Samsung Galaxy F70e 5G : అద్భుతమైన డిస్కౌంట్.. ఈ శాంసంగ్ గెలాక్సీ F70e 5G చౌకైన ధరకే.. ఫ్లిప్‌కార్ట్‌లో ఇలా కొనండి చాలు..!

Samsung Galaxy F70e 5G Sale : కొత్త శాంసంగ్ గెలాక్సీ F70e ధర తగ్గింది. ఈ బడ్జెట్-ఫ్రెండ్లీ ఫోన్ డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఈ సేల్ ఫ్లిప్‌కార్ట్‌లో సెప్టెంబర్ 6వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది.

Samsung Galaxy F70e 5G

  • ఈ శాంసంగ్ బడ్జెట్-ఫ్రెండ్లీ ఫోన్ డిస్కౌంట్ ధరకే
  • ఫ్లిప్‌కార్ట్‌లో సెప్టెంబర్ 6వ తేదీ వరకు సేల్
  • రూ. 1,000 వరకు బ్యాంక్ డిస్కౌంట్

Samsung Galaxy F70e 5G Sale : శాంసంగ్ లవర్స్ మీకోసమే.. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో శాంసంగ్ బడ్జెట్-ఫ్రెండ్లీ ఫోన్ చవకైన ధరకే లభిస్తోంది. ఈ శాంసంగ్ స్మార్ట్‌ఫోన్‌లో భారీ 6000mAh బ్యాటరీ, వేగన్ లెదర్ ఫినిష్ బ్యాక్ ప్యానెల్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ సేల్ సెప్టెంబర్ 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 6వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది.

శాంసంగ్ ఫోన్లపై తగ్గింపు :
శాంసంగ్ గెలాక్సీ F70e 5జీ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో 2 స్టోరేజ్ వేరియంట్లలో లిస్టు అయింది. 4GB ర్యామ్ + 128GB, 6GB ర్యామ్ + 128GBతో ప్రారంభ ధర రూ. 18,499 కాగా, టాప్ వేరియంట్ ధర రూ. 20,999గా ఉంది. ఈ రెండు ఫోన్లు ప్రారంభ ధర కన్నా రూ.500 తక్కువకే ఫ్లిప్‌కార్ట్‌లో లభిస్తోంది.

అదనంగా, రూ. 1,000 వరకు బ్యాంక్ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ ఫోన్‌పై రూ. 1,500 వరకు ఆదా చేయొచ్చు. లైమ్‌లైట్ గ్రీన్ స్పాట్‌లైట్ బ్లూ అనే 2 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. డిస్కౌంట్ తర్వాత రూ. 17,499 ప్రారంభ ధరతో కొనేసుకోవచ్చు.

శాంసంగ్ గెలాక్సీ F70e ఫీచర్లు :
ఈ శాంసంగ్ ఫోన్‌లో 6.74-అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే ఉంది. కంపెనీ ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇచ్చే ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే ప్యానెల్‌ అందిస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌తో 6GB వరకు ర్యామ్, 128GB స్టోరేజ్‌కు సపోర్టు ఇస్తుంది. మైక్రో SD కార్డ్ ద్వారా ఫోన్ స్టోరేజ్‌ ఇంకా పెంచుకోవచ్చు.

Read Also : Xiaomi Pad 9 Pro Max : ఫోల్డబుల్ ఫోన్‌కు తోడు భారీ 10,000mAh టాబ్లెట్.. షావోమీ సెప్టెంబర్ 7 ధమాకా!

ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత వన్‌యూఐ 8 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. ఈ ఫోన్‌తో పాటు కంపెనీ 6 ఏళ్ల పాటు ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌గ్రేడ్‌లను అందిస్తోంది. ఈ ఫోన్ డ్యూయల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో 50MP మెయిన్ కెమెరా, 2MP సెకండరీ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 8MP కెమెరా ఉంది. ఈ ఫోన్‌లో 6000mAh బ్యాటరీ ఉంది. 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

శాంసంగ్ అతి త్వరలో మరో బడ్జెట్-ఫ్రెండ్లీ ఫోన్ గెలాక్సీ A18 4జీ లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ ఇప్పటికే గీక్‌బెంచ్‌లో లిస్టు అయింది. ఈ ఫోన్ 5జీ మోడల్‌ను కూడా కంపెనీ రివీల్ చేయనుంది. ఈ ఫోన్‌ను 128GB, 256GB స్టోరేజ్ వేరియంట్లలో లాంచ్ చేసే ఛాన్స్ ఉంది. అయితే, ర్యామ్ వివరాలు గీక్‌బెంచ్‌లో వెల్లడి కాలేదు.