Samsung Galaxy A25 5G, Galaxy A15 5G launched in India
Samsung Galaxy A Series 5G : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ నుంచి రెండు సరికొత్త 5జీ బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్లు భారత మార్కెట్లో లాంచ్ అయ్యాయి. శాంసంగ్ డిసెంబర్ 28 (గురువారం) కొత్త గెలాక్సీ ఎ15 5జీ, గెలాక్సీ ఎ25 5జీ ఫోన్లను ఆవిష్కరించింది. ఈ ఫోన్‌లు 2024 గెలాక్సీ ఎ సిరీస్‌లో భాగంగా ఉన్నాయి.
అంతేకాదు.. గెలాక్సీ ఫోన్‌ల లేటెస్ట్ కూల్ ఫీచర్‌లను బడ్జెట్‌కు అనుకూలమైన ధరకు అందజేస్తున్నాయి. గెలాక్సీ ఎ25 5జీ అందించే ప్రత్యేక ఫీచర్లలో విజన్ బూస్టర్‌తో కూడిన గొప్ప సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే, చాలా కూల్ ఫోటో-ఎడిటింగ్ టూల్స్‌తో కూడిన 50ఎంపీ ట్రిపుల్ కెమెరా, భారీ 5000ఎంఎహెచ్ బ్యాటరీ, నాక్స్ వాల్ట్ వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి.
గెలాక్సీ ఎ15 5జీ, గెలాక్సీ ఎ25 5జీ ధర, లభ్యత :
శాంసంగ్ గెలాక్సీ ఎ15 5జీ రెండు స్టోరేజ్ వేరియంట్‌లతో బ్లూ బ్లాక్, బ్లూ, లైట్ బ్లూ కలర్ ఆప్షన్లలో వస్తుంది. 8జీబీ ర్యామ్‌తో 256జీబీ స్టోరేజ్ ధర రూ. 22,499, 8జీబీ ర్యామ్‌తో 128జీబీ స్టోరేజ్ ధర రూ.19,499కు సొంతం చేసుకోవచ్చు. అదనంగా, రెండు వేరియంట్లకు ఎస్‌బీఐ కార్డ్‌లతో రూ. 1,500 బ్యాంక్ క్యాష్‌బ్యాక్ ప్రత్యేక ఆఫర్ అందుబాటులో ఉంది.
Read Also : Samsung Galaxy Z Fold 5 : క్రిస్మస్ సేల్ ఆఫర్లు.. శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 5పై ఏకంగా రూ. 9వేలు తగ్గింపు..
మరోవైపు, గెలాక్సీ ఎ25 5జీ బ్లూ బ్లాక్, బ్లూ, ఎల్లో కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఈ ఫోన్లలో మొత్తం రెండు స్టోరేజ్ ఆప్షన్‌లు కూడా ఉన్నాయి. అందులో 8జీబీ ర్యామ్‌తో 256జీబీ స్టోరేజ్ రూ.29,999, 8జీబీ ర్యామ్‌తో 128జీబీ స్టోరేజ్ రూ.26,999కు కొనుగోలు చేయొచ్చ. కొనుగోలుదారులు ఎస్‌బీఐ కార్డ్‌లను ఉపయోగించి రూ. 3వేలు బ్యాంక్ క్యాష్‌బ్యాక్ ప్రత్యేకమైన ఆఫర్ కూడా పొందవచ్చు.
గెలాక్సీ ఎ15 5జీ, గెలాక్సీ ఎ25 5జీ స్పెసిఫికేషన్‌లు :
శాంసంగ్ గెలాక్సీ ఎ15 5జీ, గెలాక్సీ ఎ25 5జీ ప్రీమియం టచ్ కోసం గెలాక్సీ ఫ్యాన్సీ డిజైన్‌ను అందిస్తాయి. ఎ15 5జీ కూల్ స్నో ఫాగ్ ఎండ్ గ్లాస్టిక్ బ్యాక్‌ను కలిగి ఉంది అయితే, ఎ25 5జీ బ్యాక్ సైడ్ మెరిసే ప్రిజం ప్యాట్రన్ కలిగి ఉంది. రెండు వైపులా ప్రత్యేక డిజైన్, ఫ్లాట్ కెమెరాను కలిగి ఉంటాయి. ఫోన్ పట్టుకోనేందుకు చాలా సులభంగా ఉంటుంది.
Samsung Galaxy A25 5G, Galaxy A15 5G launched
ఎ15 5జీ బ్లూ బ్లాక్, బ్లూ, లైట్ బ్లూ కలర్ ఆప్షన్లలో వస్తుంది. అయితే, ఎ25 5జీ బ్లూ బ్లాక్, బ్లూ ఎల్లో కలర్ ఆప్షన్లలో వస్తుంది. శాంసంగ్ గెలాక్సీఎ15 5జీ మోడల్ 90హెచ్‌జెడ్ వద్ద ప్రకాశవంతమైన వ్యూ కోసం విజన్ బూస్టర్‌తో 6.5-అంగుళాల సూపర్ అమోల్డ్ స్క్రీన్‌ను కలిగి ఉంది. సౌకర్యవంతమైన తక్కువ బ్లూ లైట్ డిస్‌ప్లేను కూడా కలిగి ఉంది. ఎ25 5జీ మోడల్ 6.5-అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే 1000 నిట్‌ల వద్ద ప్రకాశవంతంగా ఉంటుంది. అదనంగా, హానికరమైన నీలి కాంతిని తగ్గించడానికి ఐ కంఫర్ట్ షీల్డ్‌ని కూడా కలిగి ఉంది.
గెలాక్సీ ఎ15 5జీ ఫోన్ 50ఎంపీ ట్రిపుల్ కెమెరాను కలిగి ఉంది. షూటింగ్ సమయంలో మీ చేయి కదులుతున్నప్పుడు వీడియోలు అస్పష్టంగా లేదా షేక్ అయినట్టు కనిపించకుండా నిరోధించడానికి (VDIS)ని ఉపయోగిస్తుంది. గెలాక్సీ ఎ25 5జీ ఫోన్ 50ఎంపీ (ఓఐఎస్) ట్రిపుల్ కెమెరాను కలిగి ఉంది. మీ చేయి కొంచెం వణుకుతున్నప్పటికీ స్పష్టమైన, హై-క్వాలిటీ ఫొటోలు, వీడియోలను క్యాప్చర్ చేయగలదు.
శాంసంగ్ గెలాక్సీ ఎ25 5జీలో చక్కగా కనిపించే సెల్ఫీల కోసం 13ఎంపీ ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. అంతేకాకుండా, శాంసంగ్ గెలాక్సీ ఎ25 5జీ ఫోన్ సింగిల్ టేక్, రీమాస్టర్, ఆబ్జెక్ట్ ఎరేజర్ వంటి చక్కని ఫొటో-ఎడిటింగ్ టూల్స్ కలిగి ఉంది. మీ ఫోటోలను వివిధ మార్గాల్లో ఎడిట్ చేసుకునేందుకు వీలుంటుంది. ఈ ఫీచర్‌లు మీ ఫొటోలను ఎడిటింగ్ టూల్స్ ద్వారా ఆకర్షణీయంగా మార్చడంలో సాయపడతాయి.
ఒకసారి ఛార్జ్ చేస్తే.. రెండు రోజుల వరకు బ్యాటరీ లైఫ్ టైమ్ :
గెలాక్సీ ఎ15 5జీ, గెలాక్సీ ఎ25 5జీ ఫోన్ 8జీబీ మెమరీ, 128జీబీ లేదా 256జీబీ స్టోరేజీ ఆప్షన్లను అందిస్తాయి. గెలాక్సీ ఎ15 5జీ మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ ప్రాసెసర్‌ను ఉపయోగిస్తుంది. అయితే, ఎ25 5జీ మోడల్ ఎక్సినోస్ 1280ని ఉపయోగిస్తుంది. 5ఎన్ఎమ్ ప్రాసెస్ టెక్నాలజీ కారణంగా వేగవంతమైన పనితీరును అందిస్తుంది.
ఈ రెండు ఫోన్‌లు 5000ఎంఎహెచ్ బ్యాటరీని అందిస్తాయి. ఒకసారి ఛార్జ్ చేస్తే రెండు రోజుల వరకు ఉంటుంది. 25డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తాయి. మీరు మీ ఫోన్‌ని ఎలా ఉపయోగిస్తున్నారో దానికి ఎడ్జెస్ట్ చేసే అడాప్టివ్ పవర్-సేవింగ్ మోడ్ కూడా ఉంది. తద్వారా మీ ఫోన్ బ్యాటరీ పవర్ ఆదా అవుతుంది. మరో అద్భుతమైన ఫీచర్ స్లీపింగ్ యాప్ మేనేజ్‌మెంట్, కొన్ని యాప్‌లను బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ చేయకుండా నిలిపివేయగలదు.