Samsung Galaxy S23 tipped to launch with small battery, Snapdragon 8 Gen 2 SoC, and more
Samsung Galaxy S23 : శాంసంగ్ గెలాక్సీ S సిరీస్‌లో మరో కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ ఫోన్ వస్తోంది. అయితే ఈ సిరీస్ ఫోన్ లాంచ్ కాకుండానే ఫీచర్లు లీక్ అయ్యాయి. పెద్ద బ్యాటరీతో గెలాక్సీ S23ని రావడం లేదని ఓ నివేదిక వెల్లడించింది. Galaxy S22 3,700mAh బ్యాటరీ యూనిట్‌ను కలిగి ఉంది. చూడటానికి ఈ బ్యాటరీ చాలా చిన్నదిగా ఉంటుంది. బ్యాటరీ భారీ వినియోగంతో తొందరగా పూర్తి అయిపోతుంది. యూజర్లను చాలా నిరాశను కలిగించవచ్చు. లేటెస్ట్ మోడల్‌తో చిన్నపాటి మార్పులు చేయాలని కంపెనీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
టిప్‌స్టర్ యోగేష్ బ్రార్ వివరాల ప్రకారం.. Samsung Galaxy S23 3,900mAh బ్యాటరీతో వస్తుంది. అంతేకాదు.. 3,700mAh బ్యాటరీ కన్నా కొంచెం అప్‌గ్రేడ్ అయింది. కంపెనీ 25W ఫాస్ట్ ఛార్జింగ్, 10W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టు అందిస్తుందని తేలింది. గత ఏడాదిలో మోడల్‌కు సమానంగా ఉంటుంది. శాంసంగ్ గెలాక్సీ S23 ఛార్జర్‌తో వస్తుందని చెప్పలేం. శాంసంగ్ చాలా డివైజ్‌లకు ఛార్జర్ అందించడం ఆపివేసింది. శాంసంగ్ వినియోగదారులు ఛార్జర్‌పై అదనపు ఖర్చు చేయవలసి వస్తుంది. ఇతర స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. Samsung Galaxy S23 Qualcomm స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 చిప్‌సెట్ ద్వారా శక్తిని అందిస్తుంది. ఈ డివైజ్ కొన్ని ప్రాంతాలలో కంపెనీ ఇంటర్నల్ Exynos 2300 SoCని ప్యాక్ చేసే అవకాశాలు ఉన్నాయి.
Samsung Galaxy S23 tipped to launch with small battery, Snapdragon 8 Gen 2 SoC, and more
Full HD+ రిజల్యూషన్‌తో పనిచేసే 6.1-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుందని చెప్పవచ్చు. ప్యానెల్ 120Hz వద్ద రిఫ్రెష్ అవుతుంది. సాధారణ పంచ్-హోల్ డిస్ప్లే డిజైన్‌ను కలిగి ఉంటుంది. కెమెరా డిపార్ట్‌మెంట్ పెద్దగా అప్‌గ్రేడ్ చేసినట్టు లీక్‌లు సూచిస్తున్నాయి. OISకి సపోర్టుతో 50-MP ప్రైమరీ సెన్సార్‌తో సహా అదే ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను అందిస్తుంది.
12-MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా, 10-MP టెలిఫోటో సెన్సార్ ద్వారా సపోర్టు అందిస్తుంది. సెల్ఫీల కోసం.. ముందు భాగంలో అదే 10-MP కెమెరాను చూడవచ్చు. ధరలపై ఎటువంటి వివరాలు అందుబాటులో లేవు. కానీ, ఈ డివైజ్ ప్రీమియం ధరలకు అందుబాటులో ఉంటుందని చెప్పవచ్చు. Samsung Galaxy S22 సిరీస్ ఈ ఏడాది ఫిబ్రవరిలో 8GB RAM + 128GB స్టోరేజ్ మోడల్‌కు రూ.72,999 ప్రారంభ ధరతో అందుబాటులోకి వచ్చింది.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..
Read Also : Samsung Galaxy S22 5G : అమెజాన్ దీపావళి సేల్‌లో శాంసంగ్ గెలాక్సీ 5G ఫోన్.. రూ. 25వేలు ఫ్లాట్ డిస్కౌంట్..!