Samsung Galaxy S24 Series : శాంసంగ్ గెలాక్సీ S24 సిరీస్ రెండర్లు, ఫుల్ ఫీచర్లు లీక్.. ఇంతకీ ఈ మూడు ఫోన్ల లాంచ్ డేట్ ఎప్పుడంటే?

Samsung Galaxy S24 Series : శాంసంగ్ గెలాక్సీ S24 సిరీస్ ఫోన్ అతి త్వరలో గ్లోబల్ మార్కెట్లో లాంచ్ కానుంది. అంతకంటే ముందుగానే గెలాక్సీ ఎస్24 పూర్తి స్పెషిఫికేషన్లు, రెండర్లు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి.

Samsung Galaxy S24 Series Renders, Full Specifications Leak

Samsung Galaxy S24 Series : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ వచ్చే ఏడాది ప్రారంభంలో గెలాక్సీ ఎస్ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. లీకుల ప్రకారం.. జనవరి 17న ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ సిరీస్ లాంచ్ చేయనుంది. అయితే, అంతకంటే ముందుగానే శాంసంగ్ S24 సిరీస్ ఫోన్‌కు సంబంధించి వరుస లీక్‌లు వెలుగులోకి వచ్చాయి. ఇటీవలే గెలాక్సీ ఎస్24, గెలాక్సీ ఎస్24 ప్లస్, గెలాక్సీ ఎస్24 అల్ట్రా రెండర్‌లు పూర్తి స్పెసిఫికేషన్‌లతో పాటు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. లీక్ డేటా ప్రకారం.. శాంసంగ్ గెలాక్సీ ఎస్24 పస్ల్, గెలాక్సీ ఎస్24 అల్ట్రా రెండూ 12జీబీ ర్యామ్‌తో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ఎస్ఓసీపై రన్ అవుతాయి. గెలాక్సీ ఎస్24 సిరీస్‌లో ఎక్సోనోస్ 2400 చిప్‌సెట్ ద్వారా పవర్ అందిస్తుంది. గెలాక్సీ ఎస్24 అల్ట్రా టైటానియం ఫ్రేమ్‌ను కలిగి ఉంటుందని, వెనిలా, ప్లస్ మోడల్‌లు అల్యూమినియం ఆర్మర్ ఫ్రేమ్‌ను కలిగి ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

Read Also : Mahindra Scorpio Sales : నవంబర్ అమ్మకాల్లో దూసుకెళ్లిన మహీంద్రా స్కార్పియో.. రెండు నెలల్లోనే హ్యుందాయ్ క్రెటాను దాటేసింది!

నివేదిక ప్రకారం.. రాబోయే గెలాక్సీ ఎస్24, గెలాక్సీ ఎస్24 ప్లస్, గెలాక్సీ ఎస్24 అల్ట్రా రెండర్‌లు, పూర్తి స్పెసిఫికేషన్‌లను లీక్ చేసింది. లీకైన రెండర్‌లు గెలాక్సీ ఎస్24 సిరీస్ కలర్ ఆప్షన్లను కూడా సూచిస్తున్నాయి. ఈ హ్యాండ్‌సెట్‌లు బ్లాక్, గ్రే, వైలెట్, ఎల్లో షేడ్స్‌లో హోల్ పంచ్ డిస్‌ప్లే డిజైన్, మినిమల్ బెజెల్స్‌తో కనిపిస్తాయి. గెలాక్సీ ఎస్24 అల్ట్రా ఫ్లాట్ బ్యాక్ ప్యానెల్, ఇంటిగ్రేటెడ్ ఎస్ పెన్‌తో ఫ్లాట్ డిస్‌ప్లేతో కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ క్వాడ్ కెమెరా సెటప్‌ను కలిగి ఉన్నట్లు కనిపిస్తుంది. నాలుగు కెమెరాలు వేర్వేరు కలర్ ఆప్షన్లలో ఉండనున్నాయి. గెలాక్సీ ఎస్24, గెలాక్సీ ఎస్24 ప్లస్ ట్రిపుల్ రియర్ కెమెరాలతో రానున్నాయి. గెలాక్సీ ఎస్24 అల్ట్రా మోడల్ టైటానియం బ్లాక్, టైటానియం గ్రే, టైటానియం వైలెట్, టైటానియం ఎల్లో కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉండనుంది. అయితే, గెలాక్సీ ఎస్24, గెలాక్సీ ఎస్24 ప్లస్ మోడల్స్ ఒనిక్స్ బ్లాక్, మార్బుల్ గ్రే, కోబాల్ట్ వైలెట్, అంబర్ ఎల్లో అనే కలర్ వెర్షన్‌లను కలిగి ఉండవచ్చు.

Samsung Galaxy S24 Series Renders

శాంసంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రా స్పెషిఫికేషన్లు లీక్ :
నివేదిక ప్రకారం.. గెలాక్సీ ఎస్24 అల్ట్రా మోడల్ 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.8-అంగుళాల క్యూహెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. టైటానియం ఫ్రేమ్‌ను ఉపయోగిస్తుంది. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ఎస్ఓసీతో పాటు 12జీబీ ర్యామ్, 256జీబీ, 512జీబీ లేదా 1టీబీ స్టోరేజ్ ఆప్షన్‌లతో రన్ అవుతుంది. ఆప్టిక్స్ విషయానికి వస్తే.. ఈ హ్యాండ్‌సెట్ 200ఎంపీ వైడ్-యాంగిల్ కెమెరా, 12ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 5ఎక్స్ ఆప్టికల్ జూమ్‌తో కూడిన 50ఎంపీ టెలిఫోటో కెమెరా, 10తో కూడిన క్వాడ్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉండనుంది. 3ఎక్స్ ఆప్టికల్ జూమ్‌తో టెలిఫోటో సెన్సార్, ఇందులో 12ఎంపీ సెల్ఫీ షూటర్ ఉండవచ్చు. గెలాక్సీ ఎస్24 అల్ట్రా 5,000ఎంఎహెచ్ బ్యాటరీతో సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ 2.0, ఫాస్ట్ వైర్‌లెస్ ఛార్జింగ్ 2.0కి సపోర్టు అందిస్తుంది. వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్న ఇతర డివైజ్‌లకు ఛార్జ్ చేసేందుకు ఇది వైర్‌లెస్ పవర్‌షేర్‌తో రానుంది. ఈ హ్యాండ్‌సెట్ బ్లూటూత్ 5.3, వై-ఫై 7, అల్ట్రా వైడ్ బ్యాండ్ కనెక్టివిటీని అందించగలదు.

Samsung Galaxy S24 Series Renders, Full Specifications Leak

శాంసంగ్ గెలాక్సీ ఎస్24, గెలాక్సీ ఎస్24 ప్లస్ స్పెషిఫికేషన్లు లీక్ :
గెలాక్సీ ఎస్24 మోడల్ 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.2-అంగుళాల పూర్తి-హెచ్‌డీ ప్లస్ స్క్రీన్‌తో వస్తుంది. అయితే, గెలాక్సీ ఎస్24 ప్లస్ 120హెచ్‌జెడ్ స్క్రీన్‌తో 6.7-అంగుళాల క్యూహెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేను అందిస్తుంది. సాధారణ మోడల్ 8జీబీ ర్యామ్‌తో ఎక్సోనోస్ 2400 ఎస్ఓసీతో రన్ అవుతుందని భావిస్తున్నారు. అయితే, గెలాక్సీ ఎస్24 ప్లస్ 12జీబీ ర్యామ్‌తో పాటు స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ఎస్ఓసీని ప్యాక్ చేయగలదు. సాధారణ మోడల్ 128జీబీ, 256జీబీ, 512జీబీ స్టోరేజ్ ఆప్షన్‌లలో ఉండనుంది. అయితే, ప్లస్ మోడల్‌ను 256జీబీ, 512జీబీ స్టోరేజ్ స్టోరేజ్ వేరియంట్‌లలో అందించవచ్చు.

నివేదిక ప్రకారం.. రెండు హ్యాండ్‌సెట్‌లు ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటాయి. ఇందులో 50ఎంపీ ప్రైమరీ వైడ్ యాంగిల్ సెన్సార్, 10ఎంపీ టెలిఫోటో సెన్సార్, 12ఎంపీ అల్ట్రా-వైడ్ కెమెరా ఉంటాయి. సెల్ఫీల విషయానికి వస్తే.. 12ఎంపీ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉండే అవకాశం ఉంది. వనిల్లా గెలాక్సీ ఎస్24 సూపర్-ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,000ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉండవచ్చు. అయితే, గెలాక్సీ ఎస్24 ప్లస్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ 2.0 సపోర్ట్‌తో 4,900ఎంఎహెచ్ బ్యాటరీతో సపోర్టు ఇస్తుంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్24 సిరీస్‌లో ఏఐ ఆధారిత టెక్నాలజీని ఉపయోగించాలని భావిస్తున్నారు. డజనుకు పైగా భాషలకు సపోర్టుతో రియల్ టైమ్ మెసేజ్‌లను అనువదించే సామర్థ్యాన్ని కలిగి ఉండవచ్చు. ఏఐ ఫొటోలను ఎడిట్ చేయడంలో సెర్చ్ చేయడంలో కూడా సాయపడుతుంది.

Read Also : Best Phones in India : డిసెంబర్ 2023లో రూ. 25వేల లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి!

ట్రెండింగ్ వార్తలు