Samsung Galaxy A34 5G : కొత్త ఫోన్ కొంటున్నారా? శాంసంగ్ గెలాక్సీ A34 5G ఫోన్‌పై ఓ లుక్కేయండి..!

Samsung Galaxy A34 5G Sale : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? శాంసంగ్ గెలాక్సీ A34 5G ఫోన్ కొనుగోలు చేయొచ్చు.. ఈ ఫోన్ రెండు స్టోరేజీ ఆప్షన్లతో భారత మార్కెట్లో అందుబాటులో ఉంది.

Samsung Galaxy A34 5G : కొత్త ఫోన్ కొంటున్నారా? శాంసంగ్ గెలాక్సీ A34 5G ఫోన్‌పై ఓ లుక్కేయండి..!

Samsung Galaxy A34 5G, Should You Buy This Smartphone

Updated On : May 21, 2023 / 1:02 PM IST

Samsung Galaxy A34 5G : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ (Samsung) ఇటీవలే భారత మార్కెట్లో ప్రీమియం శాంసంగ్ గెలాక్సీ A54 5Gతో పాటు లాంచ్ అయింది. గెలాక్సీ A34 5G ఫోన్ గత ఏడాదిలో ప్రారంభమైన Galaxy A33 5Gకి అప్‌గ్రేడ్ వెర్షన్. (Samsung Galaxy A34 5G) ఫోన్ మరెన్నో ఆకర్షణీయమైన అప్‌గ్రేడ్‌లతో వచ్చింది. అంతేకాదు.. కొత్త ప్రాసెసర్‌తో వినియోగదారులను ఆకట్టుకునేలా ఉంది. ట్రిపుల్-కెమెరా సెటప్, 120Hz డిస్‌ప్లేను కలిగి ఉంది.

రెండు స్టోరేజ్ ఆప్షన్లతో వచ్చిన శాంసంగ్ గెలాక్సీ A34 5G ఫోన్ ప్రస్తుతం భారత్‌లో IP67 రేటింగ్‌ను కలిగిన అత్యంత సరసమైన స్మార్ట్‌ఫోన్ అని చెప్పవచ్చు. ఈ 5G ఫోన్ భారత్‌లో 8GB ర్యామ్‌తో వచ్చింది. 128GB వేరియంట్ ధర రూ.30,999 కాగా, 256GB వేరియంట్ ధర రూ.32,999గా నిర్ణయించింది. శాంసంగ్ గెలాక్సీ A34 5G కూడా Galaxy S23 5G మాదిరిగా ప్రీమియం డిజైన్ అదే బ్యాక్ ప్యానెల్ డిజైన్‌ కలిగి ఉంటుంది.

Samsung Galaxy A34 5G, Should You Buy This Smartphone

Samsung Galaxy A34 5G Sale, Should You Buy This Smartphone

Read Also  : Amazon Employee : పీకేసిన కంపెనీలోనే సీనియర్‌గా చేరిన అమెజాన్ ఉద్యోగి.. మెటర్నిటీ లీవ్‌లో ఉండగా తొలగింపు.. అసలేం జరిగిందంటే?

గ్రేట్ వ్యూ అందించే 120Hz AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. ఇందులో HDR10+ సపోర్టు లేదు. వైడ్‌వైన్ L1 DRMని పొందవచ్చు. గెలాక్సీ A34 5G డైమెన్సిటీ 1080 SoCని కలిగి ఉంది. గేమింగ్‌ ప్లేయర్లకు బెస్ట్ ఆప్షన్. iQoo Neo 7 5G లేదా Poco F5ని కొనుగోలు చేయొచ్చు. శాంసంగ్ Galaxy A34 5G ఫోన్‌లో Android 13-ఆధారిత One UI 5.1 అవుట్-ఆఫ్-ది-బాక్స్‌లో ఉపయోగిస్తుంది.

యూజర్ ఇంటర్‌ఫేస్‌లో కొద్దిగా సమస్య ఉందని, రాబోయే అప్‌డేట్‌లో శాంసంగ్ ఈ బగ్‌ను పరిష్కరించే అవకాశం ఉంది. గెలాక్సీ A34 5G ఫోన్ ఐదేళ్ల పాటు నాలుగు ప్రధాన Android అప్‌డేట్స్, సెక్యూరిటీ ప్యాచ్‌లను అందిస్తోంది. ట్రిపుల్-కెమెరా సెటప్‌తో ప్రైమరీ కెమెరా ద్వారా హైక్వాలిటీ ఫొటోలను అందిస్తుంది. అల్ట్రా-వైడ్ కెమెరా తక్కువ వెలుతురులో అంత బాగోదు. 5-MP మాక్రో సెన్సార్ బాగుంది. ఈ 5G ఫోన్ గ్రేట్ బ్యాటరీ లైఫ్ అందిస్తుంది.

Read Also :iPhones Update : ఆపిల్ ఐఫోన్లలో కొత్త iOS 16.5 అప్‌డేట్.. మరెన్నో ఆకర్షణీయమైన ఫీచర్లు.. ఇప్పుడే చెక్ చేసుకోండి..!