Samsung Galaxy Z Fold 4 Phone : శాంసంగ్ గెలాక్సీ Z Fold 4 ఫోన్‌లో కొత్త ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్.. ఎలా డౌన్‌లోడ్ చేయాలో తెలుసా?

Samsung Galaxy Z Fold 4 : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ (Samsung) కొన్ని గెలాక్సీ సిరీస్ స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేసింది. డిసెంబర్ 2022 ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్‌ను ప్రవేశపెట్టింది. అమెరికాలో Galaxy Z Fold 4కి సెక్యూరిటీ అప్‌డేట్‌ను రిలీజ్ చేసింది.

Samsung Galaxy Z Fold 4 Phone : శాంసంగ్ గెలాక్సీ Z Fold 4 ఫోన్‌లో కొత్త ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్.. ఎలా డౌన్‌లోడ్ చేయాలో తెలుసా?

Samsung Galaxy Z Fold 4 gets new Android security patch_ How to download

Samsung Galaxy Z Fold 4 Phone : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ (Samsung) కొన్ని గెలాక్సీ సిరీస్ స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేసింది. డిసెంబర్ 2022 ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్‌ను ప్రవేశపెట్టింది. అమెరికాలో Galaxy Z Fold 4కి సెక్యూరిటీ అప్‌డేట్‌ను రిలీజ్ చేసింది. Sammobile నివేదిక ప్రకారం.. Samsung Galaxy Z Fold 4 ఫర్మ్‌వేర్ వెర్షన్ F936U1UEU1BVKBని పొందుతుంది. స్మార్ట్‌ఫోన్ అప్‌డేట్ సైజు దాదాపు 400MB, ప్రస్తుతం అమెరికాలోని AT&T నెట్‌వర్క్‌లో రిలీజ్ అవుతుంది. నివేదిక ప్రకారం.. ఈ లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్ Galaxy డివైజ్‌లలో కనుగొనే 93 సెక్యూరిటీ లోపాలను పరిష్కరిస్తుంది.

అప్‌డేట్ ఎలా డౌన్‌లోడ్ చేయాలో తెలుసా? :
* మీ స్మార్ట్‌ఫోన్‌లో Settings యాప్‌ను ప్రారంభించండి.
* ఇప్పుడు కిందికి స్క్రోల్ చేసి.. సాఫ్ట్‌వేర్ Updatesపై Tap చేయండి.
* చివరగా, Download బటన్ Tap చేయండి. Update ఇన్‌స్టాల్ చేయండి.

Samsung Galaxy Z Fold 4 అనేది One UI 4.1.1 ఆధారిత ఆండ్రాయిడ్ 12Lపై పనిచేసే మొదటి హ్యాండ్‌సెట్. ఆండ్రాయిడ్ ప్రత్యేక వెర్షన్ అని చెప్పవచ్చు. పెద్ద స్క్రీన్ ఎక్స్ పీరియన్స్ Google ద్వారా పొందవచ్చు. డ్యూయల్-సిమ్ (Nano) Samsung Galaxy Z Fold 4 ప్రధాన డిస్‌ప్లేగా 7.6-అంగుళాల డైనమిక్ AMOLED 2X ఇన్ఫినిటీ ఫ్లెక్స్ డిస్‌ప్లేను కలిగి ఉంది.

Samsung Galaxy Z Fold 4 gets new Android security patch_ How to download

Samsung Galaxy Z Fold 4 gets new Android security patch

Read Also :  Samsung Android 13 : శాంసంగ్ గెలాక్సీ ఫోన్లలో ఆండ్రాయిడ్ 13 అప్‌డేట్ రిలీజ్.. ఏయే డివైజ్‌ల్లో వచ్చింది..? ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే?

ఈ డివైజ్ LTPO డిస్‌ప్లేతో వస్తుంది. 1Hz నుంచి 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇస్తుంది. కవర్ డిస్‌ప్లే గురించి మాట్లాడుతూ.. హ్యాండ్‌సెట్ 6.2-అంగుళాల HD+ డైనమిక్ AMOLED 2X డిస్ప్లేను 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌తో కలిగి ఉంది. హుడ్ కింద.. ఈ హ్యాండ్‌సెట్ 12GB RAMతో Qualcomm Snapdragon 8+ Gen 1 SoCని పొందుతుంది.

ఆప్టిక్స్ కోసం.. ఈ శాంసంగ్ స్మార్ట్‌ఫోన్‌లో 5 కెమెరాలు ఉన్నాయి. ఒకటి కవర్ డిస్‌ప్లేలో, ఒకటి మెయిన్ స్క్రీన్‌లో డిస్‌ప్లే కెమెరా కింద, మిగిలిన మూడు బ్యాక్ ప్యానెల్‌లో ఉంటాయి. ట్రిపుల్ వెనుక కెమెరా f/1.8 ఎపర్చరు లెన్స్‌తో 50 MP సెన్సార్, డ్యూయల్-పిక్సెల్ ఆటోఫోకస్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, 85 డిగ్రీల వ్యూ ఫీల్డ్‌తో వచ్చింది.

123 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూతో సహా అల్ట్రా వైడ్ లెన్స్‌తో 12 MP సెకండరీ కెమెరాకు కూడా సపోర్టు అందిస్తుంది. మూడవ లెన్స్ టెలిఫోటో లెన్స్‌తో పాటు 10 MP సెన్సార్ కూడా ఉండనుంద. కనెక్టివిటీ పరంగా.. శాంసంగ్ Galaxy Z Fold 4లో 5G, 4G LTE, WiFi 6E, బ్లూటూత్ v5.2, USB టైప్-C ఛార్జింగ్ ఉన్నాయి. ఈ ఫోన్ 25W ఛార్జర్‌తో 4,400mAh డ్యూయల్ బ్యాటరీతో వచ్చింది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Samsung Galaxy M04 : రూ. 10వేల లోపు ధరలో శాంసంగ్ గెలాక్సీ M04 ఫోన్ వచ్చేసింది.. ఫీచర్లు అదుర్స్.. మరెన్నో బెనిఫిట్స్..!