భారీ బ్యాటరీలు ఉండే ఈ 4 కిర్రాక్ స్మార్ట్‌ఫోన్ల ధర రూ.10 వేలలోపే… ఇంత తక్కువ ధరకు మరీ ఇంత మంచి ఫోన్లా?
ఇందులో 50MP మెయిన్ కెమెరా, 6000mAh బ్యాటరీ ఉన్నాయి.

అతి తక్కువ ధరకు వచ్చే స్మార్ట్‌ఫోన్ కొనాలని భావిస్తున్నారా? రూ.10,000లోపు లభ్యమయ్యే టాప్ 5G స్మార్ట్‌ఫోన్‌లుగా లావా స్టార్మ్ ప్లే, ఐకూ Z10 లైట్ 5G, శాంసంగ్ M06 5G, ఇన్ఫినిక్స్ హాట్ 50 5Gను చెప్పుకోవచ్చు. మంచి కెమెరా సెటప్‌లు, భారీ బ్యాటరీ, హై రిఫ్రెష్ రేట్ స్క్రీన్ వంటి ఫీచర్లు వీటిలో ఉన్నాయి.
Lava Storm Play
Lava Storm Play 6.75-ఇంచ్ HD+ LCD స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్ తో వచ్చింది. మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్ ఉంది. 6జీబీ LPDDR5 RAM, 128జీబీ UFS 3.1 స్టోరేజ్, మైక్రో SD ద్వారా స్టోరేజ్ పెంచొచ్చు. కెమెరా సెటప్‌లో 50MP Sony IMX752 ప్రైమరీ, 2MP సెకండరీ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. 18వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీ ఉంది.
iQOO Z10 Lite 5G
iQOO Z10 Lite 5G 6.74-ఇంచ్ HD+ LCD స్క్రీన్, 90Hz రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ బ్రైట్‌నెస్ తో అందుబాటులో ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, Mali-G57 MC2 GPU ఉన్నాయి. 8జీబీ LPDDR4X RAM, 256జీబీ స్టోరేజ్, 1TB వరకు స్టోరేజ్ పెంచే అవకాశం ఉంది. 50MP మెయిన్ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్, 5MP ఫ్రంట్ కెమెరా. 15వాట్ ఛార్జింగ్, 6000mAh బ్యాటరీ ఉన్నాయి.
Also Read: విజయ్ సేల్స్ “మెగా ఓపెన్ బాక్స్ సేల్”.. ఈ స్మార్ట్‌ఫోన్లపై కళ్లుచెదిరే ఆఫర్స్..
Samsung M06 5G
Samsung M06 5G 6.7-ఇంచ్ HD+ LCD స్క్రీన్, 800 నిట్స్ బ్రైట్‌నెస్ తో వచ్చింది. డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, Mali-G57 MC2 GPUతో వచ్చింది. 4/6GB LPDDR4X RAM, 128GB స్టోరేజ్, 1TB వరకు పెంచొచ్చు. 50MP మెయిన్ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్, 8MP ఫ్రంట్ కెమెరా. 5000mAh బ్యాటరీ, 25వాట్ ఫాస్ట్ ఛార్జింగ్. సైడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, స్పీకర్ ఉంటుంది.
Infinix Hot 50 5G
Infinix Hot 50 5G 6.7-ఇంచ్ HD+ LCD స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, Mali-G57 MC2 GPUతో వచ్చింది. 8జీబీ LPDDR4X RAM, 128జీబీ UFS 2.2 స్టోరేజ్, 1TB వరకు స్టోరేజ్ పెంచే అవకాశం. 48MP Sony IMX582 మెయిన్ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా. 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, 5000mAh బ్యాటరీ సామర్థ్యంతో అందుబాటులో ఉంది.