Samsung Galaxy S24 : శాంసంగ్ గెలాక్సీ S24 సిరీస్ 128జీబీ వేరియంట్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ధర ఎంతో తెలిసిందోచ్!

భారత మార్కెట్లో ఈ 5జీ ఫోన్ 12జీబీ వరకు ర్యామ్, 512జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజీతో ఎక్సినోస్ 2400 ఎస్ఓసీ ద్వారా పవర్ అందిస్తుంది.

Samsung Galaxy S24 : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లోకి సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ నుంచి సరికొత్త వేరియంట్ ఫోన్ రాబోతోంది. 2024 జనవరిలో భారత్‌లో శాంసంగ్ గెలాక్సీ ఎస్24 సిరీస్ మోడల్‌లతో పాటు గెలాక్సీ ఎస్24 ప్లస్, గెలాక్సీ ఎస్24 అల్ట్రాతో పాటు లాంచ్ అయింది.

Read Also : Vivo V30e Launch : ఈ వారమే కొత్త వివో V30e ఫోన్ వచ్చేస్తోంది.. ధర ఎంత? ఏయే స్పెషిఫికేషన్లు ఉండొచ్చుంటే?

అయితే, బేస్ గెలాక్సీ S24 మోడల్ డైనమిక్ అమోల్డ్ 2ఎక్స్ డిస్‌‌ప్లే, ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్, 4,000ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. దేశంలో ఈ ఫోన్ 2 ర్యామ్, స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లలో అందుబాటులో ఉంది. టిప్‌స్టర్ ప్రకారం.. శాంసంగ్ త్వరలో మూడో చౌకైన వేరియంట్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేయనుంది.

శాంసంగ్ మొదటి వేరియంట్ల ధర ఎంతంటే? :
టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ (@yabhishekhd) ప్రకారం.. 8జీబీ ర్యామ్, 128జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో కొత్త శాంసంగ్ గెలాక్సీ ఎస్24 వేరియంట్ ధరను చూపే ఒక ఫొటోను పోస్ట్‌లో షేర్ చేసారు. లీకైన ఫొటో ప్రకారం.. ఈ ఫోన్ ధర రూ. 74,999 ఉంటుంది. ఈ కొత్త వేరియంట్ అధికారికంగా ప్రకటించలేదు. ప్రస్తుతం 8జీబీ+ 256జీబీ, 8జీబీ+ 512జీబీ వేరియంట్‌ల ధర వరుసగా రూ. 79,999, రూ. 89,999 అందుబాటులో ఉండనుంది.

శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ఫోన్ 6.2-అంగుళాల ఫుల్-హెచ్‌డీ+ డైనమిక్ అమోల్డ్ 2ఎక్స్ డిస్‌ప్లేతో 120హెచ్‌జెడ్ వరకు రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. భారత మార్కెట్లో ఈ 5జీ ఫోన్ 12జీబీ వరకు ర్యామ్, 512జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజీతో ఎక్సినోస్ 2400 ఎస్ఓసీ ద్వారా పవర్ అందిస్తుంది. ఆండ్రాయిడ్ 14-ఆధారిత వన్ యూఐ 6.1తో రన్ అవుతుంది. ఆప్టిక్స్ విషయానికి వస్తే.. శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్‌తో వస్తుంది.

వైడ్ లెన్స్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో 50ఎంపీ ప్రైమరీ సెన్సార్, అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్‌తో 12ఎంపీ సెన్సార్, 3ఎక్స్ ఆప్టికల్ జూమ్‌తో 10ఎంపీ టెలిఫోటో షూటర్ ఉన్నాయి. ఈ హ్యాండ్‌సెట్ ముందు కెమెరా 12ఎంపీ సెన్సార్‌ను కలిగి ఉంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ఫోన్ 4,000ఎంఎహెచ్ బ్యాటరీతో 25డబ్ల్యూ వైర్డు, 15డబ్ల్యూ వైర్‌లెస్ ఛార్జింగ్, అలాగే వైర్‌లెస్ పవర్‌షేర్ టెక్నాలజీకి సపోర్టు ఇస్తుంది.

5జీ, 4జీ ఎల్‌టీఈ, వై-ఫై 6ఇ, బ్లూటూత్ 5.3, వై-ఫై డైరెక్ట్, యూఎస్‌బీ టైప్-సి కనెక్టివిటీకి కూడా సపోర్టు ఇస్తుంది. దుమ్ము, స్ప్లాష్ నిరోధకతకు ఐపీ68 రేటింగ్‌తో వస్తుంది. బేస్ గెలాక్సీ ఎస్24 మోడల్ భారత మార్కెట్లో అంబర్ ఎల్లో, కోబాల్ట్ వైలెట్, ఒనిక్స్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది. దేశంలో ప్రత్యేక శాంసంగ్ వెబ్‌సైట్లో ప్రత్యేక షేడ్స్ అయిన జేడ్ గ్రీన్, సప్పైర్ బ్లూ, స్టాండ్ స్టోన్ ఆరేంజ్ ఆప్షన్లలో కూడా అందుబాటులో ఉంది.

Read Also : Flipkart Big Saving Days Sale : ఫ్లిప్‌కార్ట్ సేల్‌కు ముందే ఆపిల్ ఐఫోన్ 14, ఐఫోన్ 12పై భారీ డిస్కౌంట్లు.. ఈ డీల్స్ పొందాలంటే?

ట్రెండింగ్ వార్తలు