OnePlus 12 Price Drop : కొత్త ఫోన్ కొంటున్నారా? వన్‌ప్లస్ 12 ధర తగ్గిందోచ్.. ఈ డీల్ ఎలా పొందాలంటే?
OnePlus 12 Price Drop : అమెజాన్, విజయ్ సేల్స్‌లో వన్‌ప్లస్ 12పై భారీ తగ్గింపు ఆఫర్ అందిస్తుంది. ప్రస్తుతం విజయ్ సేల్స్‌లో వన్‌ప్లస్ 12 రూ. 62,999 ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది.

OnePlus 12 price drops, gets massive discount offer on Amazon and Vijay Sales
OnePlus 12 Price Drop : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే, ఇదే సరైన సమయం. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ మొదలైంది.. అనేక పాపులర్ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. అందులో ఒకటి వన్‌ప్లస్ 12 ఫోన్ ధర భారీగా తగ్గింది. గత ఏడాది దీపావళి సేల్‌లో కూడా అమెజాన్ బెస్ట్ డీల్‌ను అందించింది. అదేవిధంగా, విజయ్ సేల్స్ 2024లో కూడా వన్‌ప్లస్ ఫ్లాగ్షిప్ ఫోన్‌పై ఆకర్షణీయమైన తగ్గింపు ఆఫర్‌ను అందిస్తోంది. లేటెస్ట్ వన్‌ప్లస్ 12 డీల్ గురించి మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
అమెజాన్, విజయ్ సేల్స్‌లో వన్‌ప్లస్ 12పై భారీ తగ్గింపు ఆఫర్ అందిస్తుంది. ప్రస్తుతం విజయ్ సేల్స్‌లో వన్‌ప్లస్ 12 రూ. 62,999 ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. అసలు ప్రారంభ ధర రూ. 64,999 నుంచి తగ్గింది. వినియోగదారులకు రూ.2వేల తగ్గింపు లభిస్తోంది. దీనికి అదనంగా, విజయ్ సేల్స్ ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై రూ. 7వేల ఇన్స్టంట్ డిస్కౌంట్ కూడా అందిస్తోంది. ఈ వన్‌ప్లస్ ఫోన్ ధర రూ.55,999కి తగ్గుతుంది.
అమెజాన్‌లో వన్‌ప్లస్ 12 అసలు ధర రూ. 64,999 వద్ద జాబితా అయింది. కానీ, రూ.2వేల కూపన్ కూడా అందిస్తుంది. దీని ధర రూ.62,999కి తగ్గుతుంది. అమెజాన్‌లో వన్‌ప్లస్ 12 లిస్టింగ్‌లో కనిపించే కూపన్ బాక్స్‌ను టిక్ చేయాలి. తగ్గిన మొత్తం చెక్అవుట్ పేజీలో కనిపిస్తుంది. అదనంగా, ఎస్బీఐ క్రెడిట్ కార్డ్‌పై రూ. 5,750 ఇన్స్టంట్ డిస్కౌంట్ కూడా అందిస్తుంది. తద్వారా ఈ ఫోన్ ధర రూ. 57,249కి తగ్గుతుంది.
విజయ్ సేల్స్‌లో వన్‌ప్లస్ 12 స్మార్ట్‌ఫోన్‌పై మెరుగైన డీల్‌ను అందిస్తోంది. ఇదే డీల్ విజయ్ సేల్స్ ఆఫ్‌లైన్ స్టోర్లలో కూడా అందుబాటులో ఉందో లేదో ప్రస్తుతానికి తెలియదు. ఈ వన్‌ప్లస్ ఫోన్‌పై మరిన్ని తగ్గింపులను పొందడానికి వినియోగదారులు ఎక్స్ఛేంజ్ డీల్‌లను కూడా పొందవచ్చు. దాంతో పాటు, అమెజాన్ కూడా రూ. 7,999 విలువైన వన్‌ప్లస్ బడ్స్ ప్రో 2 ఉచితంగా అందజేస్తుంది. ఎందుకంటే వినియోగదారులు చాలా తక్కువ ధరకు వన్‌ప్లస్ 12ని కొనుగోలు చేయగలరు. వన్‌ప్లస్ ఇయర్‌బడ్‌ల సెట్‌ను ఉచితంగా పొందవచ్చు.