Mahindra Scorpio Sales : నవంబర్ అమ్మకాల్లో దూసుకెళ్లిన మహీంద్రా స్కార్పియో.. రెండు నెలల్లోనే హ్యుందాయ్ క్రెటాను దాటేసింది!

Mahindra Scorpio Sales : నవంబర్‌లో మహీంద్రా మోడల్ స్కార్పియో రికార్డు స్థాయిలో అమ్మకాలను నమోదు చేసింది. మూడు వరుసల సీట్ల మహీంద్రా స్కార్పియో రెండు-వరుసల హ్యుందాయ్ క్రెటా అమ్మకాలను అధిగమించింది.

Mahindra Scorpio Sales : నవంబర్ అమ్మకాల్లో దూసుకెళ్లిన మహీంద్రా స్కార్పియో.. రెండు నెలల్లోనే హ్యుందాయ్ క్రెటాను దాటేసింది!

Mahindra Scorpio beats Hyundai Creta in November sales

Mahindra Scorpio Sales : ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రాకు చెందిన మహీంద్రా స్కార్పియో అమ్మకాల్లో రికార్డు స్థాయిలో దూసుకుపోయింది. నవంబర్‌లో వాల్యూమ్ పరంగా హ్యుందాయ్ క్రెటాను అధిగమించింది. మూడు వరుస సీట్లతో మహీంద్రా స్కార్పియో వాల్యూమ్ అత్యధిక స్థాయిలో పెరిగింది.

హ్యుందాయ్ క్రెటా కన్నా అధికంగా ఉండటం వరుసగా రెండునెలల్లో ఇది రెండోసారి. అయితే, గత నవంబర్‌లో, హ్యుందాయ్ క్రెటా 11,814 యూనిట్లతో పోలిస్తే.. మహీంద్రా 12,185 యూనిట్ల స్కార్పియో (ఎన్ క్లాసిక్‌తో సహా) విక్రయించింది. నవంబర్ 2023లో మహీంద్రా ప్యాసింజర్ వెహికల్ అమ్మకాలు 39,981 యూనిట్లుగా నమోదయ్యాయి. 2022 నవంబర్ విక్రయాలు 30,392 యూనిట్ల కన్నా 32 శాతం వృద్ధిని సాధించింది.

Read Also : Maruti Suzuki Swift 2024 : కొత్త మారుతి సుజుకి స్విఫ్ట్ 2024 భారత్‌కు వచ్చేస్తోంది.. ఫొటోలు చూశారా?

క్రెటా కన్నా స్కార్పియో యూనిట్లు అత్యధికం :
గత అక్టోబర్‌ వాల్యూమ్ స్కార్పియోకి 13,578 యూనిట్లు ఉండగా, క్రెటాకి 13,077 యూనిట్లుగా నమోదైంది. మారుతి సుజుకి బ్రెజ్జా, టాటా నెక్సాన్ వంటి సైజులో చిన్న ఎస్‌యూవీ మోడల్‌లు మాత్రమే నెలవారీ ప్రాతిపదికన హ్యుందాయ్ క్రెటా కన్నా ఎక్కువ వాల్యూమ్‌ను పొందాయి. ఈ మోడల్స్ హ్యుందాయ్ క్రెటా కన్నా కూడా చాలా చౌకగానే ఉన్నాయని చెప్పవచ్చు. మూడు-వరుసల సీట్ల మహీంద్రా స్కార్పియో రెండు-వరుసల సీట్ల హ్యుందాయ్ క్రెటాతో పోల్చినప్పుడు పెద్దది మాత్రమే కాదు.. చాలా ఖరీదైనది.

భారత్‌కు హ్యుందాయ్ క్రెటా 2024 మోడల్ :
హ్యుందాయ్ క్రెటా ధర రూ. 10.87 లక్షల నుంచి రూ. 19.20 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉండగా.. మహీంద్రా స్కార్పియో క్లాసిక్ ధర రూ. 13.25 లక్షల నుంచి రూ. 17.06 లక్షల (ఎక్స్-షోరూమ్)తో అందుబాటులో ఉంది. అలాగే, మహీంద్రా స్కార్పియో-ఎన్ ధర రూ. 13.26 లక్షల నుంచి మొదలై రూ. 24.53 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. హ్యుందాయ్ జనవరి 16న భారత మార్కెట్లో క్రెటా 2024ని ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది.

Mahindra Scorpio beats Hyundai Creta in November sales

Mahindra Scorpio Hyundai Creta  

డీలర్ వర్గాల ప్రకారం.. కొత్త క్రెటా ఎంట్రీని ఊహించి చాలా మంది కస్టమర్‌లు తమ కొనుగోలును వాయిదా వేసుకున్నారు. గత రెండు నెలల్లో అమ్మకాలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. అయితే, ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు మొత్తం వాల్యూమ్‌ను పరిశీలిస్తే.. హ్యుందాయ్ క్రెటా మహీంద్రా స్కార్పియో కన్నా చాలా ముందంజలో నిలిచింది. ఈ కాలంలో, స్కార్పియో 85,612 యూనిట్ల నుంచి క్రెటా 108,584 యూనిట్లతో అధిగమించింది.

మహీంద్రా స్కార్పియో :
గత ఏడాది నవంబర్‌తో పోల్చితే.. దాదాపు 90 శాతం వృద్ధిని సాధించింది. ఎస్‌యూవీ విభాగంలో గత నెలలో మహీంద్రా స్కార్పియో అత్యధికంగా లాభపడింది. స్కార్పియో-ఎన్, స్కార్పియో క్లాసిక్ వెర్షన్‌లలో భారీగా విక్రయాలను నమోదు చేసింది. మహీంద్రా 6,455 యూనిట్ల ఎస్‌యూవీలను మాత్రమే విక్రయించింది. ఈ ఏడాది అక్టోబర్‌లో మహీంద్రా 13,578 యూనిట్లను డెలివరీ చేసింది.

హ్యుందాయ్ క్రెటా :
హ్యుందాయ్ క్రెటా భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడైన కాంపాక్ట్ ఎస్‌యూవీగా కొనసాగుతోంది. నవంబర్‌లో హ్యుందాయ్ 11,814 యూనిట్లను విక్రయించింది, అంతకు ముందు ఏడాది ఇదే నెలలో 13,321 యూనిట్ల నుంచి 10 శాతం తగ్గింది. పండుగ నెలలో విక్రయించిన 13,077 యూనిట్లతో పోలిస్తే ఈసారి విక్రయం తగ్గింది. హ్యుందాయ్ వచ్చే ఏడాది జనవరిలో కొత్త అవతార్‌లో క్రెటా ఎంట్రీ ఇవ్వనుంది. 2024 వెర్షన్ ద్వారా అమ్మకాలను పెంచుకోవాలని ఆటో దిగ్గజం భావిస్తోంది.

Read Also : Maruti Suzuki Jimny Discounts : మారుతి సుజుకి ఐదు డోర్ల జిమ్నీపై భారీ తగ్గింపులు.. 7 నెలల్లోనే ఎంత తగ్గిందంటే?