Samsung Galaxy S24 FE With Exynos 2400e SoC, Galaxy AI Features Launched in India
Samsung Galaxy S24 FE Launch : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? భారత మార్కెట్లోకి కొత్త శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ఎఫ్ఈ ఫోన్ వచ్చేసింది. అయితే, సౌత్ కొరియన్ దిగ్గజం ఈ ఫోన్ సేల్ తేదీని ప్రకటించింది. కానీ, దేశంలో ధరను ఇంకా వెల్లడించలేదు. ఈ ఫోన్ వనిల్లా గెలాక్సీ ఎస్24 మోడల్‌కు సమానమైన డిజైన్‌ను కలిగి ఉంది. ఎక్సినోస్ 2400ఇ చిప్‌సెట్‌తో వస్తుంది. 4,700mAh బ్యాటరీని కలిగి ఉంది. 50ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్, 10ఎంపీ సెల్ఫీ షూటర్‌తో వస్తుంది. సర్కిల్ టు సెర్చ్, లైవ్ ట్రాన్స్‌లేట్ వంటి గెలాక్సీ ఏఐ ఫీచర్లకు ఫోన్ సపోర్ట్‌తో వస్తుంది.
Read Also : OnePlus 12 Price Drop : కొత్త ఫోన్ కొంటున్నారా? వన్‌ప్లస్ 12 ధర తగ్గిందోచ్.. ఈ డీల్ ఎలా పొందాలంటే?
శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ఎఫ్ఈ :
శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ఎఫ్ఈ అక్టోబర్ 3 నుంచి భారత మార్కెట్లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ 8జీబీ ర్యామ్ 3 స్టోరేజ్ ఆప్షన్‌లతో వస్తుంది. 128జీబీ, 256జీబీ, 512జీబీ వేరియంట్లలో అందుబాటులో ఉంది. బ్లూ, గ్రాఫైట్, గ్రే, మింట్, ఎల్లో కలర్ ఆప్షన్లలో పొందవచ్చు. భారత మార్కెట్లో గెలాక్సీ ఎస్24 ఎఫ్ఈ ధరను కంపెనీ ఇంకా ధృవీకరించనప్పటికీ, ఈయూలో ధర వరుసగా 128జీబీ, 256జీబీ ఆప్షన్ల కోసం ఈయూఆర్ 749 (దాదాపు రూ. 70వేలు), ఈయూఆర్ 809 (దాదాపు రూ. 75,600) వరకు ఉంటుంది.
శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ఎఫ్ఈ స్పెసిఫికేషన్‌లు :
డ్యూయల్ (నానో) సిమ్-సపోర్టు ఉన్న శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ఎఫ్ఈ ఆండ్రాయిడ్ 14-ఆధారిత వన్ యూఐ 6.1తో వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల ఫుల్-హెచ్‌డీ+ (1,080 x 2,340 పిక్సెల్‌లు) డైనమిక్ అమోల్డ్ 2ఎక్స్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఫోన్ 4ఎన్ఎమ్ డెకా-కోర్ ఎక్సినోస్ 2400ఇ ఎస్ఈసీ ద్వారా 8జీబీ ర్యామ్, 512జీబీ వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజీతో వస్తుంది.
కెమెరా విషయానికి వస్తే.. :
శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ఎఫ్ఈ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో కూడిన 50ఎంపీ ప్రైమరీ సెన్సార్‌తో సహా ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌తో వస్తుంది. ఓఐఎస్‌తో 3ఎక్స్ ఆప్టికల్ జూమ్‌తో 8ఎంపీ టెలిఫోటో షూటర్, అల్ట్రా-వైడ్ లెన్స్‌తో 12ఎంపీ సెన్సార్‌తో ఉంటుంది. సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 10ఎంపీ సెన్సార్ ఉంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ఎఫ్ఈ గెలాక్సీ ఎస్24 సిరీస్ ఫోన్‌లలో చూసిన గెలాక్సీ ఏఐ ఫీచర్లకు సపోర్ట్‌తో వస్తుంది. వీటిలో గూగుల్ సపోర్టు ఇచ్చే సర్కిల్ టు సెర్చ్, లైవ్ ట్రాన్స్‌లేట్, నోట్ అసిస్ట్, ఇంటర్‌ప్రెటర్ మోడ్, కంపోజర్ ఉన్నాయి.
మీరు 25డబ్ల్యూ వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్టుతో గెలాక్సీ ఎస్24 ఎఫ్ఈలో 4,700mAh బ్యాటరీని పొందవచ్చు. కనెక్టివిటీ ఆప్షన్లలో 5జీ, ఎల్‌టీఈ, వై-ఫై 6ఈ, బ్లూటూత్ 5.3, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఈ ఫోన్ దుమ్ము, స్ప్లాష్ నిరోధకతకు ఐపీ68-రేటెడ్ బిల్డ్‌ను కలిగి ఉంది. సెక్యూరిటీ విషయానికి వస్తే.. ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, శాంసంగ్ నాక్స్ వాల్ట్‌తో వస్తుంది. 162.0 x 77.3 x 8.0ఎమ్ఎమ్ సైజు, 213 గ్రాముల బరువు ఉంటుంది.