Royal Enfield Shotgun 650 : కొత్త బైక్ కొంటున్నారా? రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 ధర, కలర్లు, డెలివరీలు, బుకింగ్స్ పూర్తి వివరాలివే..!
Royal Enfield Shotgun 650 : రాయల్ ఎన్‌ఫీల్డ్ 650 లైనప్‌లో ఇప్పుడు షాట్‌గన్ 650, సూపర్ మెటోర్ 650, ఇంటర్‌సెప్టర్ 650, కాంటినెంటల్ జీటీ 650 ఉన్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Royal Enfield Shotgun 650_ Price, colours, India deliveries, other details
Royal Enfield Shotgun 650 : ప్రముఖ ప్రీమియం ద్విచక్ర వాహనాల తయారీ కంపెనీ రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి గ్లోబల్ మార్కెట్లలో ఇటీవలే షాట్‌గన్ 650 కొత్త బుల్లెట్ లాంచ్ అయింది. అయితే, ప్రస్తుతం ఈ బుల్లెట్ ధర, కలర్ ఆప్షన్లు, మైలేజీ, మార్కెట్లో డెలివరీలకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యాయి. ప్రస్తుతం హంటర్ 350, బుల్లెట్ 350, క్లాసిక్ 350, మెటోర్ 350, స్క్రామ్ 411, హిమాలయన్, సూపర్ మెటోర్ 650, ఇంటర్‌సెప్టర్ 650, కాంటినెంటల్ GT650 వంటి వాటిని కలిగి ఉన్న కంపెనీ పోర్ట్‌ఫోలియోను మరింత బలోపేతం చేస్తుంది.
షాట్‌గన్ 650 మొదటిసారిగా (EICMA 2021)లో ఎస్‌జీ 650 కాన్సెప్ట్‌గా అందరి దృష్టిని ఆకర్షించింది. డిసెంబర్ 2023లో ఈ మోటార్ సైకిల్ అధికారికంగా లాంచ్ కాగా.. గోవాలోని మోటోవర్స్ 2023లో ఆవిష్కరించారు. కొత్త మోటార్‌సైకిల్ ధర, బుకింగ్‌లు, డెలివరీలు, స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల గురించి మీరు తెలుసుకోవలసిన పూర్తివివరాలు ఇలా ఉన్నాయి.
షాట్‌గన్ 650 బుకింగ్‌లు అండ్ డెలివరీలు :
యూకే, యూరోపియన్ మార్కెట్‌లలో ఔత్సాహికులు షాట్‌గన్ 650 మోడల్ బుల్లెట్ ఫిబ్రవరి 2024 నుంచి అందుబాటులో ఉండవచ్చు. యూకేలో ఈ బుల్లెట్ ధర 6,699 పౌండ్‌లు, జర్మనీ, ఫ్రాన్స్ వంటి దేశాలలో 7,590 యూరోలు ఉంటుంది. ఇదిలా ఉండగా, భారతీయ రైడర్‌లు ఇప్పటికే బుకింగ్‌ల కోసం సిద్ధమవుతున్నారు.
టెస్ట్ రైడ్‌లు, డెలివరీలు మార్చి 2024లో ప్రారంభం కానున్నాయి. భారత మార్కెట్‌లో ప్రారంభ ధర ఈ షాట్‌గన్ బుల్లెట్ ధర రూ. 3,59,430 (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది. అమెరికా, ఆసియా-పసిఫిక్ ప్రాంతాలు 2024 స్పింగ్ సీజన్ (వసంతకాలం)లో షాట్‌గన్ 650 బుల్లెట్ అందుబాటులోకి రానున్నాయి.

Royal Enfield Shotgun 650 Price
రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 మైలేజ్ :
షాట్‌గన్ 650 మోడల్ 648సీసీ, సమాంతర-ట్విన్, 4-స్ట్రోక్, ఎస్ఓహెచ్‌సీ, ఎయిర్-ఆయిల్ కూల్డ్, ఈఎఫ్ఐ ఇంజన్ నుంచి శక్తిని పొందుతుంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేసిన 46.4హెచ్‌పీ, 52.3ఎన్ఎమ్ టార్క్‌ను విడుదల చేస్తుంది. బైక్ ఇంధన సామర్థ్యం లీటరుకు 22 కి.మీ మైలేజీ అందిస్తుంది.
షాట్‌గన్ 650 స్పెసిఫికేషన్లు :
స్టీల్ ట్యూబ్యులర్ స్పైన్ ఫ్రేమ్‌తో రూపొందించిన షాట్‌గన్ 650లో యూఎస్‌డీ ఫోర్క్స్ అప్ ఫ్రంట్, ట్విన్ షాక్‌లు ఉన్నాయి. ముందు భాగంలో 18-అంగుళాల అల్లాయ్ వీల్, బ్యాక్ 17-అంగుళాల అల్లాయ్ వీల్ కలిగి ఉన్నాయి. రెండూ ట్యూబ్‌లెస్ టైర్‌లతో అమర్చబడి ఉంటాయి. స్టాపింగ్ పవర్ ముందువైపు 320ఎమ్ఎమ్ డిస్క్ బ్రేక్, వెనుకవైపు 300ఎమ్ఎమ్ డిస్క్ నుంచి వస్తుంది. డ్యూయల్-ఛానల్ ఏబీఎస్ ద్వారా అందిస్తుంది.
ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 కలర్ ఆప్షన్లు :
రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 మొత్తం స్టెన్సిల్ వైట్, ప్లాస్మా బ్లూ, గ్రీన్ డ్రిల్, షీట్ మెటల్ గ్రే అనే నాలుగు రంగు స్కీమ్‌లలో అందుబాటులో ఉంది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 ఫీచర్లు :
షాట్‌గన్ 650లో ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, ట్రిప్పర్ నావిగేషన్‌తో కూడిన డిజీ-అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఎల్ఈడీ టైల్‌లైట్ ఉన్నాయి. సింగిల్ ఫ్లోటింగ్ సీటు విలక్షణమైన బాబర్ మోడల్ కలిగి ఉంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 బార్ ఎండ్ మిర్రర్స్, స్కల్ప్టెడ్ సోలో సీట్, కాంట్రాస్ట్-కట్ బిల్లెట్ రిమ్‌లతో సహా 31 అసలైన మోటార్‌సైకిల్ అప్లియన్సెస్ సూట్‌ను కలిగి ఉంది. అదనంగా, రాయల్ ఎన్‌ఫీల్డ్ వింగ్‌మ్యాన్ యాప్ ఫీచర్ రైడర్‌లకు వారి బైక్ లొకేషన్, ఇంధనం, ఇంజిన్ ఆయిల్ స్థాయిలు, సర్వీస్ రిమైండర్‌లపై లైవ్ అప్‌డేట్స్ అందిస్తుంది.

Royal Enfield Shotgun 650
రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 ధరలు :
వేరియంట్ వారీగా రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 ధర (ఎక్స్-షోరూమ్) ఈ కింది విధంగా ఉన్నాయి.
- కస్టమ్ షెడ్ – షీట్‌మెటల్ గ్రే : రూ. 3,59,430
- కస్టమ్ ప్రో – ప్లాస్మా బ్లూ : రూ. 3,70,138
- కస్టమ్ ప్రో – గ్రీన్ డ్రిల్ : రూ. 3,70,138
- కస్టమ్ స్పెషల్ – స్టెన్సిల్ వైట్ : రూ. 3,73,000