శాంసంగ్ గెలాక్సీ S24 FE స్మార్ట్‌ఫోన్‌పై అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2025లో మంచి ఆఫర్ అందుబాటులో ఉంది. గెలాక్సీ S24 FE ఫోన్ శాంసంగ్ “ఫ్యాన్ ఎడిషన్” మోడల్. అంటే, ఖరీదైన ఫోన్లలో ఉండే కొన్ని టాప్ ఫీచర్లను కొంచెం తక్కువ ధరకే అందిస్తుంది.
అమెజాన్‌లో ఉన్న ఆఫర్‌లో భాగంగా ఈ స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు రూ.34,999కే లభిస్తోంది. అంటే 25 వేల డిస్కౌంట్ అందుబాటులో ఉంది. గెలాక్సీ S24 FE నే ఎందుకు కొనాలి? టాప్ ఫీచర్లు ఏమేం ఉన్నాయి? అన్న వివరాలు తెలుసుకుందాం..
డిస్‌ప్లే
6.7 అంగుళాల పెద్ద AMOLED స్క్రీన్
120Hz రిఫ్రెష్ రేట్ – వాడటానికి చాలా స్మూత్‌గా ఉంటుంది (సినిమాలు, గేమ్స్, సోషల్ మీడియా వాడటానికి భలేగా ఉంటుంది)
ఫ్లాట్ స్క్రీన్ – చాలా మందికి కర్వ్డ్ స్క్రీన్ కన్నా ఇదే నచ్చుతుంది. గీతలు పడే అవకాశం తక్కువ, వాడటం కూడా సులభం
మంచి పర్ఫార్మన్స్
భారత్‌లో ఈ ఫోన్ శాంసంగ్ Exynos 2400 ప్రాసెసర్‌తో ఉంది
గేమింగ్, మల్టీటాస్కింగ్ (ఒకేసారి ఎక్కువ యాప్స్ వాడటం) వంటి వాటికి ఇది చాలా బాగా పనిచేస్తుంది.
8GB RAM, 128GB లేదా 256GB స్టోరేజ్ ఆప్షన్లు ఉన్నాయి. స్టోరేజ్ గురించి పెద్దగా చింతించాల్సిన అవసరం లేదు.
Also Read: వారెవ్వా.. శాంసంగ్ గెలాక్సీ A55 5G, గెలాక్సీ M06 5Gపై ఎన్నడూలేనంత డిస్కౌంట్
సూపర్ కెమెరాలు
వెనుకవైపు మూడు కెమెరాలు: 50MP (ప్రధాన) + 12MP (అల్ట్రావైడ్) + 8MP (టెలిఫొటో)
టెలిఫోటో లెన్స్: ఈ ధరలో ఇది దొరకడం చాలా అరుదు. దీనివల్ల జూమ్ చేసినప్పుడు కూడా ఫొటో క్వాలిటీ పెద్దగా తగ్గదు
ముందువైపు 10MP సెల్ఫీ కెమెరా – తక్కువ వెలుతురులో కూడా మంచి ఫొటోలు తీస్తుంది
బ్యాటరీ, ఛార్జింగ్
4,500mAh బ్యాటరీ – సాధారణంగా ఒక రోజంతా ఛార్జింగ్ వస్తుంది
25W ఫాస్ట్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది
రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్: మీ ఇయర్‌బడ్స్ లాంటి చిన్న డివైస్‌లను ఈ ఫోన్‌తో ఛార్జ్ చేయవచ్చు
సాఫ్ట్‌వేర్, AI ఫీచర్లు
ఖరీదైన Galaxy S24 సిరీస్‌లో ఉన్న గెలాక్సీ AI (Galaxy AI) ఫీచర్లు ఇందులో కూడా ఉన్నాయి (ఉదా: Circle to Search, Live Translate, AI ఫోటో ఎడిటింగ్)
7 సంవత్సరాల అప్‌డేట్స్: శాంసంగ్ ఈ ఫోన్‌కు ఏకంగా 7 ఏళ్ల పాటు సాఫ్ట్‌వేర్, సెక్యూరిటీ అప్‌డేట్స్ ఇస్తామని హామీ ఇచ్చింది. అంటే, ఫోన్ చాలా కాలం పాటు కొత్తగా, సురక్షితంగా ఉంటుంది. కనీసం 5 ఏళ్ల వరకు ఎటువంటి ఇబ్బంది ఉండదు.
ఇవి కూడా తెలుసుకోవాలి..
ఫింగర్‌ప్రింట్ స్కానర్ కొంచెం నెమ్మదిగా పనిచేస్తుందని అనిపించవచ్చు (ఇది ఆప్టికల్ స్కానర్, ఖరీదైన S24 లోని అల్ట్రాసోనిక్ కన్నా కొంచెం స్లో)
128GB స్టోరేజ్ కొంతమందికి సరిపోకపోవచ్చు (ఎక్కువ ఫొటోలు, వీడియోలు స్టోర్ చేసేవారికి). అయితే, ఫోన్ అందించే ఫీచర్లతో పోలిస్తే ఇవి చాలా చిన్న విషయాలు.
మీరు ఒక మంచి ఫోన్ కోసం, అదే సమయంలో మంచి డిస్కౌంట్ కోసం ఎదురు చూస్తుంటే, రూ.34,999 ధరలో Samsung Galaxy S24 FE కొనవచ్చు. మంచి ప్రీమియం ఫీచర్లు, సూపర్ కెమెరా (టెలిఫొటోతో), చాలా కాలం పాటు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్, మంచి బ్యాటరీ లైఫ్ ఉన్నాయి. ఈ డీల్‌ను మిస్ చేసుకోకండి.