Xiaomi Pad 9 Pro Max : ఫోల్డబుల్ ఫోన్‌కు తోడు భారీ 10,000mAh టాబ్లెట్.. షావోమీ సెప్టెంబర్ 7 ధమాకా!
Xiaomi Pad 9 Pro Max : షావోమీ రాబోయే ఫ్లాగ్షిప్ టాబ్లెట్‌లో పవర్ఫుల్ 10,000mAh బ్యాటరీ ఉంటుందని అంచనా. ఈ టాబ్లెట్‌ను IFA 2026లో ప్రదర్శించారు. ఆ కంపెనీ రాబోయే ఫోల్డబుల్ ఫోన్‌ను కూడా టీజ్ చేసింది.
Xiaomi Pad 9 Pro Max
- షావోమీ నుంచి భారీ బ్యాటరీతో కొత్త టాబ్లెట్
- 10,000mAh బ్యాటరీ 13.3-అంగుళాల డిస్ప్లే
- 512GB 1TB స్టోరేజ్ వేరియంట్లలో రానుంది
Xiaomi Pad 9 Pro Max : షావోమీ లవర్స్ మీకోసమే.. జర్మనీ క్యాపిటల్ బెర్లిన్‌లో జరిగిన IFA 2026లో షావోమీ రాబోయే ఫోల్డబుల్ ఫోన్‌తో పాటు ప్రీమియం టాబ్లెట్ ప్యాడ్ 9 ప్రో మ్యాక్స్‌ను రివీల్ చేసింది. ఈ రెండు డివైజ్‌లు సెప్టెంబర్ 7న చైనాలో లాంచ్ కానున్నాయి.
షావోమీ 18 ఫోల్డ్ ఫీచర్లను కూడా కంపెనీ ధృవీకరించింది. వైడ్ డిస్ప్లేతో రాబోయే షావోమీ ఫస్ట్ ఫోల్డబుల్ ఫోన్ ఇదే. మరోవైపు, షావోమీ ప్యాడ్ 9 ప్రో మ్యాక్స్‌లో పవర్ ఫుల్ 10,000mAh బ్యాటరీ భారీ 13.3-అంగుళాల డిస్ప్లేతో వస్తుంది.
షావోమీ ప్యాడ్ 9 ప్రో మ్యాక్స్ ఫీచర్లు :
షావోమీ ఈ ఫ్లాగ్షిప్ టాబ్లెట్ 13.3-అంగుళాల ఎల్సీడీ డిస్ప్లేతో వస్తుంది. ఈ చైనీస్ కంపెనీ ఈ టాబ్లెట్‌ను పీసీ లెవల్ యాప్‌లకు సపోర్టు ఇచ్చేలా రూపొందించింది. భారీ స్క్రీన్ కారణంగా ల్యాప్‌టాప్ మాదిరిగా వాడుకోవచ్చు. కంటెంట్ క్రియేషన్ నుంచి ఇతర సెక్యూరిటీ టాస్కుల వరకు అన్నింటికీ పనికి వస్తుంది.
షావోమీ టాబ్లెట్ 18 ఫోల్డ్‌లో వాడిన అదే Xrign O3 ఇన్-హౌస్ చిప్సెట్తో రానుంది. ఈ చిప్ గ్రాఫిక్స్ పర్ఫార్మెన్స్ కోసం తక్కువ శక్తిని వినియోగిస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ టాబ్లెట్ ఆండ్రాయిడ్ 17 ఆధారిత HyperOS 4పై రన్ అవుతుంది.
ఈ టాబ్లెట్ 10,000mAh బ్యాటరీతో వస్తుంది 67W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 512GB 1TB స్టోరేజ్ వేరియంట్లలో వస్తుందని అంచనా. ఈ టాబ్లెట్ కు సంబంధించి కంపెనీ ఇంకా ఎలాంటి వివరాలను రివీల్ చేయలేదు.
షావోమీ 18 ఫోల్డ్ ఫీచర్లు (అంచనా) :
షావోమీ రాబోయే ఫోల్డబుల్ ఫోన్లో 5.38-అంగుళాల కేస్ 7.58-అంగుళాల ఫ్లెక్సిబుల్ డిస్ప్లే ఉంటాయని అంచనా. బ్యాక్ సైడ్ గూగుల్ పిక్సెల్ మాదిరి కెమెరా మాడ్యూల్ ఉంటుంది. ఈ ఫోల్డబుల్ ఫోన్ డ్రాగన్ బోన్ హింజ్ ఉంటుందని కంపెనీ ప్రోమోలో పేర్కొంది. ఈ ఫోల్డబుల్ స్క్రీన్‌ను ఎన్నిసార్లు ఓపెన్ చేసినా ముడతలు పడవు.
200ఎంపీ మెయిన్ కెమెరా, 50ఎంపీ టెలిఫోటో కెమెరా, సేఫ్టీ కోసం పక్కనే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంటుందని అంచనా. ఈ ఫోన్ చాలా సన్నగా ఉంటుంది. ఇందులో 6000mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీని అమర్చారు. 67W వైర్డ్ 50W వైర్లెస్ ఛార్జింగ్‌కు కూడా సపోర్టు ఇస్తుందని అంచనా.
