజాజ్ కూడా తన వాహన శ్రేణిలోని కొన్ని వేరియంట్ల రేట్లను ఈ ఏడాది పెంచింది. అయితే బైక్ ల తయారి ఖర్చు పెరగడం వాళ్లంటే తాము రేట్లు పెంచాల్సి వస్తుందని మోటర్ సైకిల్ కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు