Samsung Galaxy S24 Ultra
శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా 5Gపై ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్, బ్యాంక్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. సుమారు రూ.85,000 బడ్జెట్‌లో కొత్త ఆండ్రాయిడ్ డివైస్ కొనాలని భావిస్తున్నవారికి ఇది మంచి అవకాశం. శాంసంగ్ అధికారిక స్టోర్‌లో దీని అసలు ధర రూ.1,19,999గా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.83,000 కంటే తక్కువకు లభిస్తోంది.
ధర వివరాలు
ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా 5G.. 12GB RAM, 256GB వేరియంట్ ధర రూ.83,588గా ఉంది. అంటే, ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.36,411 తగ్గింపు లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వాడితే రూ.4,000 అదనపు తగ్గింపు ఆఫర్ ఉంది.
దీంతో ఫోన్ ధర రూ.80,000కు తగ్గుతుంది. EMI, నో కాస్ట్ EMI ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. పాత మొబైల్‌ను ఎక్స్ఛేంజ్ చేసుకుంటే మరింత తగ్గింపు పొందవచ్చు. అయితే ఫోన్ స్థితి, మోడల్, బ్రాండ్ ఆధారంగా ఎక్స్ఛేంజ్ విలువ నిర్ణయిస్తారు.
ఫీచర్లు
శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా 5G 6.8 అంగుళాల బ్రైట్ AMOLED LTPO డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ తో అందుబాటులో ఉంది. Snapdragon 8 Gen 3 ప్రాసెసర్ తో వచ్చింది.
గరిష్ఠంగా 12GB RAM, 1TB స్టోరేజ్ వరకు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. 5,000mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. డివైస్ One UI 7 మీద రన్ అవుతుంది.
కెమెరా విషయానికి వస్తే, 200MP ప్రధాన కెమెరా, 12MP అల్ట్రావైడ్, 50MP పెరిస్కోప్ టెలిఫొటో, 10MP టెలిఫొటో 3x జూమ్ ఫీచర్ ఉంది. సెల్ఫీల కోసం 12MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది.