Samsung Galaxy A14 4G : భారత్‌కు శాంసంగ్ గెలాక్సీ A14 4G ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ధర ఎంతో తెలిసిందోచ్..!

Samsung Galaxy A14 4G : శాంసంగ్ వినియోగదారులకు గుడ్‌న్యూస్.. భారత మార్కెట్లోకి శాంసంగ్ గెలాక్సీ A14 4G ఫోన్ వచ్చేస్తోంది. ఈ ఫోన్ లాంచ్‌కు ముందే ధర వివరాలు లీకయ్యాయి.

Samsung Galaxy A14 4G Tipped to Launch in India Soon; Price Leaked_ Report

Samsung Galaxy A14 4G Launch in India Soon : కొత్త శాంసంగ్ ఫోన్ కోసం చూస్తున్నారా? సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ (Samsung) బడ్జెట్-ఫ్రెండ్లీ గెలాక్సీ A సిరీస్‌ రాబోతోంది. శాంసంగ్ గెలాక్సీ A14 4G త్వరలో బారత మార్కెట్లో లాంచ్ కానుంది. ఈ ఫోన్ వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. ఇటీవలి నివేదికలో శాంసంగ్ లాంచ్ టైమ్‌లైన్‌తో పాటు ఫోన్ ధర, స్టోరేజీ ఆప్షన్లను సూచించింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఏడాది ప్రారంభంలో మలేషియాలో లాంచ్ అయింది. గ్లోబల్ స్పెసిఫికేషన్‌లు ఇప్పటికే రివీల్ అయ్యాయి.

ఈ హ్యాండ్‌సెట్ 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6-అంగుళాల (1,080×2,408 పిక్సెల్) PLS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. (Saminsider) నివేదిక ప్రకారం.. శాంసంగ్ గెలాక్సీ A14 4G కంపెనీ నుంచి బడ్జెట్-ఫ్రెండ్లీ ఆఫర్‌గా వచ్చే వారం భారత మార్కెట్లోకి రానుంది. ఈ ఫోన్ రెండు స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లలో రావచ్చు. 4GB RAM + 64GB స్టోరేజ్, 4GB RAM + 128GB స్టోరేజ్‌తో వస్తుంది. ఈ ఫోన్ ధర వివరాలు లీకయ్యాయి. నివేదిక ప్రకారం.. శాంసంగ్ ఫోన్ బేస్ మోడల్ ధర రూ. 13,999 కాగా, 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 14,999కు అందుబాటులోకి రానుంది.

Read Also : iPhones Update : ఆపిల్ ఐఫోన్లలో కొత్త iOS 16.5 అప్‌డేట్.. మరెన్నో ఆకర్షణీయమైన ఫీచర్లు.. ఇప్పుడే చెక్ చేసుకోండి..!

శాంసంగ్ గెలాక్సీ A14 4G స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లపై ఎలాంటి వివరాలు రివీల్ చేయలేదు. ఈ ఫోన్ ఇప్పటికే మలేషియాలో లాంచ్ అయింది. శాంసంగ్ A14 ఫోన్ స్పెసిఫికేషన్‌లు అదే విధంగా ఉంటాయని భావిస్తున్నారు. మలేషియాలోని శాంసంగ్ గెలాక్సీ A14 4G 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6-అంగుళాల (1,080×2,408 పిక్సెల్) PLS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది.

Samsung Galaxy A14 4G Tipped to Launch in India Soon; Price Leaked

ఈ హ్యాండ్‌సెట్ 6GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజీతో MediaTek Helio G80 SoC ద్వారా పవర్ అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ Android 13 ఆధారిత One UI 5.0 సపోర్టుతో అవుట్-ఆఫ్-ది-బాక్స్‌తో రన్ వస్తుంది. ఆప్టిక్స్ విషయానికి వస్తే.. శాంసంగ్ గెలాక్సీ A14 4G మోడల్ 50-MP ప్రైమరీ సెన్సార్ నేతృత్వంలోని ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను అందిస్తుంది.

ప్రైమరీ కెమెరాతో పాటు 2-MP మాక్రో లెన్స్, 2MP డెప్త్ సెన్సార్ ఉంటుంది. ముందు భాగంలో, డిస్ప్లే, టాప్ సెంటర్ పొజిషన్‌లో వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్‌లో 13-MP సెల్ఫీ కెమెరాను అందిస్తుంది. ఈ ఫోన్‌లోని బ్యాటరీ సామర్థ్యం 15W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీతో రానుంది.

Read Also : Samsung Galaxy A34 5G : కొత్త ఫోన్ కొంటున్నారా? శాంసంగ్ గెలాక్సీ A34 5G ఫోన్‌పై ఓ లుక్కేయండి..!