Samsung Galaxy M04 Sale : శాంసంగ్ గెలాక్సీ M04 సేల్ మొదలైందోచ్.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు..!

Samsung Galaxy M04 : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ (Samsung) నుంచి లేటెస్ట్ M సిరీస్ స్మార్ట్‌ఫోన్ (Samsung Galaxy M04) డిసెంబర్ 16 నుంచి సేల్‌కు అందుబాటులో ఉంది. ఫేస్ అన్‌లాక్, MediaTek Helio P35 చిప్‌సెట్, HD+ LCD డిస్‌ప్లేతో పాటు RAM, 8GB వరకు పొడిగించవచ్చు.

Samsung Galaxy M04 Sale : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ (Samsung) నుంచి లేటెస్ట్ M సిరీస్ స్మార్ట్‌ఫోన్ (Samsung Galaxy M04) డిసెంబర్ 16 నుంచి సేల్‌కు అందుబాటులో ఉంది. ఫేస్ అన్‌లాక్, MediaTek Helio P35 చిప్‌సెట్, HD+ LCD డిస్‌ప్లేతో పాటు RAM, 8GB వరకు పొడిగించవచ్చు. ఎంట్రీ-లెవల్ స్మార్ట్‌ఫోన్‌గా గత వారమే భారత మార్కెట్లో లాంచ్ అయింది. దీని ప్రారంభ ధర రూ.9499గా ఉండనుంది. రూ. 10వేల లోపు ధరలో మార్కెట్లోకి వచ్చిన ఈ కొత్త M సిరీస్ స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన ఫీచర్లతో దీర్ఘకాలిక సాఫ్ట్‌వేర్ సపోర్టుతో బడ్జెట్ ఫోన్‌ను రిలీజ్ చేసింది.

శాంసంగ్ Galaxy M04 ధర ఎంతంటే? :
శాంసంగ్ (Galaxy M04) భారత మార్కెట్లో రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. బేస్ మోడల్ 4GB RAM, 64GB స్టోరేజ్‌తో రూ. 9499 ధరతో వస్తుంది. రెండవ మోడల్‌లో 4GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ధర రూ. 10499గా ఉండనుంది. శాంసంగ్ కొన్ని లాంచ్ ఆఫర్‌లను కూడా ప్రకటించింది. అన్ని SBI క్రెడిట్, డెబిట్ కార్డ్ లావాదేవీలపై కంపెనీ రూ.1000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ ఫోన్ లేత ఆకుపచ్చ, ముదురు నీలం వంటి రెండు కలర్ ఆప్షన్లలో వస్తుంది. శాంసంగ్ Galaxy M04 అనేక ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో Samsung.com, Amazon.in వంటి ఎంపిక చేసిన రిటైల్ షాపుల్లో డిసెంబర్ 16 నుంచి సేల్‌కు అందుబాటులో ఉంది.

Samsung Galaxy M04 goes on sale in India, priced under Rs 10,000

Read Also : Samsung Galaxy Z Fold 4 Phone : శాంసంగ్ గెలాక్సీ Z Fold 4 ఫోన్‌లో కొత్త ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్.. ఎలా డౌన్‌లోడ్ చేయాలో తెలుసా?

శాంసంగ్ Galaxy M04 ఫీచర్లు ఇవే :
భారత మార్కెట్లో కొత్తగా లాంచ్ అయిన శాంసంగ్ Galaxy M04 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ప్యానెల్ HD+ రిజల్యూషన్‌ను అందిస్తుంది. సెల్ఫీ కెమెరాతో పాటు వాటర్ డ్రాప్-స్టైల్ నాచ్‌ని కలిగి ఉంటుంది. స్మార్ట్‌ఫోన్‌లో ఫ్రంట్ సైడ్ 5-MP కెమెరా కూడా ఉంది. వెనుక ప్యానెల్‌లో 13-MP ప్రైమరీ కెమెరాతో పాటు 2-MP సెకండరీ కెమెరా ఉన్నాయి. హార్డ్‌వేర్ విషయానికొస్తే.. Samsung Galaxy M04, MediaTek Helio P35 ప్రాసెసర్‌తో వచ్చింది. మైక్రో SD కార్డ్ ద్వారా 8GB వరకు పొడిగించుకోవచ్చు. RAM కూడా 128GB ఇంటర్నల్ స్టోరేజీ నుంచి 1TB వరకు పొడిగించవచ్చు.

ఈ డివైజ్ Android 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది. శాంసంగ్ డివైజ్ నాలుగు సంవత్సరాల సెక్యూరిటీ అప్ డేట్స్ అందుకోనుంది. అలాగే రెండు OS అప్‌గ్రేడ్‌లను కూడా పొందనుంది. శాంసంగ్ Galaxy M04 బాక్స్‌లో 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీతో వచ్చింది. కనెక్టివిటీ ఆప్షన్లలో 4G, VoLTE, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్, USB టైప్-C పోర్ట్, GPS ఉన్నాయి. అదనంగా, సెక్యూరిటీ కోసం ఫోన్ సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫేస్ అన్‌లాక్ సపోర్ట్‌ను కలిగి ఉంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Samsung Galaxy S23 Series : శాంసంగ్ గెలాక్సీ S23 ఫ్లాగ్‌షిప్ సిరీస్ వస్తోంది.. 8K వీడియో రికార్డింగ్ సపోర్టు, మరెన్నో ఫీచర్లు..

ట్రెండింగ్ వార్తలు