విజయ్ సేల్స్ “మెగా ఓపెన్ బాక్స్ సేల్”.. ఈ స్మార్ట్‌ఫోన్లపై కళ్లుచెదిరే ఆఫర్స్‌..

విజయ్ సేల్స్ వెబ్‌సైట్ లేదా స్టోర్‌లలో కొనొచ్చు.

విజయ్ సేల్స్ “మెగా ఓపెన్ బాక్స్ సేల్”.. ఈ స్మార్ట్‌ఫోన్లపై కళ్లుచెదిరే ఆఫర్స్‌..

Updated On : June 29, 2025 / 8:15 PM IST

ఇండియాలోని టాప్ ఎలక్ట్రానిక్స్ రిటైల్ చైన్ విజయ్ సేల్స్ “మెగా ఓపెన్ బాక్స్ సేల్”ను జూన్ 28న ప్రారంభించింది. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్‌లు, కంప్యూటర్లు, టీవీలు, వాషింగ్ మెషీన్‌లు, టాబ్లెట్‌లు తక్కువ ధరకు లభిస్తున్నాయి. విజయ్ సేల్స్ వెబ్‌సైట్ లేదా స్టోర్‌లలో కొనొచ్చు.

Samsung Galaxy S25 Plus
టాప్ ఎండ్ Samsung Galaxy S25 Plus (12జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్) ఎంఆర్పీ రూ.1,11,999. విజయ్ సేల్స్ “మెగా ఓపెన్ బాక్స్ సేల్”లో రూ.1,00,454కే అందుబాటులో ఉంది. 6.7-ఇంచ్ 120Hz అమోలెడ్ స్క్రీన్, గోరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ ఉంటుంది. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ వాడారు. 50MP ప్రైమరీ, 10MP టెలిఫోటో, 12MP అల్ట్రావైడ్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది.

Also Read: ఫ్లిప్ ఫోన్ కొనాలనుకుంటే ఇది గోల్డెన్ ఛాన్స్.. భారీ ఆఫర్..

Apple iPhone 15 Plus
ఈ ఐఫోన్ 128జీబీ స్టోరేజ్ డిస్ప్లే యూనిట్ ధర రూ. 57,990. 2023 సెప్టెంబర్‌లో లాంచ్ చేసిన ఈ ఫోన్‌లో 6.7-ఇంచ్ 120Hz సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ స్క్రీన్, ఎ16 బయోనిక్ ప్రాసెసర్ ఉంటుంది. ఐఓఎస్ 17తో పనిచేస్తుంది. 48MP ప్రైమరీ కెమెరా, 12MP అల్ట్రావైడ్ కెమెరా ఉంటుంది. ఈ సిమ్, IP68 డస్ట్ వాటర్ రెసిస్టెంట్ ఫీచర్లు ఉన్నాయి.

Xiaomi 14 Civi
Xiaomi 14 Civi డిస్ప్లే యూనిట్ ధర రూ. 32,999. 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ ఉంటుంది. స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 ప్రాసెసర్, 6.55-ఇంచ్ 120Hz అమోలెడ్ స్క్రీన్ వాడారు. HyperOS ఆధారంగా పనిచేస్తుంది. 4700ఎంఏహెచ్ బ్యాటరీ, 67వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, 50MP ప్రైమరీ, 12MP అల్ట్రావైడ్, 50MP టెలిఫొటో కెమెరా ఉంటాయి.

Nothing Phone (2a)
Nothing Phone (2a) 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,999. మార్చి 2024లో విడుదలైన ఈ ఫోన్‌లో 6.7-ఇంచ్ 120Hz అమోలెడ్ స్క్రీన్, Dimensity 7200 Pro ప్రాసెసర్ ఉంటాయి. 50MP ప్రైమరీ, 50MP అల్ట్రావైడ్ కెమెరా వాడారు. Nothing OS 2.0 ఆధారంగా మూడు సంవత్సరాల ఓఎస్ అప్‌డేట్‌లు వస్తాయి.

Apple iPad Air 2024
Apple iPad Air 2024 128జీబీ స్టోరేజ్ డిస్ప్లే యూనిట్ ధర రూ.45,000. 11-ఇంచ్ స్క్రీన్, ఎమ్2 సీపీయూ, ఐఓఎస్ 17.4, 7606 ఎంఏహెచ్ బ్యాటరీ, 12MP కెమెరా, 45వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్లు ఉంటాయి.