Samsung Galaxy A55 5G
Samsung Galaxy A55 5G : కొత్త శాంసంగ్ ఫోన్ కొంటున్నారా? అద్భుతమైన ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ A55 5G ఫోన్ (Samsung Galaxy A55 5G) తక్కువ ధరకే లభ్యమవుతుంది. కెమెరా సెటప్, క్లీన్ యూఐతో అత్యంత ఆకర్షణీయంగా ఉంది. శాంసంగ్ గెలాక్సీ A55 5G బెస్ట్ ఫోన్ కావచ్చు.
Read Also : Flipkart Loans : గుడ్ న్యూస్.. మీకు అకౌంట్ ఉందా? ఇక ఫ్లిప్‌కార్ట్ నుంచి నేరుగా లోన్లు తీసుకోవచ్చు..!
అమెజాన్‌లో రూ. 14వేల ఫ్లాట్ డిస్కౌంట్‌తో ఈ ఫోన్ రూ. 26వేల లోపు ధరకే అందుబాటులో ఉంది. గత ఏడాదిలో ఈ శాంసంగ్ ఫోన్ మెటల్ ఫ్రేమ్, గ్లాస్ బ్యాక్‌తో వస్తుంది. ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, ఆండ్రాయిడ్ 14 అవుట్ ఆఫ్ బాక్స్‌తో వస్తుంది. ఈ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ A55 డీల్ :
శాంసంగ్ గెలాక్సీ A55 ప్రారంభ ధర రూ.39,999పై రూ.14వేలు ఫ్లాట్ డిస్కౌంట్ పొందవచ్చు. ఈ శాంసంగ్ ఫోన్ ప్రస్తుతం అమెజాన్‌లో కేవలం రూ.25,999కు అందుబాటులో ఉంది.
ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ప్రైమ్ సభ్యులకు అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో 5శాతం క్యాష్‌బ్యాక్‌ను కూడా అందిస్తోంది. మీ పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేసుకుంటే రూ.24,200 వరకు సేవ్ చేసుకోవచ్చు. ఈ ఫోన్ మోడల్ వర్కింగ్ కండిషన్ ఆధారంగా ఎక్స్చేంజ్ వాల్యూను అందిస్తుంది.
శాంసంగ్ గెలాక్సీ A55 స్పెసిఫికేషన్లు :
శాంసంగ్ గెలాక్సీ A55 5G ఫోన్ (Samsung Galaxy A55 5G) 2340×1080-పిక్సెల్ (FHD+) రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.60-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ ప్రొటెక్షన్ కూడా వస్తుంది. 12GB వరకు ర్యామ్, 256GB స్టోరేజీని అందిస్తుంది.
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 అవుట్ ఆఫ్ ది బాక్స్‌లో రన్ అవుతుంది. 4 జనరేషన్స్ వరకు ఆండ్రాయిడ్ OS అప్‌గ్రేడ్‌లు, 5 ఏళ్ల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ అందుకోవచ్చు. ఈ శాంసంగ్ ఫోన్ 5000mAh బ్యాటరీతో వస్తుంది. 25W ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.
ఆప్టిక్స్ విషయానికొస్తే.. శాంసంగ్ గెలాక్సీ A55 5G ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 12MP కెమెరా, 5MP కెమెరా ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ సింగిల్ 32MP సెన్సార్‌ను కలిగి ఉంటుంది.