Samsung Galaxy M04 : రూ. 10వేల లోపు ధరలో శాంసంగ్ గెలాక్సీ M04 ఫోన్ వచ్చేసింది.. ఫీచర్లు అదుర్స్.. మరెన్నో బెనిఫిట్స్..!

Samsung Galaxy M04 : సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ (Samsung) నుంచి ఎంట్రీ-లెవల్ శాంసంగ్ గెలాక్సీ M04 (Samsung Galaxy M04) కొత్త మోడల్ ఫోన్ భారత మార్కెట్లో లాంచ్ అయింది. రూ. 10,000 లోపు ధరలో ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉంది.

Samsung Galaxy M04 : రూ. 10వేల లోపు ధరలో శాంసంగ్ గెలాక్సీ M04 ఫోన్ వచ్చేసింది.. ఫీచర్లు అదుర్స్.. మరెన్నో బెనిఫిట్స్..!

Samsung Galaxy M04 launched in India with long term software support

Samsung Galaxy M04 : సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ (Samsung) నుంచి ఎంట్రీ-లెవల్ శాంసంగ్ గెలాక్సీ M04 (Samsung Galaxy M04) కొత్త మోడల్ ఫోన్ భారత మార్కెట్లో లాంచ్ అయింది. రూ. 10,000 లోపు ధరలో ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉంది. దేశంలో రూ.8వేల రేంజ్‌లో ప్రారంభ ధరతో అదిరే ఫీచర్లు, దీర్ఘకాలిక సాఫ్ట్‌వేర్ సపోర్టుతో వచ్చింది. ఈ కొత్త Galaxy M04 స్మార్ట్‌ఫోన్ లేటెస్ట్ ఆఫర్‌తో రిలీజ్ అయింది. శాంసంగ్ రెండు ఏళ్ల మేజర్ ఆండ్రాయిడ్ అప్‌గ్రేడ్‌లను అందజేయనున్నట్టు ప్రకటించింది.

దీర్ఘకాలిక సాఫ్ట్‌వేర్ సపోర్టు ద్వారా ఎక్కువ మంది కస్టమర్‌లను ఆకర్షించనుంది. ఇదే తరహాలో శాంసంగ్ ప్రీమియం ఫోన్లపై కూడా ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. తక్కువ ధర పరిధిలో రెండు ఏళ్ల వరకు Android అప్‌డేట్‌లను అందిస్తానని కంపెనీ హామీ ఇస్తోంది. కొత్త శాంసంగ్ ఫోన్ ఆండ్రాయిడ్ 12OSతో రన్ అవుతుంది. రెండేళ్ల ఆండ్రాయిడ్ సపోర్ట్ ద్వారా ఆండ్రాయిడ్ 14OSకి చేరుకోనుంది. గెలాక్సీ M04 భారీ బ్యాటరీతో పాటు 90Hz వద్ద రిఫ్రెష్ చేసే డిస్‌ప్లేను కలిగి ఉంది. ప్యానెల్ HD+ రిజల్యూషన్‌లో వస్తుంది. వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్డ్ డిజైన్‌ను కలిగి ఉంది.

Samsung Galaxy M04 launched in India with long term software support

Samsung Galaxy M04 launched in India with long term software support

Read Also : iPhone 14 Cheap Price : అత్యంత చౌకైన ధరకే ఆపిల్ ఐఫోన్ 14 సొంతం చేసుకోండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ధరలను ఎలా ట్రాక్ చేయాలో తెలుసా?

ఎంట్రీ-లెవల్ ఫోన్ కావడంతో స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో కెమెరా మాడ్యూల్ అందించలేదు. Samsung Galaxy S22 Ultra మోడల్ మాదిరిగానే శాంసంగ్ సెన్సార్‌లను వెనుక ప్యానెల్‌లో ఉంచింది. MediaTek Helio P35 చిప్‌సెట్‌తో ఆధారితమైనది. 4GB RAM, 128GB స్టోరేజ్‌తో రానుంది. మైక్రో SD కార్డ్ ద్వారా ఇంటర్నల్ స్టోరేజీని పెంచుకునే అవకాశాన్ని అందిస్తోంది. కొత్త శాంసంగ్ ఫోన్‌లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. ఆప్టిక్స్ పరంగా, 13-MP ప్రైమరీ సెన్సార్, 2-MP కెమెరాతో సహా డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఫ్రంట్ సైడ్ Galaxy M04 5-MP సెన్సార్‌తో వచ్చింది. హుడ్ కింద.. సాధారణ 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. కంపెనీ 15W ఛార్జింగ్‌కు సపోర్టును అందించింది.

ఈ ఛార్జర్ బ్యాటరీని టాప్ అప్ అందించడానికి కొంచెం ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. అతి తక్కువ ధర విభాగంలో కంపెనీ ఫాస్ట్ ఛార్జర్‌ను అందించదని గమనించాలి. భారత మార్కెట్లో శాంసంగ్ Galaxy M04 (4GB RAM, 64GB స్టోరేజ్ మోడల్) ధర రూ. 8,499గా ఉంది. ఎంట్రీ-లెవల్ స్మార్ట్‌ఫోన్ డిసెంబర్ 16న సేల్ ప్రారంభం కానుంది. ఈ హ్యాండ్‌సెట్ మింట్ గ్రీన్, గోల్డ్ వైట్, బ్లూతో సహా నాలుగు రంగులలో సేల్ అందుబాటులో ఉంటుంది. ఆసక్తిగల కొనుగోలుదారులు అమెజాన్ ద్వారా ఈ ఫోన్ సొంతం చేసుకోవచ్చు.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Samsung Galaxy M04 : డిసెంబర్ 9న శాంసంగ్ గెలాక్సీ M04 4G స్మార్ట్‌ఫోన్ వస్తోంది.. ధర ఎంత, ఏయే ఫీచర్లు ఉండొచ్చు.. అమెజాన్ రివీల్ చేసిందిగా..!